విజయానికి మార్గనిర్దేశం చేయడం, ఆదర్శవంతంగా వ్యవహరించడం
దేశ అభివృద్ధికి దోహదపడే విధంగా, ఆర్థిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చి, మీకు సాధికారత కల్పించేలా ప్రతినిత్యం ప్రేరణనిచ్చే మా ఆదర్శవంతమైన నాయకులను కలుసుకోండి.
రిటైల్ ఆస్తులు, ఇన్సూరెన్స్, కార్డులు మరియు సంపద నిర్వహణ లాంటి వివిధ ఆర్థిక ప్రోడక్ట్లలో 25 ఏళ్లకు పైగా వృత్తిపరమైన అనుభవం ఉన్న మా సిఇఒ, ఆషిష్ సప్రా టీవీఎస్ క్రెడిట్‌ను విస్తృతమైన డిజిటలైజేషన్, కస్టమర్ సముపార్జన మరియు సంపూర్ణ వృద్ధి యొక్క కొత్త యుగంలోకి నడిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. లాభం మరియు నష్టం (పి&ఎల్) నిర్వహణ, డిజిటల్ కార్యక్రమాలు, సీనియర్ వాటాదారుల నిర్వహణ మరియు వ్యాపారాలను లాభదాయకత వైపు నడిపించడంలో అతని అపార అనుభవం టీవీఎస్ క్రెడిట్ యొక్క ఉజ్వల భవిష్యత్తు పథాన్ని రూపొందిస్తోంది. అతని మార్గదర్శకత్వంలో, సంస్థ మొత్తం ఆదాయం మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఎఫ్వై23లో 51% పెరిగింది. వర్క్ ప్లేస్ కల్చర్ అసెస్మెంట్లో 'గోల్డ్ స్టాండర్డ్' అయిన గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్ సంస్థను 'గ్రేట్ ప్లేస్ టు వర్క్' గా గుర్తించింది.
మాతో చేరడానికి ముందు, ఆశీష్ హౌసింగ్ ఫైనాన్స్, జనరల్ ఇన్సూరెన్స్ మరియు ఎన్బిఎఫ్సి రంగాలలో ప్రముఖ కార్యకలాపాలను అందిస్తున్న బజాజ్ గ్రూప్‌లో 14 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి ఉన్నారు. అతని ప్రొఫెషనల్ ప్రయాణంలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ మరియు హెచ్ఎస్బిసి వద్ద విలువైన అనుభవాలు కూడా ఉన్నాయి. అతను ఐఎన్ఎస్ఇఎడి, ఫొంటైన్బ్లూ నుండి అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసారు.
రూప సంపత్ కుమార్, అకౌంటింగ్ కార్యకలాపాలు, ట్రెజరీ నిర్వహణ, సంస్థ నిర్మాణం, పాలన మరియు స్టేక్‌హోల్డర్ ఎంగేజ్మెంట్ నిర్వహణలో గొప్ప నైపుణ్యం కలిగిన ఒక అనుభవజ్ఞురాలైన ఆర్థిక నిపుణురాలు.
రూప భారతదేశంలో 20 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక చార్టర్డ్ అకౌంటెంట్ మరియు యు.ఎస్.ఎ లో సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్. ఇంతకుముందు, వీరు హిందూజా హౌసింగ్ ఫైనాన్స్‌లో సిఎఫ్ఒ గా ఉన్నారు మరియు హిందూజా లేల్యాండ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో ఆర్థికశాఖ అధిపతిగా పనిచేసారు. అక్కడ రూప, ఫైనాన్స్ అండ్ ట్రెజరీని నిర్వహించారు. ఆమె ప్రైస్ వాటర్ హౌస్ (పిడబ్ల్యుసి) మరియు ఐసిఐసిఐ బ్యాంక్‌తో కూడా పనిచేశారు.
అనంతకృష్ణన్ అనేది వివిధ భౌగోళిక ప్రాంతాలు, ప్రోడక్టులు మరియు విభాగాల వ్యాప్తంగా రిటైల్ వినియోగదారుల లెండింగ్‌లో 28 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక ఉత్సాహభరితమైన మరియు అనుభవజ్ఞులైన ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొఫెషనల్. ఈయన ప్రారంభం నుండి టివిఎస్ క్రెడిట్లో భాగంగా ఉన్నారు, రిటైల్ మరియు కన్జ్యూమర్ బిజినెస్ కోసం క్రెడిట్ హెడ్‌గా మరియు ప్రస్తుతం డ్యూరబుల్స్, స్మార్ట్ ఫోన్ ఫైనాన్సింగ్, పర్సనల్ లోన్లు, ఇన్‌స్టా కార్డ్, ఫీజు ఆదాయం మరియు గోల్డ్ లోన్ వ్యాపారాలను కలిగి ఉన్న కన్జ్యూమర్ బిజినెస్ వర్టికల్‌కు నాయకత్వం వహిస్తున్నారు.
అతను లాభదాయకమైన వ్యాపార విభాగాలను ఏర్పాటు చేయడం, కార్యకలాపాలను విస్తరించడం, ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలను పెంచడం మరియు మా ఫుట్‌ప్రింట్‌ను విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. శ్రీ అనంతకృష్ణన్ మా క్రెడిట్ & రిస్క్ ప్రాసెస్లు మరియు కార్యకలాపాలను కూడా ఆప్టిమైజ్ చేసారు, అలాగే, క్రాస్-సెల్లింగ్ మరియు డిజిటల్ ఫస్ట్ వ్యాపారాలను ప్రోత్సహించారు.
TVS క్రెడిట్ వద్ద శ్రీ అనంతకృష్ణన్ గారు విభిన్న రకాల ప్రోడక్టులను అమలు చేస్తూ, వ్యాపార విస్తరణ చేపట్టారు. వాటిలో టూ-వీలర్ లోన్లు, త్రీ-వీలర్ లోన్లు, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు, యూజ్డ్ కార్ లోన్లు మరియు పర్సనల్ లోన్లు ఉన్నాయి.
TVS క్రెడిట్లో చేరడానికి ముందు, వీరు బజాజ్ ఫిన్సర్వ్ మరియు చోళా DBS వద్ద విధులు నిర్వర్తించారు. అతను భారతియార్ విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ మరియు గ్రేట్ లేక్స్ మరియు ఎక్స్ఎల్ఆర్ఐ నుండి అనలిటిక్స్ సర్టిఫికేషన్ కలిగి ఉన్నారు.
టూ-వీలర్ మరియు యూజ్డ్ కార్ల రిటైల్ వ్యాపార విభాగానికి నాయకత్వం వహిస్తున్న మురళీధర్ శ్రీపతి, 15 ప్రధాన భారతీయ రాష్ట్రాల్లో 30 సంవత్సరాలకు పైగా బహుళ-కార్యాచరణ నైపుణ్యం కలిగిన ఒక అనుభవజ్ఞులైన నిపుణుడు మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన గతంలో సుందరం ఫైనాన్స్ చోళా విఎఫ్, అలాగే బిఎఎఫ్ఎల్ కోసం పని చేశారు. అమ్మకాలు, సేకరణలు, క్రెడిట్, బిజినెస్ కమర్షియల్ వాహనాలు, కొత్త కార్లు, యూజ్డ్ కార్లు, టూ-వీలర్లు, కార్పొరేట్ లీజింగ్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆఫీస్ ఆటోమేషన్ పరికరాలు మరియు వైద్య పరికరాలకు ఫైనాన్సింగ్ లాంటివి అతను నిర్వర్తించిన వాటిలో కొన్ని మాత్రమే.
అతని ప్రాథమిక సామర్థ్యాలలో క్రైసిస్ మేనేజ్మెంట్, స్టార్ట్-అప్ మరియు బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పనులు ఉన్నాయి. మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ అయిన అతను గ్రేట్ లేక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, చెన్నై నుండి బిజినెస్ అనలిటిక్స్ సర్టిఫికేషన్ కూడా కలిగి ఉన్నారు.
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎంబిఎ పూర్తి చేసిన సౌజన్య అలూరికి టెక్నాలజీ విజన్ మరియు స్ట్రాటజీలో 25 ఏళ్ల అనుభవం ఉంది. అంతేకాకుండా, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, ఆపరేషన్స్, అజైల్ ట్రాన్స్ఫర్మేషన్, క్లౌడ్ మరియు సైబర్ సెక్యూరిటీ లాంటి వాటిలో మంచి అనుభవం ఉంది. వీరు మాస్టర్ ఆఫ్ సైన్స్‌లో కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా పూర్తి చేసారు.
టీవీఎస్ క్రెడిట్ కంపెనీలో సౌజన్య గారు టెక్ & డిజిటల్ వ్యూహాన్ని రూపొందించేందుకు బాధ్యత వహిస్తారు. టీవీఎస్ క్రెడిట్లో చేరడానికి ముందు, సౌజన్య నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ)లో డిజిటల్ టెక్నాలజీ హెడ్‌గా వ్యవహరించారు, అలాగే, మొబైల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్‌లు, డేటా ప్లాట్‌ఫామ్‌లు, ఎఐ మోడల్‌లు, క్లౌడ్ ట్రాన్స్ఫార్మేషన్ మరియు బ్లాక్ చెయిన్ సెటిల్మెంట్ సిస్టమ్‌ల అభివృద్ధిలో కీలక పాత్రను పోషించారు. ఈమె జిఇ డిజిటల్, సిఫీ మరియు యాక్సెంచర్‌తో కూడా పనిచేసారు. ఆమెకు పర్యావరణం మరియు సుస్థిరత, అలాగే పఠనం అంటే చాలా చాలా ఇష్టం.
షెల్విన్ మాథ్యూస్ చార్టర్డ్ అకౌంటెంట్ (ఐసిఎఐ) మరియు కాస్ట్ & మేనేజ్మెంట్ అకౌంటెంట్ (ఐసిఎంఎఐ)గా ఆర్థిక సేవా రంగంలో 21 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. వీరు టీవీఎస్ క్రెడిట్ వద్ద సంస్థల స్థాయిలో బలమైన రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రేమ్‌వర్క్ అభివృద్ధి కోసం బాధ్యత వహిస్తారు. వీరు రుణ పరిశ్రమ కోసం సంస్థ స్థాయిలో రిస్క్ మేనేజ్మెంట్ (ఇఆర్ఎం) ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం, కెవైసి-ఎఎంఎల్ నిబంధనలను అమలు చేయడం, అలాగే, ఎన్‌బిఎఫ్‌సిల కోసం ఆర్బిఐ మార్గదర్శకాలతో పాటు రిస్క్ మేనేజ్మెంట్ పాలసీలను సమలేఖనం చేయడం లాంటి అంశాలలో మంచి అనుభవం కలిగి ఉన్నారు. షెల్విన్, ఐఐఎం బెంగళూరు నుంచి ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్లో సర్టిఫికేషన్ పొందారు. వీరు ఐఎస్ఒ 27001 (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్) మరియు ఐఎస్ఒ 22301 (బిజినెస్ కంటిన్యూటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్) సర్టిఫైడ్ ఇంటర్నల్ ఆడిటర్ కూడా. యుగ్రో క్యాపిటల్ లిమిటెడ్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్&టి ఫైనాన్స్ మరియు రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ (రిలయన్స్ క్యాపిటల్ యొక్క అనుబంధ సంస్థ) లాంటి పలు కార్పొరేట్ సంస్థల కోసం రిస్క్ మేనేజ్మెంట్ విభాగంలోని అనేక రంగాలలో పనిచేసారు.
ప్రశాంత్ సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉన్నారు మరియు సింబయోసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (ఎస్ఐబిఎం) పూణే నుండి ఎంబిఎ పట్టా పొందారు. ఈయన అమెరికా లోని సొసైటీ ఆఫ్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ నుండి ఎస్సిపి (సీనియర్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్) సర్టిఫికేషన్‌ను కలిగి ఉన్నారు.
అతను ప్లాంట్ హెచ్ఆర్, బిజినెస్ హెచ్ఆర్ పార్ట్నర్, ప్రాక్టీస్ లీడ్ హెచ్ఆర్ నుండి హెచ్ఆర్ లీడర్షిప్ వరకు తయారీ, ఐటి డిస్ట్రిబ్యూషన్, బ్యాంకింగ్, జనరల్ ఇన్సూరెన్స్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బిఎఫ్సి) మరియు హోమ్ ఫైనాన్స్ కంపెనీ (హెచ్ఎఫ్సి) వంటి వ్యాపారాలలో 25 సంవత్సరాల వైవిధ్యమైన అనుభవం కలిగి ఉన్నారు. అతను అనేక సంస్థలలో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్‌గా 18 సంవత్సరాలకు పైగా పీపుల్ ప్రాక్టీసెస్ కోసం నేతృత్వం వహించారు మరియు వివిధ మార్పు నిర్వహణ మరియు ఆలోచనా నాయకత్వ కార్యక్రమాలకు నేతృత్వం వహించారు. వ్యక్తుల కోసం సరైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడటానికి మరియు కస్టమర్ కేంద్రిత వ్యాపారం వంటి ప్రజలకు సంబందించిన చర్యలకు నేతృత్వం వహించడానికి ఈయన గర్వ పడుతున్నారు.
ఆయన కెరీర్లో దిలీప్ పిరామల్ గ్రూప్‌లో పనిచేశారు, ఇక్కడ ఈయన ప్లాంట్ హెచ్ఆర్ గా ఫౌండేషనల్ అనుభవాన్ని పొందారు మరియు తరువాత గోద్రేజ్ గ్రూప్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ లలో పనిచేశారు. మా సంస్థలో చేరడానికి ముందు, ఈయన 18 సంవత్సరాలకు పైగా రిలయన్స్ క్యాపిటల్ గ్రూప్‌తో ఉన్నారు. రిలయన్స్ క్యాపిటల్ గ్రూప్ లో ఈయన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మరియు చివరిగా గ్రూప్ స్థాయిలో హెచ్ఆర్ నాయకత్వ పాత్రలను కలిగి ఉన్నారు.
టీవీఎస్ క్రెడిట్ వద్ద చరణ్‌దీప్ సింగ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (సిఎంఒ)గా పనిచేసారు. వీరు పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుండి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌లో బి.టెక్, ముంబైలోని నర్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుండి మార్కెటింగ్‌లో ఎంబిఎ డిగ్రీని పూర్తి చేసారు. బిఎఫ్ఎస్ఐ మరియు ఆటోమోటివ్ పరిశ్రమలలో 18 సంవత్సరాల మార్కెటింగ్, సేల్స్, సిఆర్ఎం మరియు వ్యూహాత్మక నైపుణ్యం కలిగిన వీరు బ్రాండ్ కమ్యూనికేషన్, మార్కెట్ పరిశోధన, డిజిటల్ బిజినెస్, అనలిటిక్స్ మరియు కస్టమర్ రిలేషన్షిప్ నిర్వహణలో అనేక కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. అయన కంపెనీ వెబ్సైట్లు మరియు మొబైల్ యాప్‌లు క్రియేట్ చేయడంతో పాటు, అనేక అవార్డులు గెలుచుకున్న మార్కెటింగ్ ప్రచారాలతో సహా వివిధ పరివర్తనాత్మక ప్రయత్నాల కోసం నాయకత్వం వహించారు. అతను కస్టమర్ ఎంగేజ్మెంట్ మరియు అనుభవాన్ని మెరుగుపరిచే పలు కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేశారు.
టీవీఎస్ క్రెడిట్ యొక్క కొత్త బ్రాండ్ గుర్తింపును రూపొందించడంలో వీరు కీలక పాత్ర పోషించారు. ఇది మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా సంస్థకు కొత్త రూపాన్ని, గుర్తింపును కల్పించడంలో ఎంతగానో దోహదపడింది. వీరి మార్గదర్శకత్వంలో, ఈ సంస్థ వివిధ మార్కెటింగ్ కార్యక్రమాల కోసం అనేక అవార్డులను అందుకుంది, వీటిలో ప్రఖ్యాత ఆర్ఎంఎఐ ఫ్లేమ్ అవార్డులు ఆసియా 2018లో ఉత్తమ విజిబిలిటీ మరియు విజువల్ క్యాంపెయిన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా ఉంది. 2020 సంవత్సరానికి గాను ఆసియా టాప్ కంటెంట్ మొఘల్‌గా గుర్తింపు పొందారు. 2018లో అడోబ్ డిజి100 నుండి టాప్100 డిజిటల్ మార్కెటర్లలో ఒకరిగా పేరు సంపాదించారు, 2018లో లింక్డ్ఇన్ నుండి కంటెంట్ మార్కెటింగ్ విభాగంలో టాప్50 లీడర్స్ జాబితాలో ఒకరిగా నిలిచారు. అంతేకాకుండా, ఎంఎంఎఫ్ఎస్ఎల్లో ఉన్నప్పుడు, వీరు 2017 రూరల్ మార్కెటింగ్ అవార్డులలో యూత్ అచీవర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు.
PV కస్తూరిరంగన్, వివిధ ఆర్థిక రంగాల్లో 25 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఒక చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. టివిఎస్ క్రెడిట్ చీఫ్ ట్రెజరీ ఆఫీసర్‌గా ఈయన లయబిలిటీ మేనేజ్మెంట్, పెట్టుబడులు, రేటింగ్‌లు మరియు బాహ్య వాటాదారుల ఇంటరాక్షన్లను పర్యవేక్షిస్తారు. పన్నులు, ఖర్చులు, ఆడిటింగ్, ఆర్థిక నివేదికలు మరియు వ్యూహాత్మక ఆర్థిక ప్రణాళిక మరియు నిర్వహణ లాంటి ప్రధానమైన అంశాల్లో వీరికి అపారమైన అనుభవం ఉంది. టివిఎస్ క్రెడిట్లో చేరడానికి ముందు ఈయన నిస్సాన్ అశోక్ లేల్యాండ్ జెవిలలో సిఎఫ్ఒ గా ఉన్నారు. అంతర్జాతీయ ఎక్స్‌పోజర్‌తో పాటు రెండు ముఖ్యమైన సంస్థలు, టివిఎస్ మరియు అశోక్ లేల్యాండ్‌తో అనేక రంగాలలో వారికి పని అనుభవం ఉంది.
పియూష్ చౌదరికి దాదాపు 19 సంవత్సరాల ఆడిటింగ్ అనుభవం ఉంది మరియు వీరు చార్టర్డ్ అకౌంటెంట్ (ICAI), CISA (పాస్డ్) (బిగ్ 4స్ మరియు BFSI పరిశ్రమ) కూడా పనిచేసారు. టివిఎస్ క్రెడిట్ వద్ద చీఫ్ ఇంటర్నల్ ఆడిట్ ఆఫీస్‌గా ఆర్బిఐ ప్రమాణాలకు అనుగుణంగా ఐఎస్ ఆడిట్ ఫ్రేమ్‌వర్క్‌తో సహా బలమైన రిస్క్ ఆధారిత ఇంటర్నల్ ఆడిట్ (ఆర్బిఐఎ) ఫ్రేమ్‌వర్క్ స్థాపనకు ఈయన నాయకత్వం వహిస్తున్నారు. ఈయనకి నైపుణ్యం ఉన్న కీలక రంగాలలో బ్యాంకులు మరియు నాన్-బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సిలు) రిస్క్ ఆధారిత అంతర్గత ఆడిట్ (ఆర్బిఐఎ) ఫ్రేమ్వర్కులు రూపొందించడం, అంతర్గత ఆడిట్ విధానాలను ఆటోమేట్ చేయడం, ఐఎస్ ఆడిట్లను నిర్వహించడం, ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్లు మరియు ఆడిట్ కమిటీలకు ఫలితాన్ని నివేదించడం ఉన్నాయి. వీరికి PwC మరియు డెలాయిట్ సంస్థలలో సిస్టమ్ మరియు ప్రాసెస్ అస్యూరెన్స్ విభాగాల్లో అనేక ప్రాజెక్టుల కోసం (అప్లికేషన్ కంట్రోల్స్ టెస్టింగ్, ITGC ఆడిట్స్, SOX, SSAE 16 ఎంగేజ్మెంట్స్) కోసం పనిచేసిన అనుభవం ఉంది.
వికాస్ అరోరా అనే వ్యక్తి ప్రధానంగా బిఎఫ్ఎస్ఐ రంగంలో సుమారు 20 సంవత్సరాల అనుభవంతో ఒక అనుభవజ్ఞులైన సమ్మతి, పరిపాలన మరియు చట్టపరమైన నిపుణుడు. ఈయనకు ఎన్బిఎఫ్సి కంప్లయెన్స్, కార్పొరేట్ చట్టం, గవర్నెన్స్, డేటా ప్రైవసీ, కార్మిక చట్టాలు, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, లిటిగేషన్ మరియు ఎఫ్ఇఎంఎ, అలాగే యాంటీ-ఫ్రాడ్ మేనేజ్మెంట్ మరియు పిఎంఎల్ఎ కంప్లయెన్స్‌లో నైపుణ్యం ఉంది. ఈయనకు కంపెనీ సెక్రటరీ (ఐసిఎస్ఐ), లా గ్రాడ్యుయేట్ (ఎల్ఎల్బి) మరియు బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అర్హత కలిగి ఉన్నారు. ఒక చీఫ్ కంప్లయెన్స్ అధికారిగా వికాస్, బలమైన కంప్లయెన్స్ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు మరియు సంస్థ యొక్క కంప్లయెన్స్ సంస్కృతి కోసం మార్గనిర్దేశం చేసేందుకు బాధ్యత వహిస్తారు. TVS క్రెడిట్లో చేరడానికి ముందు, వీరు BMW ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో కంప్లయెన్స్, లీగల్ మరియు కంపెనీ సెక్రటరీగా పనిచేసారు. అలాగే, గతంలో GE మనీ, కెనరా HSBC లైఫ్ ఇన్సూరెన్స్ మరియు జెన్పాక్ట్లో విధులు నిర్వర్తించారు.
సైన్అప్ చేసి పొందండి తాజా అప్డేట్లు మరియు ఆఫర్లు