టివిఎస్ క్రెడిట్ వద్ద మేము మెరిట్-ఆధారిత ఫార్మల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను అనుసరిస్తాము. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ సమయంలో మేము ఎప్పుడూ దరఖాస్తుదారుల నుండి ఎటువంటి ఫీజు లేదా డిపాజిట్‌ను డిమాండ్ చేయము. మోసపూరిత ఇమెయిల్‌లు/ఆఫర్లను పంపడానికి TVS క్రెడిట్ డొమైన్ ఐడిని స్పూఫింగ్ చేసే మోసగాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండండి. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Hamburger Menu Icon
products image

పత్రికా ప్రకటనలు

ప్రత్యేకమైన సమాచారాలు మరియు ముఖ్యాంశాలను కనుగొనండి

టీవీఎస్ క్రెడిట్ జి.వెంకటరామన్ రిటైర్‌మెంట్ తర్వాత తమ కొత్త సిఇఒ ని నియమిస్తుంది

ప్రచురణ: టీవీఎస్ క్రెడిట్ తేదీ: 10 | ఆగస్ట్ | 2022

చెన్నై, 10 ఆగస్ట్ 2022: గత 10 సంవత్సరాల పాటు విజయవంతంగా టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ కు నేతృత్వం వహించిన తరువాత శ్రీ జి వెంకట్రామన్ 31 ఆగస్ట్ 2022 నాడు డైరెక్టర్ మరియు సిఇఒ గా రిటైర్ అవుతారు. ఈయన తరువాత శ్రీ ఆశిష్ సప్రా సిఇఒ గా బాధ్యతలు స్వీకరిస్తారు, వారు సెప్టెంబర్ 2022 యొక్క మొదటి వారంలో సంస్థలో చేరతారు.

టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ సుదర్శన్ వేణు గారు ఇలా చెప్పారు, "గత కొన్ని సంవత్సరాలుగా, టీవీఎస్ క్రెడిట్ వేగంగా మరియు లాభదాయకమైన మార్గంలో అభివృద్ధి చెందింది. తక్కువ సమయంలో, కంపెనీ ఆరోగ్యకరమైన బ్యాలెన్స్ షీట్‌తో ₹ 15,000+ కోట్ల ఎయుఎం కు పెరిగింది. ఉత్సాహం మరియు వివేకం కలగలిసిన నాయకత్వం కలిగిన వెంకట్‌కు నేను కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. తదుపరి దశ కోసం, మా దృష్టి మరింత డిజిటైజేషన్, కొత్త కస్టమర్లను పొందడం మరియు వేగవంతమైన వృద్ధి పై ఉంటుంది. ఆశీష్‌కి ఈ రంగంలో అనుభవం మరియు ట్రాక్ రికార్డ్ ఉంది మరియు అతని నాయకత్వంలో టీవీఎస్ క్రెడిట్ మరింత ఉన్నత శిఖరాలకు చేరుతుంది అని మరియు అనేక రెట్లు అభివృద్ధి చెందుతుంది అని నాకు విశ్వాసం ఉంది.”

శ్రీ ఆశిష్ సప్రా కి 25+ సంవత్సరాల వృత్తిపరమైన పని అనుభవం ఉంది మరియు రిటైల్ అసెట్లు, ఇన్సూరెన్స్, కార్డులు, సంపద నిర్వహణ వంటి వివిధ ఆర్థిక ఉత్పత్తుల వ్యాప్తంగా పని చేశారు మరియు క్రాస్ సెల్ లో బలమైన నైపుణ్యం కలిగి ఉన్నారు. టీవీఎస్ క్రెడిట్‌లో చేరక మునుపు ఈయన బజాజ్ గ్రూప్‌లో హౌసింగ్ ఫైనాన్స్, జనరల్ ఇన్సూరెన్స్ మరియు ఎన్‌బిఎఫ్‌సి వ్యాపారాలలో 14+ సంవత్సరాలు పని చేశారు. ఈయనకి పి&ఎల్ నిర్వహణ, ‌
డిజిటల్ మరియు టెక్నాలజీ కార్యక్రమాల నిర్వహణ, సీనియర్ భాగస్వాములను మెరుగ్గా నిర్వహించడం, లాభదాయకతను పెంచడానికి వ్యాపారాలను ప్రారంభించడం మరియు మార్పులు చేయడంలో అనుభవం ఉంది. ఈయన అమెరికన్ ఎక్స్‌ప్రెస్, హెచ్‌ఎస్‌బిసి, మరియు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు లలో పని చేశారు.

మీడియా కాంటాక్టులు: టీవీఎస్ క్రెడిట్

రుచిక రానా
సీనియర్ మేనేజర్, బ్రాండింగ్ & కమ్యూనికేషన్
మొబైల్: +91 9910036860
ఇమెయిల్: ruchika.rana@tvscredit.com
వెబ్‌సైట్: https://www.tvscredit.com/


  • వీటిలో షేర్ చేయండి:‌
  • Share it on Facebook
  • Share it on Twitter
  • Share it on Linkedin

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి