మీ వ్యవసాయం కలలను నెరవేర్చుకోవడానికి మీరు చేసే అతిపెద్ద పెట్టుబడులలో ట్రాక్టర్ ఒకటి. కృతజ్ఞతగా, ఈ రోజుల్లో బ్యాంకులు వ్యవసాయ రుణాలు మరియు ట్రాక్టర్ లోన్లు ను తక్కువ వడ్డీ రేట్లతో సులభంగా తిరిగి చెల్లించే నిబంధనలతో అందిస్తున్నాయి. ఈ రోజుల్లో ఒక ట్రాక్టర్ కొనడం సులభం అయింది. అయితే, కొనుగోలు చేసిన తర్వాత అసలు పని మొదలవుతుంది. మీరు ట్రాక్టర్‌ను చక్కగా నిర్వహించడానికి దాని నిర్వహణలో దాదాపుగా నిపుణుడిగా మారాలి.
మంచి దిగుబడిని పొందడానికి మీ ట్రాక్టర్‌ను టాప్ కండిషన్లో ఉంచడం చాలా ముఖ్యం. మీరు అత్యంత సమయం కేటాయించాలి మరియు ప్రతిరోజూ సరైన నిర్వహణ దశలను అనుసరించాలి. ట్రాక్టర్లను మంచి స్థితిలో ఉంచడానికి కొన్ని నిర్వహణ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:
1. యజమాని మాన్యువల్‌ను చూడండి
ప్రతి తయారీదారు కొనుగోలుదారులకు ఒక యూజర్ మాన్యువల్ ఇస్తారు, ఇది పరికరాల సంరక్షణకు సంబంధించిన సూచనలను అందిస్తుంది. కాబట్టి, మీరు ఆ ఓనర్స్ మాన్యువల్ పొందారా లేదా చూసుకోండి, అందులోని చిట్కాలను అనుసరించండి. ఇందులో నిర్వహణ షెడ్యూల్, స్పెసిఫికేషన్లు, పరికరాలకు సంబంధించిన విడిభాగాల స్థానం, ప్రాథమిక ఆపరేటింగ్ సూచనలు ఉంటాయి.
2. అన్ని నిర్వహణ సాధనాలను పొందండి
ట్రాక్టర్ నిర్వహణ కోసం వాహనాల నిర్వహణకు కావలసిన సాధనాలతో పోలిస్తే వేరే సాధనాలు అవసరమవుతాయి. మీ ట్రాక్టర్‌ను జాగ్రత్తగా చూసుకోవడానికి మీకు అవసరమైన అన్ని ఇతర పరికరాలను, పనిముట్లను అందుబాటులో ఉంచుకోండి.
3. వర్షం నుండి ట్రాక్టర్‌ను రక్షించండి
వర్షం నుండి మీ ట్రాక్టర్‌ను సురక్షితం చేసుకోండి ; ముఖ్యంగా ఎగ్జాస్ట్ సిస్టమ్, సీటు మరియు పరికరాలు. కాబట్టి, దానిని గ్యారేజీలో ఉంచండి లేదా మంచిగా కవర్ చేయండి.
4. క్రమం తప్పకుండా ఫ్లూయిడ్స్ చెక్ చేయండి
ట్రాక్టర్లో ఏదైనా భాగంలో లీకేజ్ అయితే, నష్టం చాలా ఖరీదైనది కావచ్చు. ఏ భాగాలను చెక్ చేయాలో నిర్ణయించడానికి ఓనర్స్ మాన్యువల్ చూడండి. మీరు ఇంజిన్ ఆయిల్, కూలెంట్, బ్యాటరీ ఎలక్ట్రోలైట్, ట్రాన్స్మిషన్ ఫ్లూయిడ్ మరియు హైడ్రాలిక్ ఆయిల్‌ను చెక్ చేయాలి.
5. టైర్లలో సరైన గాలి పీడనం ఉండేలా చూసుకోవాలి
అన్ని ట్రాక్టర్ల కోసం అదే గాలి పీడనం అవసరం లేదు. అదే ట్రాక్టర్లో ముందు మరియు వెనుక టైర్లకు కూడా వేర్వేరు పీడనం అవసరం కావచ్చు. కాబట్టి, క్రమం తప్పకుండా గాలి పీడనాన్ని చెక్ చేయండి.
6. బ్రేకులను చూడండి
దాదాపు అన్ని ట్రాక్టర్లలో ఆటోమేటిక్ బ్రేకులు ఉంటాయి. మీరు కేవలం మీ బ్రేకింగ్ సిస్టమ్ లూబ్రికేట్ చేయబడిందని మరియు బాగా పనిచేస్తుందని నిర్ధారించుకోవాలి. మీ బ్రేకింగ్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే, మీరు దానిని వీలైనంత త్వరగా రిపేర్ చేయాలి లేదా భర్తీ చేయించుకోవాలి.
7. ఫిల్టర్లపై దృష్టి పెట్టండి
మురికి మరియు దుమ్ము సిస్టమ్‌ను దెబ్బతీసి మరియు విడిభాగాల వైఫల్యానికి కారణమవుతాయి. ఈ కాలుష్య కారకాల నుండి సిస్టమ్‌ను రక్షించడానికి ట్రాక్టర్లలో ఫిల్టర్లు ఉన్నాయి. ఫ్యూయల్ ఫిల్టర్ అలాగే ఎయిర్ ఫిల్టర్‌ను తరచుగా చెక్ చేయడం మంచిది. వీలైతే దానిని శుభ్రం చేయండి లేదా ఒకవేళ అది శుభ్రం చేయడానికి వీలు లేనంతగా పాడైతే దానిని భర్తీ చేయండి.
8. తరచుగా లూబ్రికేట్ చేయండి
ట్రాక్టర్ బాగా పనిచేయడానికి, దానిని తప్పకుండా లూబ్రికేట్ చేయాలి. మీరు ఆయిల్ స్థాయిని క్రమం తప్పకుండా చేసి, అత్యుత్తమ పనితీరును కనబరిచే కందెనలను ఉపయోగించండి. కార్లు మరియు ఇతర తేలికపాటి వాహనాల కోసం ఉపయోగించే ఆయిల్స్ నివారించండి. ట్రాక్టర్లో అన్ని కదిలే భాగాల కోసం చూడండి, వాటిని శుభ్రపరచండి మరియు వాటికి గ్రీజు పూయండి.
9. ఓవర్‌లోడ్ చేయవద్దు
మీరు ఇతర విషయాలలో మాదిరిగానే ఇక్కడ కూడా అధిక భారం కాకుండా చూస్కోండి,. అంటే, మీరు మీ ట్రాక్టర్‌పై ఎక్కువ లోడ్ వేయకండి, అది తొందరగా దెబ్బతినవచ్చు.
మీ ట్రాక్టర్ జీవితకాలం మీరు దానిని ఎంత చక్కగా నిర్వహించారనే దానిపై ఆధారపడి ఉంటుంది. పైన పేర్కొన్న చిట్కాలను అనుసరించండి మరియు దాని నుండి అత్యధిక ప్రయోజనం పొందడానికి ట్రాక్టర్‌ను ఉత్తమంగా నిర్వహించండి.