లోన్ లేదా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా?
వెంటనే సిబిల్ స్కోర్‌ను చెక్ చేయండి!
మీరు తక్కువ క్రెడిట్ స్కోరును కలిగి ఉంటే లోన్ పై అధిక వడ్డీ లేదా క్రెడిట్ కార్డును తిరస్కరించే అవకాశం ఉంటుంది.
మంచి క్రెడిట్ స్కోర్ తప్పనిసరి.
అయితే, మంచి సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?
క్రెడిట్ స్కోర్ అనేది ఒక వ్యక్తి క్రెడిట్ చరిత్ర విశ్లేషణ ఆధారంగా అతనికి కేటాయించే ఒక నంబర్. మీరు లోన్ తీసుకోవడానికి అర్హులా కాదా అనేది మీ క్రెడిట్ స్కోర్ నిర్ణయిస్తుంది. మంచి క్రెడిట్ స్కోర్ అనేది ఒక వ్యక్తి తన అప్పులను సకాలంలో చెల్లిస్తారని చూపుతుంది, తద్వారా భవిష్యత్తులో లోన్లను వేగంగా మరియు తక్కువ వడ్డీతో పొందే అవకాశాలను పెంచుతుంది. క్రెడిట్ స్కోర్ అనేది 300 నుండి 900 మధ్య ఒక సంఖ్య మరియు 700 కంటే ఎక్కువగా ఉన్న ఏదైనా సంఖ్య ఒక మంచి సిబిల్ స్కోరుగా పరిగణించబడుతుంది.
అయితే, 700 కంటే తక్కువ స్కోర్ అంటే, లోన్ పొందడం చాలా కష్టం అని అర్థం.
మంచి వార్త ఏంటంటే మీ సిబిల్ స్కోర్‌ను మెరుగుపరచడం సాధ్యమవుతుంది. కాబట్టి, చింతించడం మానేయండి మరియు మీ సిబిల్ స్కోర్‌ను మెరుగుపరచడానికి ఒక అడుగు ముందుకు వేయండి.
మీ సిబిల్ స్కోర్‌ను వెంటనే మెరుగుపరచడానికి కొన్ని ఉత్తమ చిట్కాలను అనుసరించండి:
1. మీ క్రెడిట్ రిపోర్టును విశ్లేషించి, ఏవైనా తప్పులు ఉంటే సరిచేయండి
మీ క్రెడిట్ స్కోరు బాగుందని మీరు అనుకోవచ్చు. అయితే, మీరు సిబిల్ క్యాలిక్యులేటర్ ఉపయోగించి ఆన్లైన్లో మీ సిబిల్ స్కోరును చెక్ చేయాలి. ఒకవేళ మీ స్కోర్ పేలవంగా ఉంటే, అది అడ్మినిస్ట్రేటివ్ లోపం వల్ల కావచ్చు. మీరు లోన్‌ను చెల్లించి ఉండవచ్చు మరియు అది ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న ఇఎంఐలను చూపవచ్చు. అలాగే, ఏదైనా అనుమానాస్పద చర్యల కోసం చెక్ చేయండి; ఇది ఒక మోసం కూడా కావచ్చు. అటువంటి లోపాలు లేదా చర్యలు అనేవి భవిష్యత్తులో మీరు అప్పు తీసుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. ఒకవేళ మీరు ఇలాంటి లోపాలను కనుగొన్నట్లయితే, సిబిల్ కు రిపోర్ట్ చేయండి మరియు వెంటనే వివాదాన్ని పరిష్కరించండి. సవరించిన స్కోరు సానుకూలంగా ఉండవచ్చు. [మా క్రెడిట్ క్యాలిక్యులేటర్‌లో మీ సిబిల్ స్కోర్‌ను చెక్ చేయండి]
2. ప్రతిసారీ సకాలంలో చెల్లించండి!
కొంతమంది తమ బిల్లులను ఆలస్యంగా చెల్లించగా, మరికొందరు పూర్తిగా చెల్లించరు. అయితే, ఒకే ఒక్క ఆలస్య చెల్లింపు కూడా క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి, గడువు తేదీకి ముందే మొత్తం చెల్లింపు చేయడం ఎల్లప్పుడూ మంచి పద్ధతి. గడువు తేదీకి కనీసం ఐదు రోజుల ముందు చెల్లింపు చేయడం మరియు చెక్కు ద్వారా చెల్లించడం అనేది, గడువు తేదీకి 10 రోజుల ముందు మీ సిబిల్ స్కోర్ గ్రీన్ జోన్‌కు తీసుకువెళ్తుంది.
3. మీ క్రెడిట్ కార్డులను తెలివిగా ఉపయోగించండి!
క్రెడిట్ కార్డులు ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప సాధనం లాంటిది. ఇది అనేక ప్రయోజనాలతో లభిస్తుంది; ఇది మన అవసరాలకు తగినంత క్రెడిట్, రివార్డ్ పాయింట్లు, ఉచిత వోచర్లు మరియు నగదు లేకుండా తిరిగేందుకు మనశ్శాంతిని అందిస్తుంది. అయితే, ఖర్చు క్రమశిక్షణలో ఏవైనా సమస్యలను నివారించడానికి మీరు మీ క్రెడిట్ కార్డు వాడకాన్ని పరిమితం చేయాలి. కొందరు 30 శాతం క్రెడిట్ వినియోగ నియమాన్ని పాటించాలని అడుగుతున్నారు, మీ పరిమితిలో 50 శాతం ఖర్చు చేయాలని మరికొందరు సలహా ఇస్తున్నారు. సురక్షితమైన వైపు ఉండడానికి మనం 40 శాతంతో ముందుకు వెళదాం. క్రెడిట్ కార్డును అవసరమైన చోట ఉపయోగించడం వల్ల మీరు మంచి సిబిల్ స్కోర్ సాధించవచ్చు.
4. తక్కువ వ్యవధిలో బహుళ లోన్లు/ క్రెడిట్ కార్డు అప్లికేషన్లను నివారించండి!
తక్కువ సమయంలో లోన్లు మరియు క్రెడిట్ కార్డు కోసం పలుమార్లు విచారణలు జరపడం అనేది మంచి అభిప్రాయాన్ని సూచించవు. ఇది మీరు ఎప్పుడూ అవసరంతో ఉన్నారని, అనేక వనరుల నుండి క్రెడిట్ కోసం చూస్తున్నారని చూపిస్తుంది. కాబట్టి, మీరు మీ స్కోర్ తగ్గకూడదని కోరుకుంటే, అప్పుడు మీరు తక్కువ సమయంలోనే అనేక క్రెడిట్ కార్డులు, లోన్ల కోసం అప్లై చేయడం మానుకోవాలి. అంతేకాకుండా, కొందరు రుణదాతలు మీ పరిస్థితిని ఆసరాగా చేసుకుని, అధిక వడ్డీ రేటు రుణాలతో మిమ్మల్ని ఆకర్షించవచ్చు.
- బోనస్ చిట్కాలు:సెక్యూర్డ్ మరియు అన్సెక్యూర్డ్ లోన్ల సరైన కలయికను పొందండి.
- అధిక వడ్డీ రేట్లు కలిగిన రుణాలను మొదట చెల్లించండి.
- క్రెడిట్ కార్డుతో రుణాలు చెల్లించవద్దు.
- పాత క్రెడిట్ కార్డును ఉపయోగించండి.
- మీ మొదటి క్రెడిట్ కార్డును తెలివిగా ఆలోచించి పొందండి.
- మీ క్రెడిట్ పరిమితిని పెంచుకోండి.