మీరు ఒక టూ-వీలర్ కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే, రోడ్డు మీదకు వెళ్లే ముందు టూ-వీలర్ లోన్ వడ్డీ రేట్లు, ఇఎంఐ మరియు మరిన్ని అంశాలను పరిగణించడం ముఖ్యం. తెలివైన నిర్ణయం తీసుకోవడానికి విలువైన సమాచారం కోసం చదవండి!
టూ-వీలర్ లోన్ వడ్డీ రేట్లు అంటే ఏమిటి?
ఒక టూ వీలర్ లోన్ కోసం అప్లై చేసేటప్పుడు మీరు పరిగణించవలసిన ప్రధానమైన అంశం వడ్డీ రేటు. ఇది ఇఎంఐ మొత్తాన్ని మరియు మీ నెలవారీ బడ్జెట్ పై ప్రభావాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి ఇది చాలా ముఖ్యం.
వడ్డీ రేటు లెక్కింపు మీ క్రెడిట్ చరిత్రపై ఆధారపడి ఉంటుంది. మీ ఇఎంఐ లో వడ్డీ రేటుతో పాటు లోన్ యొక్క అసలు మొత్తం ఉంటుంది.
టివిఎస్ క్రెడిట్ వంటి అనేక బ్యాంకులు మరియు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సిలు) టూ వీలర్ లోన్లు అందిస్తాయి, దానిని కొనుగోలు చేయాలని అనుకునే వారి కలను నెరవేర్చడానికి సహాయపడతాయి.
టూ-వీలర్ వడ్డీ రేట్ల క్రింద, మీకు ఉత్తమంగా సరిపోయే దానిని మీరు ఎంచుకోవచ్చు.
టూ-వీలర్ లోన్ వడ్డీ రేట్ల రకాలు
రుణదాత ప్రకారం టూ వీలర్ లేదా బైక్ లోన్ వడ్డీ రేట్ల ఆధారంగా వేరియబుల్ ఒకటి లేదా ఫిక్స్డ్ వడ్డీ రేటు గా ఉంటాయి.
అటువంటి సందర్భంలో, ఒక ఫిక్స్డ్ రేటు మరియు వేరియబుల్ రేటు మధ్య ఎంపిక అనేది అందులో ఉన్న రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది.
ఫిక్స్డ్ వడ్డీ రేటు వేరియబుల్ రేట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే, మార్కెట్ పరిస్థితులలో మార్పులతో సంబంధం లేని ఫిక్స్డ్ రేట్లు మార్పునకు గురి అవ్వవు.
ఉదాహరణకు, మీరు సంవత్సరానికి 13% ఫిక్స్డ్ రేటును ఎంచుకుంటే, అది మీ రుణం వ్యవధి అంతటా స్థిరంగా ఉంటుంది.
మరో వైపు, మార్కెట్ రేట్ల ఆధారంగా వేరియబుల్ వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును మార్చిన ప్రతిసారీ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటు (ఎంసిఎల్ఆర్) కు అనుసంధానించబడిన రేట్లు మారుతూ ఉంటాయి.
ఇది సమయంతో పాటు రేట్లలో పెరుగుదల లేదా తగ్గుదలకు దారితీస్తుంది. అయితే, వేరియబుల్ వడ్డీ రేట్లు సాధారణంగా ఫిక్స్డ్ రేట్ల కంటే తక్కువగా ఉంటాయి.
బైక్ వడ్డీ రేటును ఫైనలైజ్ చేసిన తర్వాత, బైక్ లోన్ కోసం అప్లై చేయడంలో తదుపరి దశ అనేది లోన్ కోసం ఉన్న అర్హతా ప్రమాణాలను అర్థం చేసుకోవడం, ఇందులో డాక్యుమెంటేషన్ ఉంటుంది.
ఒక బైక్ లోన్ కోసం అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు
బైక్ లేదా టూ వీలర్ లోన్ కోసం అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంటేషన్ మీరు జీతం పొందే వ్యక్తి లేదా స్వయం-ఉపాధిగల వ్యక్తి అనేదాని ఆధారంగా మారుతుంది.
-
KYC డాక్యుమెంట్లు
ఫోటోలు, గుర్తింపు రుజువు (పాస్‌పోర్ట్/పాన్ కార్డ్/డ్రైవర్ లైసెన్స్/ఓటర్ ఐడి/ఆధార్ కార్డ్), చిరునామా మరియు వయస్సు రుజువు వంటివి స్థిరంగా ఉంటాయి.
-
గత 3 నెలల జీతం స్లిప్పులు/ఫారం 16/తాజా ఐటిఆర్
జీతం పొందే వ్యక్తులకు చెల్లుతుంది, అయితే స్వయం-ఉపాధిగల వ్యక్తులు తమ తాజా ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటిఆర్) సమర్పించాలి
-
ఉపాధి/ఆఫర్ లెటర్
ను జీతం పొందే వారు మరియు స్వయం-ఉపాధిగల వ్యక్తులు టిడిఎస్ సర్టిఫికెట్‌ను సబ్మిట్ చేయబడాలి.
-
గత 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్
రెండు కేటగిరీలకు చెందిన వారు సమర్పించబడాలి.
అవసరమైన డాక్యుమెంట్లకు సంబంధించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ బైక్ లోన్ వడ్డీ రేటును తగ్గించడానికి చిట్కాలు
ఒక 2-వీలర్ లోన్ కోసం అప్లై చేసేటప్పుడు, మీరు సాధ్యమైనంత తక్కువ రేటుతో ఒకదాన్ని పొందడం లక్ష్యంగా పెట్టాలి. ఇందులో సహాయపడడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
-
మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుచుకోండి:
మీరు అందించిన వడ్డీ రేటును నిర్ణయించడంలో మీ క్రెడిట్ స్కోర్ ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి, మొదట మీ క్రెడిట్ చరిత్రను క్లియర్ చేయడానికి ప్రయత్నించండి. మీకు మంచి క్రెడిట్ లేకపోతే, మీరు లోన్ కోసం అర్హత సాధించడానికి ప్రయత్నించడానికి ముందు దానిని మెరుగుపరచడానికి చర్యలు తీసుకోండి.
-
మీ రుణ ఆదాయ నిష్పత్తిని తనిఖీ చేయండి:
మీ ప్రస్తుత ఆదాయంలో ఏ భాగం లోన్లు మరియు క్రెడిట్ కార్డ్ బిల్లుల రీపేమెంట్ కోసం వెళ్తుందో ఇది మీకు చూపుతుంది కాబట్టి మీ ప్రస్తుత రుణ స్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నించండి.
మీ ప్రస్తుత లోన్లను క్లియర్ చేయడానికి మరియు ఈ నిష్పత్తిని తగ్గించడానికి ప్రయత్నించండి. మీ నిష్పత్తి తక్కువగా ఉంటే, మంచి వడ్డీ రేట్లను పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
-
మీ రుణదాతతో చర్చించండి:
కొన్ని సందర్భాల్లో, మీరు ఎంచుకున్న రుణదాతతో చర్చించడం అనేది మెరుగైన రేట్లను పొందడానికి మీకు సహాయపడగలదు. ఇది ప్రత్యేకంగా మీరు అన్ని అర్హతా ప్రమాణాలను నెరవేర్చని పరిస్థితులలో వర్తిస్తుంది.
ఉదాహరణకు, మీకు తగినంత ఆదాయం లేకపోతే, కానీ త్వరలోనే జీతం పెరుగుతుందని ఆశిస్తున్నట్లయితే, దీనికి సంబంధిత రుజువును సమర్పించడం మీకు మంచి వడ్డీ రేట్లను పొందడానికి సహాయపడుతుంది.
మీ టూ-వీలర్ లోన్ వడ్డీ రేట్లను ప్రభావితం చేసే ఇతర అంశాలు
-
క్రెడిట్ స్కోరు:
మీ వడ్డీ రేటును నిర్ణయించే అత్యంత ముఖ్యమైన అంశాల్లో ఒకటి. మీ క్రెడిట్ స్కోర్ 700 కంటే ఎక్కువగా ఉంటే, మీరు తక్కువ వడ్డీ రేట్లకు అర్హత పొందవచ్చు. తక్కువ క్రెడిట్ స్కోర్లను కలిగి ఉండటం వలన అధిక వడ్డీ రేట్లు ఉండవచ్చు లేదా కొన్నిసార్లు లోన్ అప్లికెంట్ తిరస్కరించబడవచ్చు.
-
ఆదాయ స్థాయి:
లోన్ అప్రూవల్ కోసం బ్యాంకులు మరియు రుణదాతలు కనీస ఆదాయ అవసరాన్ని కలిగి ఉండవచ్చు. మీకు ప్రమాణాల కంటే తక్కువ ఆదాయం ఉంటే, మీకు అధిక వడ్డీ రేట్లు అందించబడవచ్చు.
-
పని స్థలం:
మీ ఉపాధి స్థలం లేదా మీరు పనిచేసే సంస్థ, మీకు అందించబడే వడ్డీ రేటును ప్రభావితం చేయగలదు. ఒక ప్రఖ్యాత కంపెనీలో ఉపాధి ఒక స్థిరమైన ఉద్యోగాన్ని కలిగి ఉండడానికి మరియు ఒక స్థిరమైన ఆదాయాన్ని పొందే అవకాశాలను మెరుగుపరుస్తుంది, అందువలన సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లు లభిస్తాయి.
-
ఉపాధి స్వభావం:
మీరు స్వయం-ఉపాధి పొందేవారా లేదా జీతం పొందేవారా అనేదాని ఆధారంగా రుణదాతల ద్వారా వివిధ వడ్డీ రేట్లు విధించబడతాయి.
-
వయస్సు:
మీ వడ్డీ రేటును నిర్ణయించడంలో వయస్సు చాలా ముఖ్యం. ఉదాహరణకు, మీరు పదవీ విరమణ వయస్సుకు సమీపంలో ఉన్నట్లయితే, లోన్ తిరిగి చెల్లించే తగ్గించబడిన సామర్థ్యం తక్కువగా ఉన్న కారణంగా మీ లోన్ వడ్డీలు పెరగవచ్చు.
-
రుణదాతతో ఇప్పటికే ఉన్న సంబంధం:
లోన్ ప్రొవైడర్‌తో ముందు నుండి ఉన్న సంబంధం, మెరుగైన వడ్డీ రేటు మరియు లోన్ నిబంధనలను పొందడంలో మీకు సహాయపడవచ్చు.
సాధారణ ప్రశ్నల వివరణ:
1. టూ వీలర్ లోన్ ఇఎంఐ ని ఎలా లెక్కించాలి?
సాధారణంగా, లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్లకు ఈ క్రింది వివరాలు అవసరం: లోన్ మొత్తం, వడ్డీ రేటు మరియు రీపేమెంట్ అవధి.
2. టూ వీలర్ లోన్ యొక్క గరిష్ట అవధి ఎంత?
లోన్ అవధి సాధారణంగా కనీసం 12 నుండి గరిష్టంగా 60 నెలల వరకు ఉంటాయి
3. క్రెడిట్ స్కోర్ టూ వీలర్ లోన్ వడ్డీ రేట్లను ఎలా ప్రభావితం చేస్తుంది?
తక్కువ క్రెడిట్ స్కోర్లను కలిగి ఉండటం అనేది అధిక వడ్డీ రేట్లకు దారితీయవచ్చు.
4. ఒక బైక్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి?
ఆన్లైన్లో, డీలర్షిప్, మొదలైన వాటి సహా బైక్ లోన్ కోసం అప్లై చేయడానికి వివిధ మార్గాలు ఉన్నాయి.
అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి: లేదా మరింత తెలుసుకోవడానికి టివిఎస్ క్రెడిట్ సాథీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి.
5. బైక్ లోన్ డౌన్ పేమెంట్ కోసం కనీస మొత్తం ఎంత?
టూ-వీలర్ లోన్‌ను సున్నా డౌన్ పేమెంట్‌తో అప్లై చేయవచ్చు.