జాతీయ, జనవరి 24, 2022: భారతదేశం యొక్క ప్రముఖ ఆర్థిక సేవల ప్రదాత టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ట్రిచీ (ఐఐఎంటి) దేశంలో ఆర్థిక చేర్పును ప్రోత్సహించడానికి కొత్త పరిష్కారాలను రూపొందించడానికి ఇన్నోవేషన్, ఆర్&డి మరియు సహకారాన్ని పెంచడానికి ఒక అవగాహన ఒప్పందం (ఎంఒయు) పై సంతకం చేసారు.
భారతదేశంలో వేగంగా పెరుగుతున్న ఎన్‌బిఎఫ్‌సి లలో ఒకటి అయిన టీవీఎస్ క్రెడిట్ మరియు ప్రముఖ బి-స్కూల్ అయిన ఐఐఎంటి యొక్క భాగస్వామ్యం ప్రోడక్ట్ అభివృద్ధి, జ్ఞాన సృష్టి మరియు మేనేజ్‌మెంట్ మరియు పబ్లిక్ పాలసీ రంగాలలో పరిశోధన కోసం రెండు సంస్థల సంయుక్త ప్రజ్ఞ మరియు నైపుణ్యం నుండి లాభం పొందడానికి ఒక వేదికను సృష్టిస్తుంది.
ఈ భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ, టీవీఎస్ క్రెడిట్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన వెంకటరామన్ జి ఇలా అన్నారు , "ఐఐఎం ట్రిచీ తో కుదిరిన అవగాహన ఒప్పందం భవిష్యత్తులో రెండు సంస్థల మధ్య సహకారం కోసం ఒక పునాదిని వేస్తుంది. వివిధ రంగాలకు చెందిన వ్యక్తులకు టీవీఎస్ క్రెడిట్ విజయవంతంగా సాధికారత అందిస్తుంది మరియు వారి ఆకాంక్షలను నెరవేరుస్తుంది. ఇటువంటి కార్యక్రమాల నుండి అందే ఫలితాలు సంస్థ వృద్ధికి మరియు మా కస్టమర్లుకు మరియు దేశానికి భవిష్యత్తులో మెరుగైన సేవలు అందించడానికి దోహదపడతాయి. ఈ సహకారం ఆవిష్కరణ, ఆర్&డి మెరుగుపరుస్తుంది, మరియు దేశంలో ఆర్థిక చేర్పును ప్రోత్సహించేందుకు కొత్త పరిష్కారాలు రూపొందించడానికి సహకరిస్తాయి."
అత్యాధునిక సాంకేతిక ప్రాజెక్టులను సంయుక్తంగా రూపొందించడం, అభివృద్ధి చేయడం మరియు అందించడం, పరిశోధన మరియు నిర్వహణ, ఇంకా ఆర్థిక చేరిక రంగాలలో సంప్రదింపులను ప్రారంభించే అకడమిక్ ప్రముఖులు మరియు నిపుణులను ఈ భాగస్వామ్యం ఒకచోట చేర్చుతుంది. వ్యూహాత్మక సహకారం యువ నిపుణులకు శిక్షణ ఇవ్వడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి ఒక వేదికగా కూడా ఉంటుంది.
ఈ భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ ఐఐఎం ట్రిచీ డైరెక్టర్ అయిన డాక్టర్ పవన్ కుమార్ సింగ్ ఇలా అన్నారు, "సర్వీసులు మరియు విలువలకు గొప్ప పేరు కలిగిన ప్రముఖ సంస్థ అయిన టీవీఎస్ క్రెడిట్ తో మా సంబంధాన్ని క్రమబద్ధీకరించడానికి మరియు బలోపేతం చేయడానికి ఈ కీలకమైన కార్యక్రమానికి మేము స్వాగతం పలుకుతున్నాము. అనేక వేదికల పై ఈ సహకారం నుండి లబ్దిని పొందాలని మేము ఆశిస్తున్నాము మరియు పరస్పర జ్ఞాన మార్పిడి కార్యక్రమాల పై దృష్టి పెడతాము. నిర్దిష్టమైన మరియు వినూత్నమైన పరిష్కారాలను రూపొందించడం ద్వారా దీర్ఘ కాల ప్రభావం సృష్టించడానికి ఇటువంటి భాగస్వామ్యాలు సహకరిస్తాయి
ఇంకా, ఐఐఎం ట్రిచీ ఛైర్‌పర్సన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అండ్ కన్సల్టింగ్ అయినా డాక్టర్ ప్రశాంత్ గుప్తా మాట్లాడుతూ ఇలా అన్నారు, "టీవీఎస్ క్రెడిట్ భాగస్వామ్యం పట్ల మేము సంతోషంగా ఉన్నాము. మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎండిపి) మరియు లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎల్‌డిపి) వంటి కార్యక్రమాల పై ప్రత్యేక దృష్టితో ఈ భాగస్వామ్యం పరస్పర ప్రయోజనకరమైన ఫలితాలను అందించవచ్చు. ఇంకా, ఇది ఐఐఎం ట్రిచీ వద్ద విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తుంది మరియు వారికి పరిశ్రమ గురించి గొప్ప అవగాహన అందిస్తుంది."
ఈ సహకారం కింద, రెండు సంస్థలు విశ్లేషణలు మరియు సాంకేతికతను ఉపయోగించడం ద్వారా పరిశ్రమలు, విద్యావేత్తలు మరియు ప్రభుత్వ ఏజెన్సీల మధ్య ఒక అవాంతరాలు లేని వ్యవస్థను సృష్టిస్తున్నాయి. దీని లక్ష్యం వీటి కోసం పరిష్కారాలు అందించడం- కన్సల్టింగ్, పరిశోధనా ప్రాజెక్టులు, ప్లేస్‌మెంట్లు, మేనేజ్‌మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు మరియు
కేస్ స్టడీస్.
ఈ కార్యక్రమంకి చెందిన మొదటి లబ్ధిదారులు టివిఎస్ క్రెడిట్ ఉద్యోగులు మరియు ఐఐఎంటి విద్యార్థులు. ఈ ఒప్పందం పరిశ్రమలో పెద్ద ఎత్తున విప్లవాత్మక మార్పులు తెచ్చే బలమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. అదనంగా, ఎన్‌బిఎఫ్‌సి రంగంలో వనరుల సామర్థ్యాన్ని మరియు ఉత్పాదకతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు.
టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ గురించి
టివిఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ భారతదేశం అంతటా 32,000 పాయింట్లకు పైగా ఉనికిని కలిగి ఉన్న ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. టివిఎస్ మోటార్ లిమిటెడ్‌కు ప్రథమ ఫైనాన్షియర్ మరియు ప్రముఖ ట్రాక్టర్ ఫైనాన్షియర్‌లలో ఒకటిగా ఉన్న టివిఎస్ క్రెడిట్ యూజ్డ్ కార్లు, కన్జ్యూమర్ డ్యూరబుల్, యూజ్డ్ కమర్షియల్ వెహికల్ మరియు బిజినెస్ లోన్ల విభాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉనికిని కలిగి ఉంది. 19,000+ ఉత్సాహవంతులైన ఉద్యోగులు, బలమైన టెక్ మరియు విశ్లేషణ ఆధార ప్రక్రియల సహాయంతో 6.5 మిలియన్లకు పైగా సంతోషకరమైన కస్టమర్లకు సేవలు అందించబడ్డాయి. భారతీయులు తమ ఆకాంక్షల నెరవేర్పులో పెద్దగా కలలు కనేలా, సురక్షితమైన జ్ఞానంతో సాధికారత కల్పించే లక్ష్యంతో టివిఎస్ క్రెడిట్ నడుపబడుతుంది. కొత్త ప్రోడక్టులు మరియు కస్టమర్ సర్వీస్ మరియు నిరంతర మెరుగుదల పట్ల నిబద్ధతతో, టివిఎస్ క్రెడిట్ కస్టమర్లు, ఉద్యోగులు మరియు భాగస్వాములకు విలువను సృష్టిస్తుంది.
www.tvscredit.com. వద్ద టీవీఎస్ క్రెడిట్ గురించి మరింత తెలుసుకోండి
సైన్‍అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు