మండే వేసవి అయినా లేదా గడ్డకట్టే శీతాకాలం అయినా,హోమ్ అప్లయెన్సెస్ మరియు ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల డిమాండ్ ఎప్పటికీ తగ్గిపోదు. మీరు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, మ్యూజిక్ సిస్టమ్‌లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు, టెలివిజన్లు, మైక్రోవేవ్‌లు మరియు రిఫ్రిజిరేటర్లు లాంటి కన్జ్యూమర్ డ్యూరబుల్ ప్రోడక్టులను కొనుగోలు చేయాలనుకుంటారు. రిటైలర్లు మరియు బ్యాంకులు వివిధ డిస్కౌంట్ ఆఫర్లు, ఫైనాన్సింగ్ ఎంపికలతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపికల్లో క్రెడిట్ కార్డ్ ఒకటి కాగా, మీరు మీ క్రెడిట్ కార్డును స్వైప్ చేయడానికి ముందు కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు అనే మరొక ఎంపికను పరిగణించండి.
కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు – ఎందుకు?
కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు అనేవి సులభమైన ఇఎంఐ రీపేమెంట్ ఎంపికలపై ఒక ప్రోడక్ట్ కొనుగోలు చేయడానికి బ్యాంక్ మీకు అందించే లోన్లు. అంతేకాకుండా, మీరు లోన్ పొందడానికి మీ వ్యక్తిగత ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు, మీరు తక్షణ ఆమోదం పొందవచ్చు. అలాగే, ఇతర లోన్లతో పోలిస్తే అర్హత ప్రమాణాలు కఠినంగా ఉండవు మరియు అతి తక్కువ డాక్యుమెంటేషన్ అవసరం అవుతుంది.
కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు – ఎలా?
మీరు కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లను పొందాలని అనుకుంటున్నట్లయితే, మీరు దానిని ఎంచుకునే ముందు తప్పనిసరిగా పరిగణించవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలను చూడండి
1. వడ్డీ రేటు
పొందేటప్పుడు కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లుపొందే సమయంలో, వడ్డీ రేటు అత్యంత ముఖ్యమైన నిర్ణయాత్మక అంశాల్లో ఒకటిగా ఉండాలి, ఎందుకంటే ఇది ప్రోడక్ట్ యొక్క వాస్తవ ధర కాకుండా మీరు చెల్లించవలసిన అదనపు మొత్తాన్ని నిర్ణయిస్తుంది. సాధారణంగా, క్రెడిట్ కార్డులు లేదా ఇతర రకాల లోన్లతో పోలిస్తే సిడి లోన్లపై వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. కొన్ని ఆర్థిక సంస్థలు కన్జ్యూమర్ డ్యూరబుల్ ప్రోడక్టుల నిర్దిష్ట శ్రేణిపై 0% వడ్డీ ఆఫర్లను కూడా అందిస్తాయి.
2. అవధి
కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ అవధి అనేది మీరు వాయిదాలు చెల్లించాల్సిన నెలల సంఖ్య మరియు ప్రతి నెలా మీరు చెల్లించవలసిన మొత్తాన్ని సూచిస్తుంది. సాధారణంగా, లోన్ అవధి 3 నుండి 24 నెలల మధ్యన ఉంటుంది. అయితే, ఇది మళ్లీ ఆర్థిక సంస్థ మరియు మీరు కొనుగోలు చేస్తున్న ప్రోడక్ట్ పై ఆధారపడి ఉంటుంది. తక్కువ అవధిని ఎంచుకోవడం మంచిది, తద్వారా మీరు వడ్డీగా ఎక్కువ డబ్బును కోల్పోకుండా వీలైనంత త్వరగా లోన్ తిరిగి చెల్లించవచ్చు.
3. డౌన్ పేమెంట్
సాధారణంగా, బ్యాంకులు ఒక ప్రోడక్ట్ మొత్తంలో 80 నుండి 95 శాతం వరకు లోన్లు అందిస్తాయి, అంటే మీరు మిగిలిన మొత్తాన్ని డౌన్ పేమెంట్ రూపంలో చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి, లోన్ కోసం అప్లై చేయడానికి ముందు మీరు ఈ వివరాలను చెక్ చేయాలి, తద్వారా మీరు డౌన్ పేమెంట్ మొత్తానికి సిద్ధంగా ఉండవచ్చు.
4. రహస్య ఖర్చులు
నిర్దిష్ట శ్రేణి ప్రోడక్ట్‌లపై 0 శాతం వడ్డీ ఉంటుందని ఆఫర్ పేర్కొనవచ్చు. అయితే, ప్రాసెసింగ్ ఫీజు లాంటి ఇతర ఛార్జీలు కూడా ఉండవచ్చు. అలాగే, మీరు ఒక సిడి లోన్ కోసం ఎంచుకున్నట్లయితే, ఆ ప్రోడక్ట్ పై ఎలాంటి డిస్కౌంట్ పొందలేరు అనే నిబంధనలు కూడా ఉండవచ్చు. కాబట్టి, చివరికి మీరు ఒక విధంగా లేదా మరొక విధంగా డబ్బును కోల్పోయే అవకాశం ఉంది.
5. డాక్యుమెంటేషన్
అతి తక్కువ డాక్యుమెంటేషన్ కారణంగా కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు, పొందడానికి సులభమైన లోన్లలో ఒకటిగా ఉంటాయి. మీరు మీ గుర్తింపు రుజువు, చిరునామా రుజువు, ఆదాయ రుజువును సమర్పించాలి మరియు మీరు తక్షణ ఆమోదం పొందవచ్చు.