సమతౌల్యం యొక్క సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి మరియు సైకిల్ నడపడం మధ్య చాలా వ్యత్యాసం ఉంది. సీటు పై ఒకసారి కూర్చున్న తరువాత మీరు బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటారు లేకపోతే కింద పడతారు. ఒక యువ మేనేజ్మెంట్ విద్యార్థిగా, నేను చదువుకొని సంపాదించినా జ్ఞానాన్ని పని అనుభవంగా మార్చడానికి నా వేసవి ఇంటర్న్‌షిప్ కోసం ఎదురుచూస్తున్నాను.
నేను ఇంతకు ముందు టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్‌కు అప్లై చేసాను. టీవీఎస్ క్రెడిట్ అనేది యుఎస్$8.5 బిలియన్ టీవీఎస్ గ్రూప్‌లో భాగం, మరియు ఇది అనేక మంది భారతీయుల కలలను సాకారం చేసే ఒక ఎన్బిఎఫ్సి. వీరి ఉనికి దేశవ్యాప్తంగా ఉంది. మరియు అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు వారు సేవలు అందిస్తున్నారు. నేను ఉత్సాహంతో వారి వద్ద పని అనుభవం కోసం ఎదురుచూశాను.
అయితే, నాకు ఎక్కువగా ఆశించలేదు. ఈ మహమ్మారి అనేక సంస్థలను కార్యకలాపాలను నిలిపివేసింది, లేఆఫ్‌లు కూడా జరిగే సూచనలు కనపడ్డాయి. ఉద్యోగుల హోదాలో ఇంటర్న్‌ల స్థాయి తక్కువగా ఉంటుంది మరియు సంస్థ కార్యకలాపాలు నిర్వహించడానికి ఏ విధంగానూ ముఖ్యం కాదు.
నాకు సంతోషాన్ని కలిగిస్తూ వారు తమ మాట పై నిలబడ్డారు మరియు వారి ప్రణాళికా విభాగంలోకి నన్ను తీసుకున్నారు. కోవిడ్-19 పరిస్థితి కారణంగా చాలావరకు శిక్షణ వర్చువల్‌గా సాగింది. నేను ప్రణాళికా విభాగంలో ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ పై పని చేయడం ప్రారంభించాను. మరియు ఇక్కడ నేను నా థియోరెటికల్ పరిజ్ఞానాన్ని ఆచరణాత్మకంగా ఉపయోగిస్తున్నాను.
ఇంటర్న్‌షిప్ బాగా రూపొందించబడిన వర్చువల్ ఇండక్షన్ సెషన్‌తో ప్రారంభమైంది. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది మరియు సంస్థ యొక్క మౌలిక విలువలు, లక్ష్యాలు మరియు ఆచారవిచారాల గురించిన సమాచారం అందించబడింది. నేను వివిధ కార్యకలాపాల వ్యాప్తంగా ఉన్న అనేక లర్నింగ్ సెషన్లకు హాజరు అయ్యాను. కంపెనీ యొక్క దీర్ఘకాలిక వ్యాపార వ్యూహం, బ్రాండింగ్ మరియు కొత్త ఉత్పత్తి అభివృద్ధి గురించి నాకు ఒక అవగాహన లభించింది. సంస్థ యొక్క వివిధ కార్యకలాపాల గురించి నేను తెలుసుకున్నాను.
మరియు టీవీఎస్ క్రెడిట్ వద్ద ఇంటర్న్‌షిప్ సమయంలో కేవలం పని మాత్రమే చేయలేదు. నా ఇంటర్న్‌షిప్ సమయంలో, మాకు అనేక 'ఫన్ ఎట్ వర్క్' సెషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడ మేము సరదాగా గడిపాము మరియు సహచర ఇంటర్న్స్‌ను కలిసాము.
టీవీఎస్ క్రెడిట్ వద్ద నా ఆనందదాయకమైన మరియు విజయవంతమైన ఇంటర్న్‌షిప్‌కు అనేక మంది దోహదపడ్డారు. వారిలో ప్రతి ఒక్కరికీ, నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారు తమ బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయాన్ని కేటాయించారు, మాకు సహాయం చేశారు మరియు మేనేజ్మెంట్లో భవిష్యత్తు కోసం సిద్ధం అవ్వడానికి సహకరించారు.
అత్యుత్తమ నైపుణ్యం గలవారి నుండి నేర్చుకున్నాను అని నేను విశ్వసిస్తున్నాను. నా అనుభవం సమృద్ధిగా మరియు లాభదాయకంగా ఉంది. మరియు ఈ అవకాశాన్ని నాకు అందించినందుకు నేను మళ్ళీ టీవీఎస్ క్రెడిట్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
నా థియోరెటికల్ పరిజ్ఞానాన్ని బలోపేతం చేయడానికి నేను ఇప్పుడు ఆచరణీయమైన అవగాహనను కలిగి ఉన్నాను. నేను బ్యాలెన్స్ సాధించిన సైక్లిస్ట్‌ను, మరియు గాలికి వ్యతిరేకంగా రైడ్ చేయగలుగుతున్నాను!