టివిఎస్ క్రెడిట్ వద్ద మేము మెరిట్-ఆధారిత ఫార్మల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను అనుసరిస్తాము. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ సమయంలో మేము ఎప్పుడూ దరఖాస్తుదారుల నుండి ఎటువంటి ఫీజు లేదా డిపాజిట్‌ను డిమాండ్ చేయము. మోసపూరిత ఇమెయిల్‌లు/ఆఫర్లను పంపడానికి TVS క్రెడిట్ డొమైన్ ఐడిని స్పూఫింగ్ చేసే మోసగాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండండి. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Hamburger Menu Icon
products image

పత్రికా ప్రకటనలు

ప్రత్యేకమైన సమాచారాలు మరియు ముఖ్యాంశాలను కనుగొనండి

టీవీఎస్ క్రెడిట్ తన కస్టమర్ల పండుగ డిమాండ్‌ను తీర్చడానికి అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది

ప్రచురణ: టీవీఎస్ క్రెడిట్ తేదీ: 25 | అక్టోబర్ | 2023

చెన్నై, 25 అక్టోబర్, 2023: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎన్‌బిఎఫ్‌సిలలో ఒకటైన టీవీఎస్ క్రెడిట్, కస్టమర్లకు వారి అవసరాలను తీర్చుకోవడానికి ఆర్థిక సౌలభ్యాన్ని అందించడమే లక్ష్యంగా, 40,000కి పైగా టచ్ పాయింట్లలో అద్భుతమైన లోన్ ఆఫర్లను ప్రారంభించింది.

టూ-వీలర్ వాహనాల లోన్ల విషయంలో కస్టమర్లు 60 నెలల లోన్ అవధి కోసం 95% వరకు నిధులను అందించే స్కీమ్‌లను మరియు ప్రత్యేక డిస్కౌంట్ వోచర్లను పొందవచ్చు. మొబైల్ ఫోన్లను అప్‌గ్రేడ్ చేయాలనుకునే మరియు వినియోగదారు మన్నికైన వస్తువులను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు దాని కన్స్యూమర్ లోన్ల నుండి ప్రయోజనం పొందవచ్చు. వాటిలో నో-కాస్ట్ ఇఎంఐ, పంపిణీ చేసిన లోన్ విలువ కోసం డిస్కౌంట్ వోచర్లు మరియు వారి తదుపరి కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌ లాంటివి ఉంటాయి.

అంతేకాకుండా, కంపెనీ దాని ప్రధాన కన్స్యూమర్ ప్రమోషన్ క్యాంపెయిన్ "మ్యాజికల్ దీపావళి" యొక్క 6 సీజన్‌ను కూడా ప్రారంభించింది. పూర్తిగా సమీకృతం చేయబడిన ఈ మార్కెటింగ్ చొరవ, డిజిటల్ టచ్‌ పాయింట్లు మరియు స్టోర్‌లో కార్యకలాపాల ద్వారా కస్టమర్లతో చురుగ్గా పాల్గొంటుంది. దీనిలో భాగంగా, క్యాంపెయిన్ సమయంలో టీవీఎస్ క్రెడిట్ రుణాన్ని పొందిన వినియోగదారులు ఈ పోటీలో పాల్గొనడం ద్వారా రోజువారీ మరియు మెగా బహుమతులను గెలుచుకోవచ్చు. ఇందులో సెల్ఫీ క్లిక్/ స్లోగన్ రైటింగ్ మరియు కంపెనీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వాటిని పోస్ట్ చేయడం లాంటివి ఉంటాయి. ఈ కాంటెస్ట్ ఇప్పుడు లైవ్‌లో ఉంది, 30 నవంబర్, 2023 వరకు కొనసాగుతుంది.

ఈ పండుగ సీజన్‌ను సద్వినియోగం చేసుకోవడానికి మరియు వారి ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి, ఈ ప్రత్యేక ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని టీవీఎస్ క్రెడిట్ ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తోంది.

టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ గురించిన పూర్తి వివరాలు:

టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో ఒకటి, ఇది ఆర్‌బిఐలో నమోదు చేయబడింది. భారతదేశ వ్యాప్తంగా 40,000 టచ్ పాయింట్లతో, భారతీయులు పెద్ద కలలు కనేలా మరియు వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్‌కు ప్రథమ ఆర్థికవేత్తగా మరియు ప్రముఖ ట్రాక్టర్ ఫైనాన్షియర్లలో ఒకరిగా టీవీఎస్ క్రెడిట్ యూజ్డ్ కార్ లోన్లు, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు, యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్లు మరియు అన్‍సెక్యూర్డ్ లోన్ల విభాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రికార్డును కలిగి ఉంది. సమర్థవంతమైన కొత్త-తరం టెక్నాలజీలు మరియు డేటా అనలిటిక్స్ ద్వారా నడిచే ఈ సంస్థ, 1.2 కోటికి పైగా సంతోషకరమైన కస్టమర్లకు సేవలు అందించింది.

మీడియా కాంటాక్టులు: టీవీఎస్ క్రెడిట్

రుచిక రానా
సీనియర్ మేనేజర్, బ్రాండింగ్ & కమ్యూనికేషన్
మొబైల్: +91 9910036860
ఇమెయిల్: ruchika.rana@tvscredit.com
వెబ్‌సైట్: https://www.tvscredit.com/


  • వీటిలో షేర్ చేయండి:‌
  • Share it on Facebook
  • Share it on Twitter
  • Share it on Linkedin

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి