టీవీఎస్ క్రెడిట్ అనేది భారతదేశ వ్యాప్తంగా ఉన్న లక్షలాది కస్టమర్లకు ఒక విశ్వసనీయమైన క్రెడిట్ భాగస్వామి. ఆన్లైన్లో మోసపూరిత కార్యకలాపాల గురించి తెలుసుకోమని టీవీఎస్ క్రెడిట్ మిమ్మల్ని కోరుతుంది. మోసం అనేది కార్డ్ హోల్డర్‌కి తెలియకుండా క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాల చట్టవిరుద్ధమైన వినియోగం. ఇమెయిల్, తక్షణ మెసేజింగ్, వెబ్సైట్లు మరియు ఫోన్ కాల్స్ అనేవి వ్యక్తిగత డేటాను దొంగిలించడానికి ఉపయోగించబడే సాధారణ వనరులు. అందువల్ల, మోసపోయే అవకాశాన్ని నివారించడానికి మీ బ్యాంక్ అకౌంట్ నంబర్, పిన్ నంబర్, సివివి మొదలైనటువంటి గోప్యమైన సమాచారాన్ని తెలియని వెబ్సైట్లలో పంచుకోకండి.
మోసపూరిత ట్రాన్సాక్షన్లను ఎలా నివారించాలో తెలుసుకునే ముందు, వివిధ రకాల ఆన్లైన్ మోసాల గురించి తెలుసుకోండి:
- ఫిషింగ్: ఒక మోసపూరిత వెబ్సైట్ లేదా నకిలీ ఇమెయిల్‌లో లాగిన్ క్రెడెన్షియల్స్ లేదా కార్డ్ వివరాలు షేర్ చేయబడినప్పుడు కస్టమర్లు ఫిషింగ్ బారిన పడే అవకాశం ఉంటుంది. తెలియని వనరులకు ప్రైవేట్ సమాచారాన్ని సమర్పించడం వలన వ్యక్తిగత డేటా దొంగిలించబడవచ్చు.
- పేజ్జాకింగ్: అసలు వెబ్సైట్ పేజీ మరియు సంభావ్య డేటాను హ్యాకర్లు హైజాక్ చేస్తారు కాబట్టి కస్టమర్లు వేరొక వెబ్‌సైట్‌కు మళ్ళించబడతారు.
- తప్పుడు వ్యాపారి గుర్తింపు: ఒక నకిలీ మర్చంట్ అకౌంట్ ఒక చట్టపరమైన బిజినెస్ అకౌంట్‌కు చెందినదని కస్టమర్లు విశ్వసించే విధంగా మోసగించబడతారు. సోర్స్ విశ్వసనీయమైనది అని భావించి అనేక మంది మోసపోతారు.
ఇప్పుడు, ఆన్లైన్లో మోసపూరిత ప్రమాదాలు ఏమిటో మీకు తెలుసు కాబట్టి, మోసపూరిత లావాదేవీలను ఎలా నివారించాలో మరియు మీ ఖాతాను సురక్షితంగా ఎలా ఉంచుకోవాలో చూద్దాం:
- ఒక కాల్ ద్వారా గోప్యమైన ఆర్థిక సమాచారాన్ని పంచుకోవద్దు: మీ సివివి పిన్, కార్డ్ వివరాలు లేదా అకౌంట్ నంబర్‌ను షేర్ చేయమని మిమ్మల్ని అడిగినప్పుడు, ఒక కాల్ ద్వారా దానిని షేర్ చేయకండి. అదేవిధంగా, అపరిచిత/తెలియని వెబ్సైట్లు మరియు లింకులపై మీ ఆర్థిక వివరాలను పంచుకోకండి.
- అటాచ్మెంట్లు మరియు డౌన్లోడ్లతో జాగ్రత్తగా ఉండండి: ఇమెయిల్ మూలం గురించి మీకు ఖచ్చితంగా తెలియనప్పుడు లింకులపై క్లిక్ చేయవద్దు లేదా అటాచ్మెంట్ తెరవవద్దు. తెలియని అటాచ్మెంట్లను డౌన్లోడ్ చేయడం వలన మీ డివైజ్ వైరస్ బారిన పడవచ్చు.
- ప్రామాణిక వెబ్సైట్లను సందర్శించండి: ఒరిజినల్ వెబ్సైట్ లింక్‌కు సరిపోలే డొమైన్ పేర్లు మరియు యుఆర్ఎల్లు ఉండవచ్చు. యుఆర్ఎల్ ను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి మరియు ఏదైనా చెల్లింపు చేయడానికి మీరు ప్రామాణిక వెబ్‌సైట్‌ను ఎంటర్ చేసారని నిర్ధారించుకోండి.
- కార్డ్ వివరాలను ఆన్లైన్లో ఎప్పుడూ సేవ్ చేయవద్దు: మీరు ఒక ఆన్లైన్ చెల్లింపు చేసిన ప్రతిసారీ, కార్డ్ వివరాలను మాన్యువల్‌గా నమోదు చేయండి మరియు వాటిని సేవ్ చేయకండి. చెల్లింపు పూర్తయిన వెంటనే మీ అకౌంట్ నుండి లాగ్ అవుట్ అవ్వండి.
మోసపూరిత ట్రాన్సాక్షన్లు జరిగినట్లు మీకు అనుమానం ఉంటే ఏమి చేయాలి?
మీ బ్యాంక్ అకౌంటులో అనుమానాస్పద డెబిట్/క్రెడిట్ కార్యకలాపాలు జరిగినట్లయితే, కస్టమర్ కేర్ విభాగానికి తక్షణమే ఈ విషయం గురించి సమాచారం అందించండి మరియు ఒక ఫిర్యాదును చేయండి. ఆర్బిఐ నియమాల ప్రకారం, బ్యాంకుకు తెలియజేసిన తర్వాత, ఫిర్యాదు 90 రోజుల్లోపు పరిష్కరించబడాలి.
వెబ్సైట్లో వ్యక్తిగత వివరాలు పంచుకున్నప్పుడు తన కస్టమర్ల వివరాల గోప్యతను నిర్ధారించడానికి టీవీఎస్ క్రెడిట్ అన్ని ప్రయత్నాలను చేస్తుంది. ఒక బాధ్యతాయుతమైన కస్టమర్ అవ్వండి; సరైన అవగాహనతో ఉండండి మరియు మోసగాళ్ల నుండి మీ ఆర్థిక సమాచారాన్ని రక్షించుకోండి.
మీ భద్రతకు మేము అధిక ప్రాధాన్యత ఇస్తాము.