టివిఎస్ క్రెడిట్ వద్ద మేము మెరిట్-ఆధారిత ఫార్మల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను అనుసరిస్తాము. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ సమయంలో మేము ఎప్పుడూ దరఖాస్తుదారుల నుండి ఎటువంటి ఫీజు లేదా డిపాజిట్‌ను డిమాండ్ చేయము. మోసపూరిత ఇమెయిల్‌లు/ఆఫర్లను పంపడానికి TVS క్రెడిట్ డొమైన్ ఐడిని స్పూఫింగ్ చేసే మోసగాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండండి. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Hamburger Menu Icon
products image

పత్రికా ప్రకటనలు

ప్రత్యేకమైన సమాచారాలు మరియు ముఖ్యాంశాలను కనుగొనండి

టీవీఎస్ క్రెడిట్ పండుగ సీజన్ డిమాండ్‌ కారణంగా లోన్ల పంపిణీలో వృద్ధిని అంచనా వేస్తోంది

ప్రచురణ: టీవీఎస్ క్రెడిట్ తేదీ: 29 | సెప్టంబర్ | 2022

జాతీయం, సెప్టెంబర్ 29, 2022: భారతదేశంలో ప్రముఖమైన మరియు వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక సేవల ప్రదాత అయిన టీవీఎస్ క్రెడిట్ టూ-వీలర్ లోన్లు, కన్జ్యుమర్ డ్యూరబుల్ లోన్లు, మొబైల్ లోన్లు, యూజ్డ్ కార్ లోన్లు, ట్రాక్టర్ లోన్లు, యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్లు, బిజినెస్ లోన్లు మరియు పర్సనల్ లోన్లు వంటి లోన్ ప్రోడక్టుల కోసం పండుగ సీజన్లో భారీ వృద్ధిని ఆశిస్తుంది. ఈ ప్రస్తుత పండుగ సీజన్లో లోన్ పంపిణీలలో సంస్థ వృద్ధిని ఆశిస్తుంది.

గత రెండు సంవత్సరాలుగా, మహమ్మారి కారణంగా వినియోగదారు డిమాండ్‌లో తగ్గుదల నమోదయ్యింది. అటువంటి సందర్భంలో, వినియోగదారులు తమ కలలను సాకారం చేసుకోవడంలో సహాయపడటానికి ఒక రిటైల్ ఫైనాన్సర్ పాత్ర చాలా ముఖ్యం. వాటికి పరిష్కారంగా, భారతదేశంలోని దసరా, ధనత్రయోదశి మరియు దీపావళి వంటి అతిపెద్ద పండుగల వేళలో కంపెనీ లాభదాయకమైన ఆఫర్లు, పథకాలు, రివార్డులు మరియు ఉత్తేజకరమైన బహుమతులను అందిస్తుంది. 30,000+ టచ్ పాయింట్లు వద్ద అందుబాటులో ఉన్న ఈ ఆఫర్లతో సంస్థ తన సులభమైన ఇఎంఐ ఫైనాన్సింగ్ ఎంపికలు ద్వారా కస్టమర్లు తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది.

ఈ సంవత్సరం, టూ-వీలర్ లోన్ల కోసం కంపెనీ యొక్క దీపావళి ఆఫర్ 95% ఫండింగ్ వరకు తక్షణ ఆమోదాలను మరియు ఒక పర్సనల్ లోన్ కోసం అర్హతతో పాటు ₹ 15,000 విలువగల హామీ ఇవ్వబడిన డిస్కౌంట్ వోచర్లతో 60 నెలల వరకు లోన్ అవధి యొక్క హామీని అందిస్తుంది.

కన్జ్యుమర్ డ్యూరబుల్ ఉత్పత్తుల కొనుగోలుపై కంపెనీ 10% క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తోంది. ఆధార్ ఆధారిత లోన్ అప్రూవల్ ప్రక్రియ, సున్నా డౌన్ పేమెంట్ మరియు నో-కాస్ట్ ఇఎంఐ వంటి ఫీచర్లు కస్టమర్ల కోసం దీనిని ఒక సులభమైన ఫైనాన్సింగ్ ఎంపికగా చేస్తుంది.

అదనంగా, ఇన్‌స్టాకార్డ్ కలిగి ఉన్న మా ప్రస్తుత కస్టమర్లకు ఈ వ్యవధిలో చేసిన ట్రాన్సాక్షన్ల కోసం ₹ 10,000 వరకు డిస్కౌంట్ వోచర్లు లభిస్తాయి.

కంపెనీ తన ప్రధాన వినియోగదారు ప్రచారం అయిన "మ్యాజికల్ దీపావళి" యొక్క ఐదవ సీజన్‌ను కూడా ప్రారంభిస్తుంది. ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ప్రచారం పండుగ వ్యవధిలో కస్టమర్లకు ఉత్తేజకరమైన రివార్డులను అందించడం ద్వారా డిజిటల్ ఛానెళ్లు మరియు విక్రయ పాయింట్ల ద్వారా కస్టమర్లను సంప్రదిస్తుంది.

టీవీఎస్ క్రెడిట్ సిఇఒ అయిన ఆశిష్ సప్రా మాట్లాడుతూ ఇలా అన్నారు: "డిమాండ్ బాగుంది మరియు మా ఛానల్ భాగస్వామి సంబంధాల నిర్మాణం పై మరియు మా కస్టమర్ల అవసరాలు మరియు ఆకాంక్షలను పరిష్కరించే లోన్ ప్రోడక్టుల ద్వారా కస్టమర్లకు డబ్బుకు తగ్గ విలువను అందించడం పై మేము దృష్టి పెట్టాము. వినియోగదారు భావన ఈ సీజన్లో బాగుంది, ఇది లోన్ పంపిణీలో పెరుగుదలకు కారణం అవుతుంది.”

తన సౌకర్యవంతమైన ఫైనాన్సింగ్ ఎంపికల ద్వారా కస్టమర్లు మెరుగైన ఆకాంక్షలను నిర్మించే వాగ్దానం పై టీవీఎస్ క్రెడిట్ నిర్మించబడింది. దాని పండుగ ప్రోడక్టులు అవసరమైన ఆర్థిక చేర్పునకు వీలు కలిపిస్తాయి, ఇది సాధికార భారతదేశం అనే విజన్ కు దోహదపడుతుంది.

అనుబంధాలు:
1. టీవీఎస్ క్రెడిట్ యొక్క టూ-వీలర్ లోన్ ఆఫర్ వీడియోలకు లింక్:
a. https://www.youtube.com/watch?v=Jvgs7I3Nv5o
b. https://www.youtube.com/watch?v=tThw-kRHA1g
c. https://www.youtube.com/watch?v=9ira_NvpdRI
2. JPEG ఫార్మాట్‌లో టీవీఎస్ క్రెడిట్ లోన్ ఆఫర్లు

టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ గురించి పూర్తి వివరాలు:
టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది ఆర్‌బిఐ వద్ద రిజిస్టర్ చేయబడిన ఒక ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. భారతదేశ వ్యాప్తంగా 31,000 టచ్ పాయింట్లతో, భారతీయులను పెద్దగా కలలు కనడానికి మరియు వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి సాధికారత కల్పించడం కంపెనీ లక్ష్యంగా కలిగి ఉంది. టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్‌కు అతి పెద్ద ఫైనాన్షియర్‌గా మరియు ప్రముఖ ట్రాక్టర్ ఫైనాన్షియర్లలో ఒకరిగా నిలిచిన టీవీఎస్ క్రెడిట్ యూజ్డ్ కార్ లోన్లు, కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లు, యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్లు మరియు అన్‍సెక్యూర్డ్ లోన్ల విభాగంలో వేగంగా దూసుకెళ్తోంది. అత్యంత అధునాతన సాంకేతికతలు మరియు డేటా విశ్లేషణల ద్వారా సంస్థ దాని 17,000+ ఉద్యోగుల సహాయంతో 8.4 మిలియన్ల కంటే ఎక్కువ కస్టమర్లకు సంతృప్తికరమైన సేవలు అందించింది.

మీడియా కాంటాక్టులు: టీవీఎస్ క్రెడిట్

రుచిక రానా
సీనియర్ మేనేజర్, బ్రాండింగ్ & కమ్యూనికేషన్
మొబైల్: +91 9910036860
ఇమెయిల్: ruchika.rana@tvscredit.com
వెబ్‌సైట్: https://www.tvscredit.com/


  • వీటిలో షేర్ చేయండి:‌
  • Share it on Facebook
  • Share it on Twitter
  • Share it on Linkedin

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి