టివిఎస్ క్రెడిట్ వద్ద మేము మెరిట్-ఆధారిత ఫార్మల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను అనుసరిస్తాము. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ సమయంలో మేము ఎప్పుడూ దరఖాస్తుదారుల నుండి ఎటువంటి ఫీజు లేదా డిపాజిట్‌ను డిమాండ్ చేయము. మోసపూరిత ఇమెయిల్‌లు/ఆఫర్లను పంపడానికి TVS క్రెడిట్ డొమైన్ ఐడిని స్పూఫింగ్ చేసే మోసగాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండండి. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

hamburger icon
products image

పత్రికా ప్రకటనలు

ప్రత్యేకమైన సమాచారాలు మరియు ముఖ్యాంశాలను కనుగొనండి

టీవీఎస్ క్రెడిట్ ఎఫ్‌వై23లో తమ నిర్వహణలో ఉన్న ఆస్తులను (ఎయుఎం) ₹20,602 కోట్లకు పెంచుకుంది

ప్రచురణ: టీవీఎస్ క్రెడిట్ తేదీ: 4 | మే | 2023

జాతీయం, మే 04, 2023: భారతదేశం యొక్క ప్రముఖ ఎన్‌బిఎఫ్‌సి లలో ఒకటి అయిన టివిఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ నాల్గవ త్రైమాసికం మరియు మార్చి 31, 2023 న ముగిసిన సంవత్సరం కోసం తన ఆడిట్ చేయబడిన ఆర్థిక ఫలితాలను ప్రచురించింది.

మార్చ్ 31, 2023 నాటికి ముగిసిన త్రైమాసికం కోసం ఈ ఎన్‌బిఎఫ్‌సి ₹1,236 కోట్ల పూర్తి ఆదాయం మరియు ₹111 కోట్ల పన్ను తరువాత నికర ఆదాయాన్ని నివేదించింది, ఇది గత సంవత్సరంలోని ఈ త్రైమాసికంతో పోలిస్తే 60% మరియు 76% అధికంగా ఉంది.

ఎఫ్‌వై23 లో పంపిణీలో సంస్థ బలమైన వృద్ధిని కొనసాగించింది, ఇది ప్రముఖంగా క్రెడిట్ డిమాండ్ మరియు కస్టమర్లు ఆదరించిన కస్టమైజ్ చేయబడిన ప్రోడక్ట్ ఆఫరింగ్స్ వలన జరిగింది. అవాంతరాలు లేని కస్టమర్ అనుభవాన్ని అందించడానికి భవిష్యత్తు పై దృష్టితో సాంకేతికత మరియు డిజిటల్ సామర్థ్యాల పై సంస్థ పెట్టుబడి పెడుతుంది మరియు దీనిని కొనసాగిస్తుంది.

ఎఫ్‌వై23 ఫలితాల సారాంశం:

• మార్చి'23 నాటికి ఎయుఎం ₹20,602 కోట్లుగా ఉంది, మార్చి'22 తో పోలిస్తే 48% వృద్ధి
• ఎఫ్‌వై23 కోసం మొత్తం ఆదాయం ₹4,160 కోట్లు, మునుపటి సంవత్సరంతో పోలిస్తే 51% పెరుగుదల
• ఎఫ్‌వై23 కోసం పన్నుకు ముందు లాభం ₹511 కోట్లగా ఉంది, మునుపటి సంవత్సరంతో పోలిస్తే 238% పెరుగుదల
• పన్ను తర్వాత నికర లాభం మార్చి'23 నాటికి ముగిసిన సంవత్సరం కోసం ₹389 కోట్లుగా ఉంది, మునుపటి సంవత్సరంతో పోలిస్తే 221% వృద్ధి

పనితీరుపై వ్యాఖ్యానిస్తూ సిఇఒ అయిన శ్రీ ఆశీష్ సప్రా ఇలా అన్నారు, "మేము ఎఫ్‌వై23లో మెరుగైన వృద్ధిని సాధించాము, ప్రోడక్టుల వ్యాప్తంగా పంపిణీలలో గణనీయమైన వృద్ధిని సాధించాము. 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న మరియు పెరుగుతున్న కస్టమర్ బేస్‌ కలిగి ఉన్న మేము డేటా మరియు సాంకేతికత సహాయంతో కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడం పై దృష్టి పెట్టాము."

వివిధ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న సులభమైన ఇఎంఐ ఫైనాన్సింగ్ ఎంపికలతో, కంపెనీ పెరుగుతున్న భారతదేశపు ఆకాంక్షలను నెరవేర్చుతోంది.

టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ గురించిన పూర్తి వివరాలు:

టివిఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది ఆర్‌బిఐ వద్ద రిజిస్టర్ చేయబడిన ఒక ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. భారతదేశ వ్యాప్తంగా 31,000 టచ్ పాయింట్లతో, భారతీయులను పెద్దగా కలలు కనడానికి మరియు వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి సాధికారత కల్పించడం కంపెనీ లక్ష్యంగా కలిగి ఉంది. టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్‌కు అతి పెద్ద ఫైనాన్షియర్‌గా మరియు ప్రముఖ ట్రాక్టర్ ఫైనాన్షియర్లలో ఒకరిగా నిలిచిన టివిఎస్ క్రెడిట్ యూజ్డ్ కార్ లోన్లు, కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లు, యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్లు మరియు అన్‍సెక్యూర్డ్ లోన్ల విభాగంలో వేగంగా దూసుకెళ్తోంది. బలమైన అధునాతన సాంకేతికతల మరియు డేటా విశ్లేషణల ద్వారా పవర్ చేయబడిన కంపెనీ దాని 17,000+ ఉద్యోగుల సహాయంతో దాదాపుగా 10 మిలియన్ల సంతోషకరమైన కస్టమర్లకు సేవలు అందించింది.

మీడియా కాంటాక్టులు: టీవీఎస్ క్రెడిట్

రుచిక రానా
సీనియర్ మేనేజర్, బ్రాండింగ్ & కమ్యూనికేషన్
మొబైల్: +91 9910036860
ఇమెయిల్: ruchika.rana@tvscredit.com
వెబ్‌సైట్: https://www.tvscredit.com/


  • వీటిలో షేర్ చేయండి:‌

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి