ప్రస్తుతం ఉన్న మహమ్మారి పరిస్థితిలో టీవీఎస్ క్రెడిట్ వద్ద ఇంటర్న్‌షిప్ ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందించింది. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, టీవీఎస్ క్రెడిట్ వద్ద ఇంటర్న్‌షిప్ అనుభవం ఉత్తేజకరంగా మరియు అద్భుతంగా ఉంది. 2 నెలల స్వల్ప వ్యవధిలో, నేను చాలా కొత్త విషయాలను నేర్చుకోగలిగాను, అనేక మందితో ఇంటరాక్ట్ అవ్వగలిగాను, నా ఆలోచనలకు స్పష్టత తీసుకురాగలిగాను మరియు కొన్ని ఉత్తేజకరమైన ప్రాజెక్టులపై పని చేసాను. టీవీఎస్ క్రెడిట్ వద్ద నా ఇంటర్న్‌షిప్ ఒక ప్రత్యేకమైన మరియు ఆనందదాయకమైన ప్రయాణం.
వర్క్-లైఫ్ వెర్షన్ 2
టీవీఎస్ క్రెడిట్ వద్ద నా ఇంటర్న్‌షిప్ మే 4, 2020 నుండి జూన్ 30, 2020 వరకు సాగింది. మహమ్మారి కొనసాగుతున్న కారణంగా ఇంటర్న్‌షిప్ ప్రక్రియ మొత్తం వర్చువల్ రూపంలో సాగింది. ఇంటర్న్‌షిప్ ప్రారంభం అవ్వడానికి ముందు, టీవీఎస్ క్రెడిట్లోని మొత్తం ఇంటర్న్‌షిప్ బృందం క్రమం తప్పకుండా మమ్మల్ని సంప్రదించారు, మరియు వారు ఇంటర్న్‌షిప్ ప్రక్రియ గురించి మాకు సమాచారం అందించారు. ప్రారంభంలో, పరిచయ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి, సహచర ఇంటర్న్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇవి సహాయపడ్డాయి. సంస్థ మరియు దాని పనితీరు గురించి మా కోసం ఒక ఓరియెంటేషన్ కార్యక్రమం కూడా నిర్వహించబడింది. వివిధ విభాగాల వ్యాప్తంగా సీనియర్ లీడర్షిప్ బృందంతో మాకు ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించబడ్డాయి. ఈ వర్చువల్ సెషన్ల ద్వారా, మేము టీవీఎస్ క్రెడిట్ యొక్క వివిధ వ్యాపారాల గురించి అనేక విషయాలు తెలుసుకున్నాము. మహమ్మారి మరియు లాక్డౌన్ కారణంగా నిర్బంధాలు ఉన్నప్పటికీ, పని ద్వారా మరియు వారాంతాలలో సరదా కార్యకలాపాల ద్వారా సంస్థ మమ్మల్ని నిరంతరం సంప్రదిస్తూనే ఉంది, బృందంతో మంచి బంధం ఏర్పరుచుకోవడానికి ఇది నాకు సహాయపడింది.
ప్రాజెక్ట్ ప్రారంభం
మా ఇంటర్న్‌షిప్ ప్రారంభం అవ్వడానికి ముందు, మెంటార్ల మార్గనిర్దేశకంలో పని చేయడానికి మాకు ప్రాజెక్టులు కేటాయించబడ్డాయి. సెటప్ వర్చువల్ గా ఉన్నందున, మేము కాల్స్ లేదా వర్చువల్ సమావేశాల ద్వారా మా మెంటార్లతో కనెక్ట్ అయ్యాము. టీవీఎస్ క్రెడిట్ వద్ద నాకు డిజిటల్ మార్కెటింగ్ బృందంలో పని కేటాయించబడింది మరియు సామాజిక మాధ్యమాలలో కంటెంట్ స్ట్రాటజీ రూపొందించే పని అప్పగించబడింది. ఆసక్తికరమైన నాయకత్వ ప్రసంగాల తరువాత మా మార్కెటింగ్ హెడ్ అయిన శ్రీ చరణ్‌దీప్ సింగ్ మరియు మెంటార్లతో మా ప్రాజెక్టుల గురించి విడిగా చర్చించాము. ఈ సెషన్ సమయంలో, మేము మా ప్రాజెక్టులు మరియు మైల్స్టోన్ల గురించి స్పష్టమైన మార్గదర్శకాలను అర్థం చేసుకున్నాము.
నా మెంటర్, శ్రీ ముకుంద్రాజ్ సహకారం అందించారు మరియు నా ప్రశ్నలకు సమాధానం అందించారు. టీవీఎస్ క్రెడిట్ వద్ద డిజిటల్ మార్కెటింగ్ డొమైన్ గురించిన వివరాలను అర్థం చేసుకోవడంలో నాకు సహాయపడటానికి అతను ఇతర బృంద సభ్యులతో సెషన్లను నిర్వహించారు. ఈ సంభాషణలు నా ప్రాజెక్ట్ యొక్క అవసరాలపై స్పష్టతను తీసుకువచ్చాయి.
ది లెర్నింగ్ కర్వ్
నా ప్రాజెక్ట్ కోసం నేను చేసిన పని ఆసక్తికరంగా ఉంది. ప్రాజెక్ట్‌లో అనేక దశలు ఉన్నాయి, ఇందులో నేను టీవీఎస్ క్రెడిట్ యొక్క వివిధ అంశాలను అర్థం చేసుకున్నాను. ఈ సమాచారం నా సిఫార్సులను మార్చడానికి మరియు సరైన కంటెంట్ వ్యూహాన్ని ప్రతిపాదించడానికి సహాయపడింది. ప్రాజెక్ట్ ముగింపు నాటికి, నేను సోషల్ మీడియా పేజీ కోసం కంటెంట్ సృష్టించగలిగాను మరియు దాని కోసం ఒక కమ్యూనికేషన్ క్యాలెండర్ సృష్టించగలిగాను. చివరగా, ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ కోసం కంటెంట్‌ను క్యూరేట్ చేసేందుకు సహాయపడే ఎంపిక చేయబడిన డిజిటల్ టూల్స్ పై నేను సంక్షిప్త సిఫార్సులు ఇచ్చాను.
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పినట్లుగా, "జ్ఞానం పెంచుకోవడానికి అవసరం అయిన ఏకైక వనరు అనుభవం మాత్రమే". డిజిటల్ మార్కెటింగ్ డొమైన్లో పని అనుభవాన్ని పొందడానికి, డిజిటల్ మార్కెటింగ్ యొక్క వివిధ అంశాలను అర్థం చేసుకోవడానికి మరియు డిజిటల్ వాతావరణంలో అనేక భాగాల్లో నైపుణ్యం పొందడానికి ఈ ప్రాజెక్ట్ నాకు వీలు కల్పించింది. అలాగే, డిజిటల్ మార్కెటింగ్ బృందంతో నా నిరంతర పరిశోధన మరియు ఇంటరాక్షన్ నాకు ఈ స్పెషలైజేషన్ యొక్క సూక్ష్మమైన అంశాలను గుర్తించడానికి మరియు నేర్చుకోవడానికి సహాయపడింది. నా ఇంటర్న్‌షిప్ తర్వాత, నేను మెరుగుపడవలసిన అంశాలు మరియు డిజిటల్ మార్కెటింగ్ రంగంలో మరింత పరిజ్ఞానం సంపాదించడానికి నేను అటెండ్ అవ్వవలసిన కోర్సుల గురించి మార్కెటింగ్ హెడ్ మరియు నా మెంటార్ నుండి అభిప్రాయాలు మరియు సలహాలను అందుకున్నాను.
వారి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను బలోపేతం చేసేందుకు మెరుగుపడవలసిన అంశాల గురించి నా అభిప్రాయం కూడా తీసుకున్నారు.
సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రక్రియలో నేను నేర్చుకున్న అంశాలు ఈ కింద ఇవ్వబడ్డాయి:
1.ఇంటరాక్ట్, డిస్కస్ మరియు లెర్న్ (ఐడిఎల్). ఎల్లప్పుడూ సంప్రదించండి మరియు ప్రశ్నలను పరిష్కరించండి. లక్ష్యాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. గందరగోళాన్ని తొలగించండి, ఎందుకంటే ఇది సమస్యలను మరింత జటిలం చేస్తుంది.
2.మీ ఆలోచనలు సంస్థకు ఎలా ప్రయోజనం చేకూరుస్తాయో లోతుగా పరిశీలించండి మరియు అర్థం చేసుకోండి. ఫైనలైజేషన్‌కు ముందు అన్ని ఏడు ప్రశ్నలకు సమాధానాలను కనుగొనడానికి ప్రయత్నించండి. లాభాలు మరియు నష్టాల ఆధారంగా ప్రతి అంశాన్ని విశ్లేషించండి.
3.ప్లాన్‌ను చక్కగా డ్రాఫ్ట్ చేయండి. ఒకరి ప్రాజెక్ట్ అవసరాల ఆధారంగా ఒక వివరణాత్మక ప్లాన్ సృష్టించండి. అన్ని ప్లాన్లు పనిచేయవు, కానీ ప్లాన్ ఒక అవుట్‌లైన్ సృష్టించడానికి మరియు సరైన దిశలో ఉండటానికి మీకు సహాయపడుతుంది.
4.నిర్మాణాత్మక అభిప్రాయం యొక్క సారాన్ని మరియు మెరుగుపడవలసిన అంశాల గురించి అర్థం చేసుకోండి.
ప్రతి నిర్ణయానికి ఔచిత్యం అవసరం. అన్ని నిర్ణయాలకు స్పష్టమైన అన్వయం మరియు మద్దతును ఇచ్చే సమాచారం ఉండాలి. ఆచరణీయమైన మరియు బలమైన సిఫార్సులు సులభంగా అంగీకరించబడతాయి.
ఇది టీవీఎస్ క్రెడిట్ వద్ద నా వేసవి ఇంటర్న్‌షిప్ అనుభవం. రెండు నెలల వ్యవధి ఒక గొప్ప నేర్చుకునే అనుభవాన్ని అందించింది.