మీ ఇ-మ్యాండేట్‌ను ఆన్లైన్లో నిలిపివేయడానికి మీకు సహాయపడే దశలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
- www.tvscredit.comను సందర్శించండి మరియు కస్టమర్ లాగిన్ కోసం మీరు ఎంపికను కనుగొనగల లాగిన్ ఎంపికపై క్లిక్ చేయండి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా కస్టమర్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి మరియు తరువాత మీ మొబైల్ నంబర్ పై మీరు అందుకునే ఓటిపి ని నమోదు చేయండి
- డ్యాష్‌బోర్డ్ నుండి వివరాలను చూడండి పై క్లిక్ చేయండి
- కుడి వైపున, సెల్ఫ్-సర్వీస్ మెనూ కింద మ్యాండేట్ రద్దుపై క్లిక్ చేయండి
- ప్రాసెస్ ప్రారంభించడానికి సబ్మిట్ పై క్లిక్ చేయండి. సమర్పించిన తర్వాత, మీ అభ్యర్థన విజయవంతంగా అప్డేట్ చేయబడిందని పేర్కొంటూ మీరు ఒక పాప్-అప్ పొందుతారు
మీ అభ్యర్థనను సమర్పించిన తర్వాత, మీరు ఒక టిక్కెట్ నంబర్ రూపంలో దాని కోసం ఒక రసీదును అందుకుంటారు, ఆ తర్వాత టివిఎస్ క్రెడిట్ బృందం అభ్యర్థనను పూర్తి చేస్తుంది మరియు పూర్తయిన తర్వాత ఒక నిర్ధారణను అందిస్తుంది.