నేషనల్, డిసెంబర్ 15, 2022: భారతదేశం యొక్క ప్రముఖ ఎన్‌బిఎఫ్‌సి అయిన టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్, ఇటీవల కాలేజ్ విద్యార్థుల కోసం దాని వార్షిక క్యాంపస్ ఛాలెంజ్ కార్యక్రమం అయిన ఇ.పి.ఐ.సి సీజన్ 4 గ్రాండ్ ఫినాలేను నిర్వహించింది. #BeEPIC యొక్క థీమ్ ఆధారంగా, ఈ సీజన్ 40,000 కంటే ఎక్కువమంది విద్యార్థుల అత్యధిక రిజిస్ట్రేషన్లను పొందింది. మొదటి సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్ విద్యార్థి భాగస్వామ్యంలో 268% పెరుగుదలను చూసింది. ఈ పోటీ విద్యార్థులలో విశ్లేషణలు, ఫైనాన్స్, ఐటి మరియు వ్యూహం లో సమస్య-పరిష్కార నైపుణ్యాలు పరీక్షించింది మరియు వారికి కెరీర్-మెరుగుపరచే అవకాశాలను కూడా అందించింది.
ఈ కార్యక్రమం ద్వారా, కంపెనీ ఒక బలమైన యజమాని బ్రాండ్‌ను నిర్మించగలిగింది. వేసవి ఇంటర్న్‌షిప్ మరియు మేనేజ్‌మెంట్ ట్రైనీ కార్యక్రమం కోసం పాల్గొనేవారి నుండి కొందరిని ఎంచుకోవడానికి కూడా ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తుంది. ఇ.పి.ఐ.సి ఫినాలే వద్ద, టీవీఎస్ క్రెడిట్ యొక్క సిఇఒ శ్రీ ఆశీష్ సప్రా పాల్గొనేవారితో చర్చించారు. ఈయన ప్రసంగం తర్వాత ఒక ఫెలిసిటేషన్ సమావేశం జరిగింది, ఇందులో విజేతలకు ₹10 లక్షల విలువగల బహుమతులు అందించబడ్డాయి
ఇ.పి.ఐ.సి సీజన్ 4 గురించి మాట్లాడుతూ, చరన్‌దీప్ సింగ్, మార్కెటింగ్ హెడ్, టీవీఎస్ క్రెడిట్, ఇలా అన్నారు, "ఇ.పి.ఐ.సి కార్యక్రమం అనేది యువ నిపుణులకు సాంప్రదాయక విద్యా విధానాల కంటే భిన్నమైన పరిస్థితులలో వారి సామర్థ్యాన్ని నిరూపించడానికి ఒక ప్రత్యేక వేదికను అందించే ఒక ప్రత్యేక కార్యక్రమం. మేము ఈ సీజన్లో పెరిగిన భాగస్వామ్యం మరియు పోటీ పట్ల సంతోషిస్తున్నాము.”
టీవీఎస్ క్రెడిట్ వద్ద ఒక మేనేజ్మెంట్ ట్రైనీ ఇలా చెప్పారు, "టీవీఎస్ క్రెడిట్ ఇ.పి.ఐ.సి. ఛాలెంజ్ - సీజన్ 2 వద్ద పని చేస్తున్నప్పుడు నేను ఆర్థిక పరిశ్రమ పట్ల గొప్ప ఆసక్తిని పెంచుకున్నాను, మరియు నేను ఈ రంగంలో మరింత నేర్చుకోవాలనుకుంటున్నాను మరియు పని చేయాలనుకుంటున్నాను. ఇ.పి.ఐ.సి ఛాలెంజ్ ద్వారా, నాకు ఆసక్తి ఉన్న రంగంలో నేను నేరుగా ఇంటర్న్‌షిప్ ఆఫర్ పొందాను. తర్వాత, అది ఒక పిపిఒ గా మార్చబడింది. ఇప్పుడు, నా ఇంటర్న్‌షిప్ సమయంలో నేను ఆలోచించిన ప్రాజెక్టులను నేను ఉత్సాహంగా మరియు సంతోషంగా అమలు చేస్తున్నాను.”
గత నాలుగు సంవత్సరాల్లో, ఇ.పి.ఐ.సి కార్యక్రమం యువ ఔత్సాహికులకు ఒక కెరీర్ అభివృద్ధి చేసుకోవడానికి మరియు సంస్థ కోసం నిపుణులను సృష్టించుకోవడానికి సహకరించింది. ఇ.పి.ఐసి వంటి అనేక కార్యక్రమాలతో, టీవీఎస్ క్రెడిట్ భవిష్యత్తును నిర్మించే వివేకవంతులతో పని చేస్తూ తన కస్టమర్ల కోసం మెరుగైన భవిష్యత్తును అందించడానికి కట్టుబడి ఉంది.
టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ గురించి:
టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది ఆర్‌బిఐ వద్ద రిజిస్టర్ చేయబడిన ఒక ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. భారతదేశ వ్యాప్తంగా 31,000 టచ్ పాయింట్లతో, భారతీయులను పెద్దగా కలలు కనడానికి మరియు వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి సాధికారత కల్పించడం కంపెనీ లక్ష్యంగా కలిగి ఉంది. టీవీఎస్ మోటార్ లిమిటెడ్ కోసం అతి పెద్ద ఫైనాన్షియర్ మరియు ప్రముఖ ట్రాక్టర్ ఫైనాన్షియర్లలో ఒకరు అయిన టీవీఎస్ క్రెడిట్ టూ వీలర్ లోన్లు, ట్రాక్టర్ లోన్లు, వినియోగదారు లోన్లు, ఉపయోగించిన కారు లోన్లు, ఉపయోగించిన వాణిజ్య వాహన లోన్లు మరియు బిజినెస్ లోన్ల విభాగంలో వేగంగా అభివృద్ధి చెందుతుంది. అత్యంత అధునాతన సాంకేతికతలు మరియు డేటా విశ్లేషణల ద్వారా సంస్థ దాని 17,000+ ఉద్యోగుల సహాయంతో 9.4 మిలియన్ల కంటే ఎక్కువ కస్టమర్లకు సంతృప్తికరమైన సేవలు అందించింది.
రుచిక రానా
సీనియర్ మేనేజర్, బ్రాండింగ్ & కమ్యూనికేషన్
మొబైల్: +91 9910036860
ఇమెయిల్: ruchika.rana@tvscredit.com
వెబ్‌సైట్: https://www.tvscredit.com/
సైన్‍అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు