ప్రారంభంలోనే టీవీఎస్ క్రెడిట్‌తో నా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నందుకు నేను ఉత్సాహంగా ఉన్నాను! టీవీఎస్ క్రెడిట్ అనేది టీవీఎస్ గ్రూప్‌లో ఒక భాగం మాత్రమే కాదు, ఇది నాకు అనుభవం అందించిన నా మొదటి ఎన్బిఎఫ్సి కూడా. అయితే, దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో నేను చాలా నిరాశకు గురయ్యాను. కొన్ని ఇతర సంస్థల మాదిరిగా, వీరు నా ఇంటర్న్‌షిప్ రద్దు చేస్తారేమోనని ఆందోళన చెందాను. కానీ, టీవీఎస్ క్రెడిట్ ఇంటర్న్‌షిప్ కొనసాగించాలని నిర్ణయించినప్పుడు నేను చాలా సంతోషించాను. కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వర్చువల్ ఇంటర్న్‌షిప్‌కు మారాలని వారు నిర్ణయించినప్పుడు నేను మరింత ఉపశమనం పొందాను.
వర్చువల్ ఇంటర్న్‌షిప్‌లో మొదటి రోజును హెచ్ఆర్ డిపార్ట్ మెంట్‌కు చెందిన శ్రీ విక్రమన్ నిర్వహించారు. వారు కంపెనీ గురించి, వివిధ డిపార్ట్మెంట్లను, వాటి పనితీరు గురించి మాకు వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో సీనియర్ మేనేజ్మెంట్ బృందంతో లోతైన చర్చలు జరిగాయి.
ఆ శిక్షణ అనంతరం నేను డెట్ కలెక్షన్ విభాగంలో పనిచేశాను. నేను శ్రీ మణిగందన్, శ్రీ కలైసెల్వన్, శ్రీ పియూష్ గార్ల మార్గదర్శకత్వంలో పనిచేశాను. వారు నాకు కలెక్షన్స్ బృందం గురించి ఒక అవలోకనాన్ని ఇచ్చారు మరియు కంపెనీలో కలెక్షన్స్ ప్రాసెస్ గురించి నాకు సంక్షిప్తంగా తెలియజేసారు. తదుపరి నాకు ఈ ప్రాజెక్టు పనిని కేటాయించారు, ‘ఎన్‌బిఎఫ్‌సిలలో డెట్ కలెక్షన్ విధానాలు‘.
భారతదేశంలోని అగ్రశ్రేణి ఎన్‌బిఎఫ్‌సిలు వినియోగించుకుంటున్న వివిధ కలెక్షన్ వ్యూహాలపై, వాటి సాంకేతిక అమలుపై నేను పరిశోధన చేయాల్సి వచ్చింది. నా ప్రాజెక్ట్ ప్రయాణం హడావిడిగా సాగింది. అయితే, సమయ పరిమితులతో పనిచేయడానికి ఇది నాకు దోహదపడింది, అలాగే, మరింత సమర్థవంతంగా ఉండటానికి కొత్త మార్గాలను కనుగొనడంలో నాకు సహాయపడింది. వారు చెప్పినట్లుగా ‘కష్టం లేనిదే ఫలితం లేదు’.
శ్రీ పియూష్ గారు ప్రాజెక్టు అంతటా నాకు చాలా మద్దతుగా నిలిచారు. ప్రతిరోజూ ఆయనతో రెండు సమావేశాలు జరిగాయి, ఒక్కోటి ఒక్కో విధానం, ఒక్కో గడువుతో. అతను ఎల్లప్పుడూ నా పరిమితులకు మించి నన్ను ప్రోత్సహించారు, చివరికి ఇంటర్న్‌షిప్‌ను మరింత విజయవంతంగా పూర్తి చేయడంలో ఇది సహాయపడింది.
అయితే, ఎల్లప్పుడూ పని మాత్రమే ఉండేది కాదు. ఇంటర్న్‌షిప్ వర్చువల్‌లో ఉన్నప్పటికీ, శ్రీ విక్రమన్ గారు నా తోటి ఇంటర్న్స్‌తో చాలా ఇంటరాక్టివ్ సెషన్లను ఏర్పాటు చేసారు. సరదా కార్యక్రమాల సమయంలో నాలో దాగిన ఉన్న ప్రతిభ వెలుగులోకి వచ్చింది. తీరిక లేని పని రోజుల నుండి విశ్రాంతి తీసుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం.
టీవీఎస్ క్రెడిట్‌తో నా ఇంటర్న్‌షిప్ ప్రయాణం, ఎన్బిఎఫ్సి రంగం గురించి వివరంగా తెలుసుకోవడంలో నాకు సహాయపడింది. క్షేత్రస్థాయిలో నిష్కపటంగా పనిచేసే వారి పనితీరును పరిశీలించడం చాలా తెలివైన పని. వ్యక్తిగత స్థాయిలో పని పట్ల, సమయ నిర్వహణ పట్ల, ఉత్పాదకత పట్ల నా వైఖరి గణనీయంగా పెరిగింది. మరియు అన్నింటికన్నా ముఖ్యంగా, నా ఆలోచనలను సమర్థవంతంగా ఎలా కమ్యూనికేట్ చేయాలో నేను తెలుసుకున్నాను.
టీవీఎస్ క్రెడిట్ ఫ్యామిలీలో భాగం కావడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మొత్తం బృందానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇది అక్షరాలా నిజం, నా కల నిజమైంది.