మీరు వ్యవసాయ వ్యాపారంలోకి ప్రవేశించాలని ఆలోచిస్తున్నారా?
లేదా మీరు ఇప్పటికే వ్యవసాయంలో ఉన్నారా?
మీకు వ్యవసాయం చాలా విలువైనదని తెలిసి ఉండాలి! వ్యవసాయం ప్రారంభించడం అలాగే, దానిని కొనసాగించడం చాలా ఖర్చుతో కూడుకున్నది!
సరిగ్గా ఇదే సమయంలో మీకు ఫైనాన్స్ అవుతుంది మరియు ఇప్పుడే వ్యవసాయ రుణాలు కూడా తెరపైకి వస్తాయి.
వ్యవసాయ రుణం పొందడం ఒక సవాలుగా ఉంటుంది. కొన్నిసార్లు, రుణదాతను దీని గురించి విచారించడం కూడా కష్టతరమవుతుంది. ఏ వ్యవసాయ రుణం ఆమోదం కోసం చాలా శ్రమించాల్సి వస్తుంది. మీకు ఎంత డబ్బు అవసరమో, ఎందుకు అవసరమో, దాన్ని ఎలా తిరిగి చెల్లిస్తారు అనే దానిపై మీకు స్పష్టత ఉంటే, అది చాలా సులభతరం అవుతుంది.
మీరు వ్యవసాయ రుణం కోసం అప్లై చేసుకునే ముందు పూర్తి చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
1. సరైన బిజినెస్ ప్లాన్‌ను కలిగి ఉండాలి
మీరు కేవలం ఒక రుణదాత దగ్గరకు వెళ్లి, "నా వ్యవసాయ వ్యాపారం కోసం నాకు ఫైనాన్స్ కావాలి" అని చెబితే, మీ రుణం ఆమోదించబడే అవకాశం 99 శాతం తక్కువగా ఉంటుంది. మరోవైపు, మీరు సరైన బిజినెస్ ప్లాన్‌తో వెళ్తే రుణదాతకు, మీరు ఏమి చేయాలనుకుంటున్నారు, ఎక్కడ పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు, ఎలా పెట్టుబడి పెట్టబోతున్నారు మరియు రుణాన్ని ఎలా తిరిగి చెల్లించబోతున్నారో అనే దానిపై మీకు స్పష్టత ఉందని తెలుస్తుంది. మీ బిజినెస్ ప్లాన్‌లో మీ బ్యాక్‌గ్రౌండ్, మీ మిషన్, లక్ష్యాలు, వ్యూహాలు మరియు మార్కెటింగ్ ప్లాన్ గురించి ఉండేటట్లు నిర్ధారించుకోండి.
2. మీ ఆర్ధిక నివేదికలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకోండి
ఇది చాలా ముఖ్యమైన దశలలో ఒకటి, ఎందుకంటే మీరు బ్యాంకు నుండి తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించగలరా లేదా అనేది రుణదాతలు ముఖ్యంగా తెలుసుకోవాలనుకుంటారు. మీరు సంప్రదించే ఏ రుణదాత అయినా మీ ఆదాయ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, వ్యవసాయ బ్యాలెన్స్ షీట్ మరియు వ్యాపార చరిత్ర లాంటి మీ ఆర్థిక డాక్యుమెంట్లను సమీక్షించడం ద్వారా రుణాన్ని తిరిగి చెల్లించే మీ ఆర్థిక సామర్థ్యాన్ని చెక్ చేస్తారు.
3. తనకా కోసం సిద్ధంగా ఉండండి
తనకా అంటే మీరు తాకట్టుగా ఉంచిన మీ ఆస్తి, రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైతే, బ్యాంకు ఆ ఆస్తిని రికవరీగా ఉపయోగించుకుంటుంది. మీరు ఆస్తి రుణానికి సమానమైన విలువను కలిగి ఉండాలి. అయితే, మీరు 'మీరు ఏ ఆస్తులను తాకట్టు పెట్టవచ్చు?' అనే ప్రశ్నకు సమాధానంతో సిద్ధంగా ఉండాలి, ఒకవేళ మీ వద్ద వ్యవసాయేతర మరియు రుణ మొత్తానికి సమానమైన విలువతో కూడిన ఆస్తి ఉంటే, మీ రుణం కోసం ఆమోదం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
4. సాధారణ ప్రశ్నల కోసం సిద్ధంగా ఉండండి
ఇది చాలా స్పష్టంగా ఉందని మీరు భావించినప్పటికీ, దీనిని పెద్దగా తీసుకోకండి. మీ అర్హతలు, గత అనుభవం లాంటి సాధారణ ప్రశ్నలకు మీరు జవాబిచ్చే విధానం ఆధారంగా, రుణదాత మీ బిజినెస్ ప్లాన్ ఫలప్రదంగా ఉంటుందో లేదో లేదా మీరు రుణాన్ని తిరిగి చెల్లించగలరో లేదో అనేది నిర్ణయిస్తారు. కాబట్టి, మీరు రుణదాతకు మీపై మంచి అభిప్రాయం ఏర్పడాలంటే, మీరు ఇలాంటి సాధారణ ప్రశ్నల కోసం సిద్ధంగా ఉండాలి.
పైన పేర్కొన్న విషయాలతో మీరు సిద్ధంగా ఉంటే మరియు మీరు లోన్ కోసం రుణదాతను సంప్రదించే ముందు మీ ప్లాన్‌ను సిద్ధం చేసుకుంటే, వారు మీ రుణాన్ని ఆమోదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకసారి ఆమోదం పొందిన తర్వాత, మీరు వ్యవసాయ పరికరాలు మరియు సరఫరా వస్తువులను కొనుగోలు చేయడానికి, పాత రుణాన్ని రీఫైనాన్స్ చేయడానికి, మరమ్మత్తు పనులతో భూమిని మెరుగుపరచడానికి మరియు మార్కెటింగ్ ప్రచారాలు, ప్రకటనల కోసం నిధులను వినియోగించవచ్చు. చాలా బ్యాంకులు ట్రాక్టర్ లోన్లు విడిగా. కాబట్టి, మీరు ట్రాక్టర్ లోన్ వడ్డీ రేటును ఆన్లైన్లో తనిఖీ చేయవచ్చు మరియు తరువాత దానిని ఎంచుకోవచ్చు!