“మనకు అర్థం కాని దాని గురించి మనం భయపడతాం" - రాబర్ట్ లాంగ్డన్, ది లాస్ట్ సింబల్
సుదీర్ఘమైన పేపర్‌వర్క్, విసుగు కలిగించే జాప్యాలు మరియు పూర్తి నిరుత్సాహాన్ని కలిగించే కస్టమర్ సర్వీస్ ఉన్న కాలం గడిచిపోయింది. క్రెడిట్ పొందడం ఇప్పుడు సులభం. దాదాపుగా పూర్తిగా తొలగించబడిన పేపర్‌వర్క్‌తో మరియు మునుపటి కంటే వేగవంతమైన మరియు కస్టమర్‌కు మరింత అనుకూలమైన ప్రక్రియలతో, ఇప్పుడు మీరు కలలు గన్న కారు, బైక్ లేదా ఎల్ఇడి టివి ని ఫైనాన్స్ చేయడం చాలా సులభం.
ఇది కాకుండా, అప్పు తీసుకోవడం గురించి అనేక అపోహలు ఇంకా ఉన్నాయి. పొదుపుకి ప్రాధాన్యతను ఇచ్చే మరియు అప్పు అనే భావనను తిరస్కరించే ఈ సమాజంలో అనేకమంది భారతీయులు చెల్లించడంలో విఫలం అవుతామనే భయంతో ఒక లోన్ తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. అనేక ప్రశ్నలు అడుగుతూ, అనేక సార్లు తిప్పించుకునే మరియు కఠినంగా కనిపించే బ్యాంకర్లతో నిండిన ఒక ప్రదేశంగా ఆర్థిక సంస్థ పై ఉన్న భావన ఈ భయాన్ని ఇంకా పెంచింది.
అపోహలు బుడగలు లాంటివి, అవి చాలా ఎత్తుకు మరియు దూరంగా వెళతాయి, కానీ అవి కేవలం గాలిని మాత్రమే కలిగి ఉంటాయి మరియు అవి ఊరికే పగిలిపోతాయి. ఈ పోస్ట్‌లో, లోన్ పొందడం గురించి అత్యంత సాధారణ అపోహలను పరిశీలించి వాటిని పటాపంచలు చేస్తాము.
1. నా ప్రొఫైల్‌తో, నేను ఎన్నడూ లోన్ పొందలేను!
లోన్ పొందడానికి వారి ప్రొఫైల్స్ 'తగిన విధంగా లేవు' అనేది చాలా మందికి ఉన్న ఒక సాధారణ అపోహ. వారి జీతం చాలా ఎక్కువగా ఉండకపోవచ్చని, వారికి క్రెడిట్ చరిత్ర లేకపోవడం (లేదా సరిగాలేని సిబిల్ స్కోర్) అవరోధం కలిగించవచ్చు అని లేదా వారి అద్దె వసతులు సమస్యను కలిగించవచ్చు అని వారు విశ్వసిస్తున్నారు.
ఇక్కడ ఒక మంచి వార్త ఉంది - మీ ప్రొఫైల్ ఏమైనప్పటికీ, మీరు ఒక లోన్ తీసుకోగలుగుతారు! విస్తృత రకాల ప్రొఫైల్స్‌కు అనుగుణంగా ఫైనాన్షియర్ల వద్ద అనేక స్కీములు ఉన్నాయి. మీ వయస్సు, ఆదాయం, వృత్తి మరియు నివాస స్థలం మీరు అప్లై చేసినప్పుడు పరిగణించబడతాయి, ఈ వివరాలలో దేని కారణంగానైనా మీ అప్లికేషన్ తిరస్కరించబడే అవకాశం లేదు. ముందుకు సాగండి మరియు ఆత్మవిశ్వాసంతో అప్లై చేయండి!
2. నేను నిర్వహించగలగే దాని కంటే ఎక్కువ పేపర్‌వర్క్ ఉంది
పేపర్‌వర్క్. ఈ పదం విన్న వెంటనే పెద్ద పేపర్ కట్టలతో నిండిన ఫైళ్లు, అంతులేని సంతకాలు మరియు ఒక ముఖ్యమైన కాగితం మిస్ అయింది అనే భయం గుర్తుకువస్తాయి. ఇది గతంలో నిజమైనది అయినప్పటికీ, ఇక పై అలా ఉండదు. నేటి కాలంలో ఎన్‌బిఎఫ్‌సిలు ఇకెవైసి మరియు ఇసైన్ వ్యవస్థలను అమలు చేస్తున్నాయి, ఈ రెండు వ్యవస్థలు క్షణాల్లో అవసరమైన వివరాలను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తాయి - ఇది పూర్తిగా ఆన్లైన్ మరియు ఎటువంటి పేపర్‌వర్క్ అవసరం లేదు!
3. దీనికి చాలా సమయం పడుతుంది!
ఈ అపోహ ఒక కఠినమైన మారక లాంటిది, అసలు వదలదు. లోన్ ఆమోదించబడటానికి ఇకపై నెలలు, వారాలు లేదా రోజులు సమయం పట్టదు. మీ లోన్ అప్లికేషన్లో ప్రతి ప్రక్రియ - మీ వివరాలు నమోదు చేయడం దగ్గర నుండి మరియు క్రెడిట్ ఆమోద ప్రక్రియల వరకు పూర్తిగా డిజిటల్ రూపంలో ఉంటుంది మరియు దాదాపుగా తక్షణమే పూర్తి అవుతుంది. చాలా సందర్భాల్లో, మీ లోన్ ఆమోదించబడటానికి కొన్ని గంటల కంటే ఎక్కువ సమయం పట్టదు. మరో మాటలో చెప్పాలంటే, ఆమోద ప్రక్రియ యొక్క సాధారణ వ్యవధి టి20 మ్యాచ్ అంత సమయం ఉంటుంది!
4. నా కోసం వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉండవచ్చు!
బ్యాంకులు మరియు ఎన్‌బిఎఫ్‌సిలలో సేల్స్ మేనేజర్లు ప్రతి రోజు అనేక ఆందోళనలను పరిష్కరిస్తారు, కానీ ప్రతి కొన్ని గంటలకు ఎదురయ్యే అయ్యే ఒక ప్రశ్న "వడ్డీ రేట్లు సరసమైనవిగా ఉంటాయా?". వడ్డీ రేటు మీ ప్రొఫైల్ పై ఎక్కువగా ఆధారపడినప్పటికీ, మీరు దీర్ఘ అవధిని ఎంచుకోవడం ద్వారా మీ ఇఎంఐలను సరసమైనదిగా మార్చుకోవచ్చు. అంతేకాకుండా, ఎల్లప్పుడూ గొప్ప డిస్కౌంట్లు మరియు పొందవలసిన ఆఫర్లు ఉన్నాయి - వాటి గురించి అడగడం మర్చిపోకండి!
లోన్ అనేది ఒక భారం లేదా అవరోధం కాదు - వాస్తవానికి, ఇది చాలా కాలం వేచి ఉండకుండా మీ ఆకాంక్షలను సాధించడానికి లేదా ఎప్పుడూ రాని భవిష్యత్తు తేదీ వరకు వాటిని వాయిదా వేయకుండా ఉండటానికి ఒక తెలివైన మార్గం! పైన పేర్కొన్న అపోహలను మిమ్మల్ని ఇలా చేయకుండా ఆపనివ్వకండి- లోన్ కోసం అప్లై చేయడం. మెరుగైన, గొప్ప మరియు మరింత సంపూర్ణ జీవితంలోకి అడుగుపెట్టండి - మీరు ప్రారంభించడానికి అవసరమయ్యేది ఒక సౌకర్యవంతమైన మరియు సకాలంలో అందుకునే లోన్.