టీవీఎస్ క్రెడిట్ వివిధ సామాజిక, ఆర్థిక నేపథ్యాలకు చెందిన భారతీయులకు ఆలోచనాత్మకంగా రూపొందించిన ఆర్థిక ప్రోడక్టులతో సాధికారత కల్పిస్తుంది. తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవాలనుకునే అన్ని వర్గాలకు చెందిన భారతీయులకు, మా సకాలంలో మరియు సరసమైన క్రెడిట్ వారి కలలను వాస్తవాలుగా మార్చుకోవడంలో ఉపయోగపడుతుంది.
మా ప్రోడక్టులు, సేవలు సమ్మిళిత మరియు స్థిరమైన ఆవిష్కరణలను అందించేందుకు రూపొందించబడ్డాయి. మేము కేవలం రుణాలను, సేవలను అందించడానికి మించి, ప్రజలకు వివిధ మార్గాల్లో సాధికారత కల్పించడంపై కూడా దృష్టి పెడతాము. కస్టమర్ల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తాము. సక్షమ్, ఈ దిశగా టీవీఎస్ క్రెడిట్ చేపట్టిన చొరవ పేద విద్యార్థులు, పాఠశాల విద్యను విడిచిపెట్టిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు కోసం అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి, వారికి మంచి భవిష్యత్తు లభించేలా సహాయపడుతుంది.
స్వయంకృషి నుండి సాధికారత" వైపు అడుగులు
గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలపై దృష్టిరీత్యా ప్రారంభించిన, సక్షమ్ ఆర్థిక అంతరాల సమస్యను ఒక ప్రత్యేక దృక్పథం నుండి పరిష్కరించడంలో సహాయపడుతుంది. వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమాల ద్వారా, సక్షమ్ మా కస్టమర్ల చుట్టూ ఉన్న సమాజాలకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తుంది. ఈ కార్యక్రమం అంతా కూడా వారి జీవితాలను సుసంపన్నం చేసేందుకు, స్వీయ అభివృద్ధి ద్వారా వారి ఆకాంక్షలను సాధించేందుకు వీలు కల్పించడానికి నిర్వహించబడుతుంది.
టీవీఎస్ క్రెడిట్ దార్శనికత భారతదేశానికి సాధికారత కల్పించడం, ప్రతి భారతీయునికి చేయూత నివ్వడం. వాస్తవానికి మా ప్రోడక్టులు మరియు సేవలను వినియోగించే ప్రాథమిక కస్టమర్లు స్వయం ఉపాధి పొందే, కష్టపడి పనిచేసే వ్యక్తులు, భారతదేశపు చిన్న పట్టణాల నుండి పెద్ద ఆకాంక్షలను కలిగిన వారు మరియు వారి కుటుంబాల ఉన్నతిని ఆకాంక్షించే వారు. అయితే, దానిని నెరవేర్చుకోవడానికి వారికి ఎలాంటి మార్గాలు లేవు, తరచూ వారు వ్యవస్థీకృత క్రెడిట్ ప్రాప్యత నుండి నిరాకరించబడ్డారు. ఈ క్రమంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు, వారిని క్రెడిట్ పొందేలా చూడడంలో టీవీఎస్ క్రెడిట్ మార్గదర్శకుడిగా నిలిచింది. డబ్బు వారి కలలకు ఆటంకం కాబోదు.
అయితే, మా ఈ నిబద్ధత మా తక్షణ లేదా సంభావ్య కస్టమర్లకు మాత్రమే పరిమితం కాదు, వారి కుటుంబాలు మరియు సమాజానికి కూడా వర్తిస్తుంది. వారి కలలను, ఆకాంక్షలను సాకారం చేసేందుకు అవసరమైన నైపుణ్యాలను వారికి అందించడం ద్వారా వారిని స్వంత కాళ్లపై నిలబెట్టాలని ఆశిస్తున్నాము. నైపుణ్యాల అభివృద్ధి అనేది ఈ రోజు సాధికారతకు అత్యంత ఆచరణాత్మక మరియు ప్రత్యక్ష మార్గం. ఇది బాహ్య పరిస్థితుల ద్వారా దూరం చేయలేని జ్ఞానాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది మరియు వారిని ‘సక్షమ్’ లేదా 'సమర్థులుగా' మారుస్తుంది.
ఇప్పటివరకు చేసిన ప్రయాణం
మేము సక్షమ్ ని ఎన్జిఒ భాగస్వామి – యువ పరివర్తన్ సహకారంతో ప్రారంభించాము. యువజన సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించే యువ పరివర్తన్, యువ పరివర్తన్ సహకారంతో ప్రారంభించాము నిరుపేద యువతకు జీవనోపాధి కల్పించడంలో భారతదేశంలోనే అగ్రగామి. భారతదేశ వ్యాప్తంగా 650 బ్రాంచ్లలో వారు, మేము ప్రతిపాదించిన శాశ్వత నైపుణ్య మెరుగుదల చొరవకు మద్దతు ఇవ్వడానికి మరియు అమలు చేసేందుకు ఉత్తమంగా సన్నద్ధమయ్యారు - అందులో ఒకటి చేతితో చేసే ప్రాక్టికల్ ట్రైనింగ్ పై దృష్టి సారించడం, ప్రవర్తన మరియు జీవనశైలి మార్పు కోసం సాఫ్ట్ స్కిల్స్ మరియు నిర్వహణ పటిమను ప్రోత్సహించడం, అలాగే ఉద్యోగ నియామకాలు మరియు స్వయం ఉపాధికి మద్దతు ఇవ్వడం లాంటివి ఉన్నాయి.
వివిధ ప్రాంతాల్లో అవసరాలను పూర్తిగా పరిశీలించిన తరువాత, 3 ప్రాంతాలలో టీవీఎస్ క్రెడిట్ సక్షమ్ – ను ప్రారంభించడానికి ఎంచుకున్నాము, అవి బెంగళూరులోని దేవరజీవనహళ్లి, మహారాష్ట్రలో నాందేడ్ మరియు ఛత్తీస్గఢ్లో రాయ్పూర్. అంతేకాకుండా, గత మూడేళ్లలో మేము రెండు అదనపు స్థానాలను పుణె మరియు ఇండోర్లను చేర్చడం ద్వారా మేము మా పరిధిని విస్తరించాము
నిర్వహించిన అవసరాల అంచనా ప్రకారం ఈ కింది కోర్సులలో ప్రాముఖ్యత మరియు ఆసక్తిని కనుగొన్నారు:
- ప్రాథమిక కంప్యూటర్ విద్య
- బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్
- ట్యాలీ
- కుట్టుపని
- బ్యూటీషియన్
- నర్సింగ్
- చిన్న పౌల్ట్రీ రైతు
- జ్యూట్ బ్యాగ్ తయారీ
- మల్టీ స్కిల్ టెక్నీషియన్
- వైర్మెన్ కోర్సు
ఈ కోర్సులను గుర్తించిన తర్వాత, మా బృందం అన్ని కేంద్రాల వ్యాప్తంగా విద్యార్థులను నమోదు చేసే కఠినమైన ప్రక్రియలో నిమగ్నమైంది. ప్రజలు స్వయంగా వారి ఆసక్తితో స్వచ్ఛందంగా ఈ కోర్సులలో చేరేలా ప్రోత్సహించడంపై దృష్టి పెట్టారు. తల్లిదండ్రులు, బంధువులు ఈ కేంద్రాలకు వచ్చి రక్షణ, భద్రతకు సంబంధించిన సమస్యలను నేరుగా పరిష్కరించుకోవాలని, స్థలాన్ని పరిశీలించి సిబ్బందితో మాట్లాడాలని విజ్ఞప్తి చేసారు. 2018 అక్టోబరు నెలలో బెంగళూరులో తరగతులు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 600 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వబడింది. శిక్షణ పొందిన యువతలో 65% శాతానికి పైగా జీవనోపాధి (స్వయం ఉపాధి & వేతన ఉపాధి) పొందారు.
2022-23లో టీవీఎస్ క్రెడిట్ ద్వారా బెంగుళూరులోని పట్టణ ప్రాంతాలు, పూణేలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లోని 100 మందికి పైగా విద్యార్థుల శిక్షణకు మద్దతు లభించింది. దీని ఫలితంగా ఈ ప్రాంతాల్లో యువతలో వైఖరి మార్పు, ఆదాయం పెరగడం మొదలైంది.
స్వయంకృషి నుండి సాధికారత వైపు అడుగులు వేస్తున్న, సక్షమ్ ప్రోగ్రామ్, స్కూళ్లు మరియు కాలేజీని మధ్యలో మానేసిన వారికి వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమాల ద్వారా సాధికారత కల్పిస్తోంది, ఇది వేర్వేరు విభాగాల్లో ప్రాథమిక నైపుణ్యాలను బోధిస్తుంది, మెరుగైన మరియు మరింత సంపన్నమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుంది, మరియు వారిని జీవితాన్ని సక్షమ్ గా చేస్తుంది.