తమిళ్ నాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో రిటైలర్ లోన్ల గురించి అవగాహన పెంచడానికి క్షేత్రస్థాయి ప్రచారం
తమిళనాడు, చెన్నై, జూలై 13, 2022: భారతదేశం యొక్క ప్రముఖ మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడర్, టీవీఎస్ క్రెడిట్ ఇటీవల వర్కింగ్ క్యాపిటల్ లోన్లు, అన్‍సెక్యూర్డ్ బిజినెస్ లోన్లు మరియు చిన్న మరియు మధ్యతరహా రిటైలర్ల అవసరాలను తీర్చుకోవడానికి సహాయపడటానికి దాని రిటైలర్ లోన్ ఆఫరింగ్స్ గురించి అవగాహన పెంచడానికి దాని 'రిటైలర్ కనెక్ట్' మార్కెటింగ్ యాక్టివేషన్‌ను ప్రారంభించింది.
గత కొన్ని సంవత్సరాలుగా స్థానిక రిటైల్ రంగం క్రమంగా పెరుగుతున్నప్పటికీ అది ఇప్పటికీ అందరికీ అందుబాటులోకి రాలేదు. దాని నిజమైన సామర్థ్యాన్ని అన్లాక్ చేయడానికి, సులభమైన క్రెడిట్‌కు యాక్సెస్ అందించడం ద్వారా అంతరాన్ని తగ్గించడంలో ఎన్‌బిఎఫ్‌సిలు ఒక కీలకమైన పాత్ర పోషించవచ్చు. టీవీఎస్ క్రెడిట్ రిటైలర్లకు వారి వర్కింగ్ క్యాపిటల్ పై మెరుగైన నియంత్రణ మరియు వారి ఇన్వెంటరీపై ఫ్లెక్సిబిలిటీ అందించే ఆర్థిక పరిష్కారాలను అందిస్తుంది.
“టీవీఎస్ క్రెడిట్ వద్ద, కస్టమర్లు వారి కలలను నిజం చేసుకోవడానికి సమయానికి తగినట్లుగా సరసమైన క్రెడిట్ అందించి కస్టమర్లను సాధికారపరచడమే లక్ష్యంగా కలిగి ఉంది. మా రిటైలర్ కనెక్ట్ కార్యక్రమం ఈ లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది: చిన్న రిటైలర్లకు వారి వ్యాపారాన్ని పెంచుకోవడంలో సహాయపడటానికి. తదుపరి కొన్ని వారాల్లో, ఈ కార్యక్రమం ద్వారా నాలుగు రాష్ట్రాల్లోని 1,00,000 కంటే ఎక్కువ రిటైలర్లతో కనెక్ట్ అవ్వడమే మా లక్ష్యం.", అని టీవీఎస్ క్రెడిట్ మార్కెటింగ్ మరియు సిఆర్ఎం హెడ్ అయిన శ్రీ చరణ్‌దీప్ సింగ్ చెప్పారు.
చెన్నైలోని సుభాష్ స్టోర్ యజమాని అయిన సురేష్ కుమార్ ఇలా అన్నారు, "మా నాన్నగారు మరియు నేను కలిసి గత 40 సంవత్సరాలుగా ఈ స్టోర్‌ను నిర్వహిస్తున్నాము. మా వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి, మేము అనేక బ్యాంకులను సంప్రదించాము కానీ అనేక డాక్యుమెంట్లు అవసరం అయినందున మేము లోన్ పొందలేకపోయాము. ఆ సమయంలో, మా డిస్ట్రిబ్యూటర్లలో ఒకరి ద్వారా టీవీఎస్ క్రెడిట్ గురించి తెలుసుకున్నాము. దీనిని అనుసరించి, మేము టీవీఎస్ క్రెడిట్ ప్రతినిధిని మా అవసరం గురించి తెలియజేశాము, వారు ఎటువంటి అవాంతరాలు లేకుండా మరియు సుదీర్ఘమైన డాక్యుమెంటేషన్ లేకుండా లోన్ పొందడానికి మాకు సహాయపడ్డారు. నేను ఖచ్చితంగా నా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు టీవీఎస్ క్రెడిట్ లోన్లను సిఫార్సు చేస్తాను.”
ఈ ప్రచారం ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించబడుతుంది, ఇది ఈ రాష్ట్రాల్లోని అనేక పట్టణాలను కవర్ చేస్తుంది. ఈ బృందం రోడ్ షోలు మరియు మార్కెట్ ప్రచార కార్యక్రమాల ద్వారా రిటైలర్లను సంప్రదిస్తుంది మరియు రిటైలర్లు తమ వ్యాపారాలను పెంచుకోవడానికి లోన్ ప్రోడక్టుల వివరాలను అందిస్తుంది.
టీవీఎస్ క్రెడిట్ యొక్క ఇతర లోన్ ఆఫరింగ్‌లో టూ-వీలర్ లోన్లు, యూజ్డ్ కార్ లోన్లు, ట్రాక్టర్ లోన్లు, యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్లు, బిజినెస్ లోన్లు, కన్జ్యూమర్ లోన్లు మరియు పర్సనల్ లోన్లు ఉంటాయి.
టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ గురించి
టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది ఆర్‌బిఐ వద్ద రిజిస్టర్ చేయబడిన ఒక ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. భారతదేశ వ్యాప్తంగా 31,000 టచ్ పాయింట్లతో, భారతీయులను పెద్దగా కలలు కనడానికి మరియు వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి సాధికారత కల్పించడం కంపెనీ లక్ష్యంగా కలిగి ఉంది. టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్‌కు అతి పెద్ద ఫైనాన్షియర్‌గా మరియు ప్రముఖ ట్రాక్టర్ ఫైనాన్షియర్లలో ఒకరిగా నిలిచిన టీవీఎస్ క్రెడిట్ యూజ్డ్ కార్ లోన్లు, కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లు, యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్లు మరియు అన్‍సెక్యూర్డ్ లోన్ల విభాగంలో వేగంగా దూసుకెళ్తోంది. అత్యంత అధునాతన సాంకేతికతలు మరియు డేటా విశ్లేషణల ద్వారా సంస్థ దాని 17,000+ ఉద్యోగుల సహాయంతో 8.4 మిలియన్ల కంటే ఎక్కువ కస్టమర్లకు సంతృప్తికరమైన సేవలు అందించింది.
రుచిక రానా
సీనియర్ మేనేజర్, బ్రాండింగ్ & కమ్యూనికేషన్
మొబైల్: +91 9910036860
ఇమెయిల్: ruchika.rana@tvscredit.com
వెబ్‌సైట్: https://www.tvscredit.com/
సైన్‍అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు