వ్యవసాయం అనేది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. అదే సమయంలో, ట్రాక్టర్లు దేశం యొక్క ఆధునిక ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక్క వంటివి. అయితే, ట్రాక్టర్‌ను కొనుగోలు చేయడం అనేది రైతులు మరియు వ్యవసాయ యజమానులకు పెద్ద పెట్టుబడితో కూడుకున్న అంశం. ఒక ట్రాక్టర్ కొనుగోలు చేయడానికి అవసరమైన నిధులను సేకరించడం చాలా మంది రైతులకు కష్టతరం కావచ్చు. అప్పుడే ఎన్‌బిఎఫ్‌సి నుండి ట్రాక్టర్ లోన్లు ఉపయోగపడతాయి.
సరసమైన ట్రాక్టర్ లోన్ల కోసం చూస్తున్న రైతులు మరియు చిన్న వ్యాపార యజమానులకు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సిలు) ఒక ప్రముఖ ఎంపికగా మారాయి. ఎన్‌బిఎఫ్‌సిలు మరింత అనుకూలమైన మరియు రైతులకు తగిన ఆర్ధిక పరిష్కారాలను అందిస్తాయి. వారు వ్యవసాయ ఆదాయం యొక్క సీజనల్ స్వభావాన్ని అర్థం చేసుకుంటారు మరియు కస్టమైజ్ చేయబడిన లోన్ ఎంపికలను అందిస్తారు.
ఎన్‌బిఎఫ్‌సిలు అంటే ఏమిటి మరియు అవి ఇతర ఆర్థిక సంస్థల నుండి ఏ విధంగా భిన్నంగా ఉంటాయి?
ఎన్‌బిఎఫ్‌సిలు అనేవి లోన్లు మరియు ఇతర ఆర్థిక సేవలను అందించే ఆర్థిక సంస్థలు కానీ అవి బ్యాంకింగ్ లైసెన్స్ కలిగి ఉండవు. టివిఎస్ క్రెడిట్ అనేది భారతదేశంలో ప్రత్యేకమైన ట్రాక్టర్ ఫైనాన్సింగ్ ఎంపికలను అందించే అటువంటి ఒక ఎన్‌బిఎఫ్‌సి, ఇది రైతులు ఇష్టపడే ఎంపిక.
ఎన్‌బిఎఫ్‌సిలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్వారా నియంత్రించబడతాయి కానీ పబ్లిక్ డిపాజిట్లను అంగీకరించవు. అవి స్వతంత్రంగా పనిచేస్తాయి మరియు వాటి కస్టమర్-ప్రధాన విధానాల కోసం ప్రసిద్ధి చెందాయి. ఎన్‌బిఎఫ్‌సిలు రైతులు, వ్యవసాయ-వ్యాపార యజమానులు మరియు గ్రామీణ వ్యవస్థాపకులు వంటి నిర్దిష్ట మార్కెట్ విభాగాలకు సేవలు అందిస్తాయి.
ఎన్‌బిఎఫ్‌సిలు సాంప్రదాయక క్రెడిట్ స్కోర్ల పై ఆధారపడటాన్ని తగ్గించే అధునాతన రుణ వితరణ నమూనాల పై ఆధారపడతాయి. బదులుగా, వారు భూమి యాజమాన్యం, వ్యవసాయ ప్రోడక్ట్ మరియు మొత్తం రీపేమెంట్ సామర్థ్యం వంటి ఆచరణాత్మక ఆర్ధిక సూచికల ఆధారంగా లోన్ అర్హతను మూల్యాంకన చేస్తారు. ఇది అధికారిక ఆదాయం లేదా క్రెడిట్ చరిత్ర లేకపోవడం వలన బ్యాంక్ లోన్ కోసం అర్హత పొందని వ్యక్తులకు మరింత అందుబాటులో ఉండేలా చేస్తుంది.
డాక్యుమెంటేషన్ మరియు లోన్ అప్రూవల్స్‌తో సహాయపడటానికి గ్రామీణ ప్రాంతాలను సందర్శించే ప్రతినిధులతో మరింత సంబంధాలు కలిగి ఉండడం ద్వారా ఎన్‌బిఎఫ్‌సిలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యక్ష విధానం వ్యవస్థీకృత రుణ సంస్థలు మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మధ్య ఆర్థిక అంతరాయాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది, అనవసరమైన ఆలస్యాలు లేకుండా రైతులు సకాలంలో ఆర్థిక మద్దతును పొందగలరని నిర్ధారిస్తుంది.
ఎన్‌బిఎఫ్‌సి నుండి ట్రాక్టర్ లోన్ పొందడం వలన కలిగే కీలక ప్రయోజనాలు
1. అనుకూలమైన అర్హతా ప్రమాణాలు: చాలా మంది రైతులు క్రమమైన ఆదాయం లేదా బలమైన క్రెడిట్ చరిత్ర కలిగి ఉండరు. ఎన్‌బిఎఫ్‌సిల ద్వారా పొందే ట్రాక్టర్ లోన్ల ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి ఏంటంటే వారు సులభమైన అర్హతా నిబంధనలతో లోన్లను అందిస్తారు, దీని ద్వారా మరింత మంది రైతులు ట్రాక్టర్లను కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది. చిన్న తరహా రైతులు కూడా వారి వ్యవసాయ యంత్రాలను అప్‌గ్రేడ్ చేయగలిగేలా ఈ చేర్పు నిర్ధారిస్తుంది.
2. త్వరిత లోన్ ప్రాసెసింగ్: విత్తడం మరియు పంటకోత సీజన్లలో సమయం చాలా ముఖ్యం. ఎన్‌బిఎఫ్‌సిలు లోన్లను వేగవంతంగా ప్రాసెస్ చేస్తాయి. ఎన్‌బిఎఫ్‌సి నుండి ట్రాక్టర్ లోన్లు కొన్ని రోజుల్లోనే ఆమోదం పొందండి. ఇది రైతులు తమ ట్రాక్టర్లను సకాలంలో పొందేలా నిర్ధారిస్తుంది. ఈ త్వరిత ఆమోదం రైతులకు వ్యవసాయ కార్యకలాపాలలో ఆలస్యాలను నివారించడానికి మరియు వారి దిగుబడి సామర్థ్యాన్ని గరిష్టంగా పెంచడానికి సహాయపడుతుంది.
3. కస్టమైజ్ చేయబడిన ఇఎంఐ ఎంపికలు: రైతులు సీజనల్ ఆదాయాలను కలిగి ఉంటారు, మరియు ఎన్‌బిఎఫ్‌సిలు ఈ విషయం అర్థం చేసుకుంటాయి. వారు ఇటువంటి రీపేమెంట్ ఎంపికలను అందిస్తారు:
– త్రైమాసిక లేదా అర్ధ-వార్షిక ఇఎంఐలు నెలవారీ చెల్లింపులకు బదులుగా, లీన్ వ్యవధులలో ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయి.
– బెలూన్ చెల్లింపులు, ఇక్కడ ఇఎంఐలు ప్రారంభంలో తక్కువగా ఉంటాయి మరియు ఆదాయం మెరుగుపడినప్పుడు తర్వాత పెరుగుతాయి, ఇవి మెరుగైన ఆర్థిక ప్రణాళికను అనుమతిస్తాయి.
– అనుకూలమైన లోన్ అవధి, రీపేమెంట్లను సులభతరం చేయడం మరియు రైతుల కోసం ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడం.
4.. సరసమైన వడ్డీ రేట్లు: టివిఎస్ క్రెడిట్ వంటి ఎన్‌బిఎఫ్‌సిలు ఇతర ఎన్‌బిఎఫ్‌సిలతో పోలిస్తే పోటీ రేట్ల వద్ద సరసమైన కొత్త ట్రాక్టర్ లోన్లు అందిస్తాయి. ఆర్‌బిఐ బ్యాంక్ వడ్డీ రేట్లను నిర్ణయించినప్పటికీ, ఎన్‌బిఎఫ్‌సిలు వారి వడ్డీ రేట్లను నిర్ణయించడానికి ప్రత్యేక మార్గదర్శకాలను అనుసరిస్తాయి, ఈ వడ్డీ రేటు 8% నుండి 20% మధ్యలో ఉండవచ్చు. ఈ రేట్లు రుణగ్రహీత యొక్క క్రెడిట్ ప్రొఫైల్, లోన్ అవధి, రీపేమెంట్ సామర్థ్యం, ట్రాక్టర్ రకం మరియు మార్కెట్ పరిస్థితులతో సహా అనేక అంశాల ద్వారా ప్రభావితం అవుతాయి. సరసమైన వడ్డీ రేట్లు మొత్తం చెల్లింపు భారాన్ని తగ్గిస్తాయి, ఇది రైతులు వారి ఆర్ధిక అవసరాలను నిర్వహించడం సులభతరం చేస్తుంది.
5. బలమైన గ్రామీణ ఉనికి: టివిఎస్ క్రెడిట్తో సహా అనేక ఎన్‌బిఎఫ్‌సిలు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తాయి, ఆ విధంగా రైతులు వారికి అవసరమైన ఆర్థిక సహాయం పొందేలా నిర్ధారిస్తాయి. లోన్ ప్రాసెస్‌ను అవాంతరాలు-లేనిదిగా చేస్తూ, వారి బ్రాంచ్‌లు మరియు ఏజెంట్లు ఇంటి వద్దనే సేవలను అందిస్తారు. ఈ విస్తృతమైన గ్రామీణ నెట్‌వర్క్ సుదూర ప్రాంతాలలోని రైతులు ఎక్కువ దూరం ప్రయాణించకుండా ఉత్తమ ఆర్థిక పరిష్కారాలను అందుకోగలరని నిర్ధారిస్తుంది.
6. 90%* వరకు ఫైనాన్సింగ్: టివిఎస్ క్రెడిట్ ట్రాక్టర్ లోన్ల పై 90%* వరకు ఫైనాన్సింగ్ అందిస్తుంది, ఇది మీ బడ్జెట్ పై ఒత్తిడి లేకుండా అధునాతన ఫీచర్లతో కొత్త ట్రాక్టర్‌ను సొంతం చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ అధిక లోన్-టు-వాల్యూ ఫైనాన్సింగ్ ద్వారా రైతులు ఆర్థిక అనుకూలతను నిర్వహిస్తూ సరైన పరికరాలలో పెట్టుబడి పెట్టడాన్ని సులభతరం చేస్తుంది.
7. అదనపు ఆర్థిక మద్దతు: టివిఎస్ క్రెడిట్ వంటి కొందరు ఫైనాన్షియర్లు, యూజ్డ్ ట్రాక్టర్ లోన్లు, ఇన్సూరెన్స్, ఫార్మ్ ఎక్విప్‌మెంట్ లోన్లు మరియు రీఫైనాన్సింగ్ ఎంపికలు వంటి అదనపు ఆర్థిక సేవలను కూడా అందిస్తారు. మీరు వారి నుండి ట్రాక్టర్ లోన్లు తీసుకున్న తర్వాత, ఎటువంటి అదనపు ప్రాసెస్ లేకుండా ఇతర లోన్లను పొందడం సులభం అవుతుంది. ఈ అదనపు మద్దతు ద్వారా రైతులు వారి పెట్టుబడులను సురక్షితం చేసుకోవడానికి మరియు అవసరమైన విధంగా పరికరాలను అప్‌గ్రేడ్ చేయడానికి సహాయపడుతుంది.
పోలిక: ట్రాక్టర్ లోన్ల కోసం ఎన్‌బిఎఫ్‌సి వర్సెస్ బ్యాంక్
ఫీచర్ | ఎన్‌బిఎఫ్‌సి | బ్యాంక్ |
అర్హత | అనుకూలమైనది, ఎటువంటి క్రెడిట్ చరిత్ర లేకుండా కూడా | కఠినమైనది, క్రెడిట్ స్కోర్ అవసరం |
ప్రాసెసింగ్ సమయం | త్వరగా (కొన్ని రోజులు) | నెమ్మదిగా (వారాలు) |
డాక్యుమెంటేషన్ | కనీసపు | విస్తృతమైన |
ఇఎంఐ ఆప్షన్లు | రైతుల కోసం కస్టమైజ్ చేయబడింది | స్థిరమైన నెలవారీ ఇఎంఐ లు |
వడ్డీ రేట్లు | సెంట్రల్ బ్యాంక్ ద్వారా నిర్ణయించబడలేదు | ఆర్‌బిఐ ద్వారా నిర్ణయించబడింది |
గ్రామీణ అవగాహన | బలమైన, స్థానిక శాఖలతో | లిమిటెడ్ |
ఎన్‌బిఎఫ్‌సి నుండి ట్రాక్టర్ లోన్ కోసం అప్లై చేయడానికి దశలు
టివిఎస్ క్రెడిట్ వంటి ఎన్‌బిఎఫ్‌సిలతో ట్రాక్టర్ లోన్ కోసం అప్లై చేయడం సులభం మరియు సరళం. మీరు ఎలా కొనసాగవచ్చో ఇక్కడ ఇవ్వబడింది:
1. అర్హతను తనిఖీ చేయండి:
– జాతీయత: భారత పౌరుడు
- వయస్సు: 18 నుండి 65 సంవత్సరాలు* (వ్యవసాయ నేపథ్యం) మరియు 21 నుండి 65 సంవత్సరాలు* (వాణిజ్య నేపథ్యం)
- వృత్తి: రైతులు, వ్యవసాయ-వ్యాపార యజమానులు, భూమి యజమానులు మరియు వాణిజ్య నేపథ్యాలు ఉన్న వ్యక్తులు.
– ఉపాధి స్థితి: సర్వీసులో ఉండాలి
- ఉపాధి స్థిరత్వం: కనీసం 1 సంవత్సరం
2. అవసరమైన డాక్యుమెంట్లు:
రకం | డాక్యుమెంట్ |
KYC డాక్యుమెంట్లు | ఓటర్ ఐడి/ డ్రైవింగ్ లైసెన్స్/ ఆధార్ కార్డ్/పాన్కార్డ్/ పాస్‌పోర్ట్ కాపీ |
చిరునామా రుజువు | రేషన్ కార్డు/ పాస్‌పోర్ట్/ విద్యుత్ బిల్లు కాపీ |
ఆదాయ రుజువు | లోన్ రీపేమెంట్‌కు మద్దతు ఇవ్వడానికి |
ఆస్తి డాక్యుమెంట్లు | భూమి యాజమాన్యం లేదా ఏదైనా ఇతర ఆస్తులు |
3. దరఖాస్తు చేయడానికి దశలు:
- మీ వాహనాన్ని ఎంచుకోండి: మీరు లోన్ పొందాలనుకుంటున్న ట్రాక్టర్‌ను నిర్ణయించుకోండి.
- అవసరమైన వివరాలను సబ్మిట్ చేయండి: అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి మరియు మీ లోన్ అప్రూవ్ చేయించుకోండి.
– లోన్ మంజూరు: టివిఎస్ క్రెడిట్ అప్లికేషన్లను వెంటనే ప్రాసెస్ చేస్తుంది. ఎటువంటి ఆలస్యం లేకుండా మీ లోన్ పంపిణీ చేయడానికి మీరు సేల్స్ ఎగ్జిక్యూటివ్ నుండి కాల్ పొందుతారు.
తెలుసుకోవడం మంచిది
ఒక ఎన్‌బిఎఫ్‌సి నుండి ట్రాక్టర్ లోన్ తీసుకునే ముందు లేదా తర్వాత, గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
- దాగి ఉన్న ఛార్జీలు: లోన్ అగ్రిమెంట్‌పై సంతకం చేయడానికి ముందు ప్రాసెసింగ్ ఫీజు, ప్రీపేమెంట్ జరిమానాలు మరియు ఆలస్యపు చెల్లింపు ఛార్జీల కోసం ఎల్లప్పుడూ తనిఖీ చేయండి. టివిఎస్ క్రెడిట్ వద్ద, మేము ఎటువంటి దాగి ఉన్న ఛార్జీలు లేకుండా కొత్త ట్రాక్టర్ లోన్లను అందిస్తాము, ఇది దానిని పారదర్శకంగా మరియు అప్లై చేయడం సులభం చేస్తుంది.
- ప్రభుత్వ సబ్సిడీలు: ట్రాక్టర్ ఫైనాన్సింగ్‌తో రైతులకు సహాయపడటానికి ప్రభుత్వం వివిధ సబ్సిడీలు మరియు పథకాలను అందిస్తుంది. మీ లోన్ భారాన్ని తగ్గించడానికి మీరు ఏదైనా సహాయం కోసం అర్హత సాధించారో లేదో తనిఖీ చేయండి.
- ఇన్సూరెన్స్ కవరేజ్: ఊహించని నష్టాలు, దొంగతనం లేదా ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షించడానికి మీ ట్రాక్టర్‌ను ఇన్సూర్ చేయడాన్ని పరిగణించండి.
- సీజనల్ రీపేమెంట్ ఎంపికలు: మీ ఆదాయం సీజనల్ అయితే, సులభమైన రీపేమెంట్‌ను నిర్ధారించడానికి రుణదాతతో కస్టమైజ్ చేయబడిన ఇఎంఐ ప్లాన్లను చర్చించండి.
- మంచి క్రెడిట్ రికార్డును నిర్వహించడం: మీ ట్రాక్టర్ లోన్‌ను సకాలంలో రీపేమెంట్ చేయడం మీ క్రెడిట్ యోగ్యతను మెరుగుపరుస్తుంది, భవిష్యత్తులో మెరుగైన ఫైనాన్షియల్ ప్రోడక్టులను పొందడానికి మీకు సహాయపడుతుంది.
ట్రాక్టర్ లోన్ల కోసం ఉత్తమ ఎన్‌బిఎఫ్‌సిలను ఎంచుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సులభమైన అర్హత, త్వరిత అప్రూవల్స్ మరియు ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఎంపికలతో, ఎన్‌బిఎఫ్‌సిలు రైతులకు ట్రాక్టర్ యాజమాన్యాన్ని సులభతరం చేస్తాయి. మేము ప్రత్యేకంగా రూపొందించబడిన ఆర్థిక పరిష్కారాలను అందిస్తాము, ప్రతి రైతు ఆర్థిక ఒత్తిడి లేకుండా ఆధునిక యంత్రాలను యాక్సెస్ చేయగలరని నిర్ధారిస్తాము.
మీరు సరసమైన ట్రాక్టర్ లోన్ల కోసం చూస్తున్నట్లయితే, టివిఎస్ క్రెడిట్ వద్ద అందుబాటులో ఉన్న ఎంపికలను అన్వేషించండి మరియు ఎటువంటి అవాంతరాలు లేకుండా మీ వ్యవసాయ అవసరాలను మొత్తం తీర్చుకోండి.