మీరు డబ్బును అప్పుగా తీసుకునే ముందు, ఇన్స్టాల్మెంట్ల చెల్లింపును మరియు మీ బిల్లులన్నింటినీ ఏకీకృతం చేస్తే వచ్చే మొత్తంకి చెందిన చెల్లింపును అంచనా వేయండి. లోన్ నిబంధనల పట్ల అవగాహనను కలిగి ఉండండి. మీకు అనేక అప్పులు లేదా అధిక వడ్డీ ఉన్న లోన్లు ఉంటే, వాటిని ఒక ఆన్లైన్ పర్సనల్ లోన్‌గా కన్సాలిడేట్ చేయడం మరియు దానిని చెల్లించడం తెలివైన నిర్ణయం అవుతుంది. మీ ఇన్స్టాల్మెంట్ చెల్లింపులో విఫలం అవ్వకండి, ఇది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది మరియు భవిష్యత్తులో ఒక లోన్ పొందే అవకాశాలను తగ్గిస్తుంది. ఒక మంచి క్రెడిట్ చరిత్ర మరియు స్కోర్ అనేది మీరు సకాలంలో చెల్లింపులు చేయడం ద్వారా లోన్ నిబద్ధతలను పాటిస్తున్నారు అని రుణదాతలకు చూపుతుంది.