ఒక నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా, గొప్ప కలలు కనేలా భారతీయులకు సాధికారత కల్పించడం మరియు వారికి అవసరమైనప్పుడు ఎప్పుడైనా, ఎక్కడైనా మా ఫైనాన్షియల్ ప్రోడక్టులను అందించడం ద్వారా వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి వారికి భాగస్వామిగా ఉండడమే మా లక్ష్యం. భారతీయుల అవసరాలను తీర్చే మరియు ఆర్థిక చేర్పును ముందుకు తీసుకువెళ్లాడానికి దోహదపడే ప్రోడక్టులతో వారిని సాధికారపరచడం మా ఉద్దేశ్యం. ఒక బ్రాండ్‌గా, 129 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న, భారతదేశంలోని ప్రముఖ ఆటోమోటివ్ భాగాల సరఫరాదారులలో ఒకటైన 113-సంవత్సరాల టీవీఎస్ గ్రూప్‌లో పారంపర్యంగా మేము విశ్వసనీయత, విలువ మరియు సేవ అనే ఆస్తులను వారసత్వంగా పొందాము.
ప్రతి భారతీయుడి ఆకాంక్షలకు సాధికారత కల్పించడానికి: మా ప్రయాణం 2010లో ఏకైక లక్ష్యంతో ప్రారంభమైంది. ఈ ప్రయాణం అద్భుతంగా ఉంది, ముఖ్యమైన మైలురాళ్లతో గుర్తించబడింది.
మా లోగో అయిన ఆస్పైర్‌మార్క్ ఎదుగుదలను సూచిస్తుంది, ఒక బ్రాండ్‌గా టీవీఎస్ క్రెడిట్ తమ కస్టమర్లకు వాగ్దానం చేసే వృద్ధి, సానుకూల దృక్పథం, కలలను నెరవేర్చే ఒక సాధనంకి ప్రతీకగా నిలుస్తుంది.
మేము వ్రాసిన విధానం పెద్ద అక్షరాలతో, నమ్మకాన్ని కలిగించే విధంగా ఉంటుంది మరియు భవిష్యత్తు వైపు పురోగతిని సూచిస్తుంది.
మా బ్రాండ్ రంగులు నీలం మరియు ఆకుపచ్చ. నీలం, మా పేరెంట్ గ్రూప్ యొక్క గుర్తింపు నుండి ఉద్భవించింది, ఇది స్వేచ్ఛ, ప్రేరణ, విశ్వాసం మరియు స్థిరత్వాన్ని సూచిస్తుంది. మరోవైపు, ఆకుపచ్చ అనేది వృద్ధి, సామరస్యం మరియు పునరుద్ధరణను సూచిస్తుంది.
మేము ఎల్లప్పుడూ విశ్వసనీయంగా ఉండడానికి ప్రయత్నిస్తాము, మా పనుల ద్వారా మా కస్టమర్ విశ్వాసాన్ని గెలుచుకుంటాము.
మేము వినూత్నంగా ఆలోచిస్తాము, సమస్య మరియు పరిస్థితులకు తగ్గట్టు సరికొత్త, ఊహించని పరిష్కారాలను కనుగొంటాము.
మేము చురుగ్గా ఆలోచిస్తాము, ఇది ప్రజల అవసరాలను ముందుగానే అంచనా వేయడంలో, వాటి కోసం ముందుగానే సిద్ధం అవ్వడానికి సహాయపడుతుంది.
మేము ప్రతి కస్టమర్ గురించి శ్రద్ధ వహిస్తాము మరియు వారి వ్యక్తిగత పరిస్థితులు మరియు అవసరాలను అర్థం చేసుకోవడానికి కృషి చేస్తాము.
మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నాము, ఏదైనా సాధ్యమేనని విశ్వసిస్తాము మరియు మా కస్టమర్లలో ఈ నమ్మకాన్ని కలిగిస్తాము.