hamburger icon
products image

పత్రికా ప్రకటనలు

ప్రత్యేకమైన సమాచారాలు మరియు ముఖ్యాంశాలను కనుగొనండి

టీవీఎస్ క్రెడిట్ తన ప్రధాన 'గ్రామీణ కనెక్ట్' కార్యక్రమం ద్వారా భారతదేశ ఆకాంక్షలకు ఆజ్యం పోస్తుంది

ప్రచురణ: టీవీఎస్ క్రెడిట్ తేదీ: 13 | జూలై | 2022

మహారాష్ట్ర లోని పూణే యొక్క అనేక తాలూకాలలో రైతులకు సులభమైన లోన్లు మరియు క్రెడిట్ సదుపాయాలను అందుబాటులో ఉంచడానికి ఒక అవగాహన కార్యక్రమం యొక్క నిర్వహణ

మహారాష్ట్ర, పూణే, జూలై 13, 2022: భారతదేశంలో ప్రముఖమైన మరియు వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక సేవల ప్రదాత అయిన టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ ఇటీవల తన క్షేత్రస్థాయి కార్యక్రమం అయినా 'గ్రామీణ్ కనెక్ట్' ను ప్రారంభించింది. కొత్త మరియు యూజ్డ్ ట్రాక్టర్లను మరియు వ్యవసాయ పనిముట్లను కొనుగోలు చేయడానికి తమ సరసమైన మరియు ఇబ్బందులు లేని లోన్ల గురించి గ్రామీణ సమాజం మరియు రైతులకు అవగాహన కలిపించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. రైతుల అవసరాలకు సరిపోయే విధంగా ట్రాక్ ఆధారిత పర్సనల్ లోన్లను కూడా టీవీఎస్ క్రెడిట్ అందిస్తుంది.

గడచిన అనేక సంవత్సరాలుగా, భారతదేశంలోని గ్రామీణ వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందింది, కానీ క్రెడిట్ ప్రవేశం తక్కువగా ఉంటుంది, ఇది వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడానికి కమ్యూనిటీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మెరుగైన దిగుబడి మరియు ఆదాయం కోసం మెకనైజ్డ్ వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించే ఆర్థిక సేవలను టీవీఎస్ క్రెడిట్ అందిస్తుంది.

టీవీఎస్ క్రెడిట్ మార్కెటింగ్ మరియు సిఆర్ఎం హెడ్ అయిన శ్రీ చరణ్‌దీప్ సింగ్ ఇలా అన్నారు, "టీవీఎస్ క్రెడిట్ వద్ద, మేము భారతీయులను వారి ఆకాంక్షలను నెరవేర్చుకోవడంలో సహాయపడటానికి కట్టుబడి ఉన్నాము. మా 'గ్రామీణ్ కనెక్ట్' కార్యక్రమం ద్వారా, రైతులు తమ పొలాలలో ఉత్పాదకతను మెరుగుపరచడానికి మరియు వారి ఆదాయాన్ని పెంచడానికి సహాయపడే ఫైనాన్స్‌కు వారికి యాక్సెస్ ఇవ్వడానికి మేము గ్రామీణ మరియు వ్యవసాయ కస్టమర్లకు చేరువ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా, మేము పూణేలో దాదాపు ఐదు లక్షల గ్రామీణ జనాభాను చేరుకుంటున్నాము.”

ఒక కస్టమర్ అయిన నిఖిల్ వాడేకర్ ఇలా చెప్పారు, "నా పొలం యొక్క ఉత్పాదకతను మెరుగుపరచడానికి ఒక రోటావేటర్ కొనుగోలు చేయడానికి వనరుల అవసరం నాకు ఉండేది. నా గ్రామంలో నేను ఒక టీవీఎస్ క్రెడిట్ ప్రతినిధిని కలిసాను, వారు క్రెడిట్ పై ఒక రోటావేటర్‌ను సులభంగా ఎలా కొనుగోలు చేయాలో నాకు వివరించారు. కనీస డాక్యుమెంటేషన్‌తో లోన్ ప్రక్రియ వేగంగా ఉంది. నేను నా స్నేహితులకు టీవీఎస్ క్రెడిట్ సిఫార్సు చేస్తాను.”

మహారాష్ట్రలో పూణేలోని అంబేగావ్, ఖేడ్, జున్నార్ మరియు మావల్ తహసీల్స్ అంతటా ఈ ప్రచారం నడపబడింది. టివిఎస్ క్రెడిట్ బృందం రోడ్ షోలు, బూత్‌లు మరియు సినిమా-ఆన్-వీల్స్ ద్వారా ప్రేక్షకులతో కనెక్ట్ చేయబడింది, వారి వ్యవసాయ మరియు వ్యక్తిగత అవసరాలను తీర్చుకోవడానికి వారికి సహాయపడే అనేక ఆర్థిక ఆఫర్లను పంచుకుంటుంది.

టీవీఎస్ క్రెడిట్ యొక్క ఇతర లోన్ ఆఫరింగ్‌లో టూ-వీలర్ లోన్లు, యూజ్డ్ కార్ లోన్లు, ట్రాక్టర్ లోన్లు, యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్లు, బిజినెస్ లోన్లు, కన్జ్యూమర్ లోన్లు మరియు పర్సనల్ లోన్లు ఉంటాయి.

టివిఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ గురించి :
టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది ఆర్‌బిఐ వద్ద రిజిస్టర్ చేయబడిన ఒక ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. భారతదేశ వ్యాప్తంగా 31,000 టచ్ పాయింట్లతో, భారతీయులను పెద్దగా కలలు కనడానికి మరియు వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి సాధికారత కల్పించడం కంపెనీ లక్ష్యంగా కలిగి ఉంది. టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్‌కు అతి పెద్ద ఫైనాన్షియర్‌గా మరియు ప్రముఖ ట్రాక్టర్ ఫైనాన్షియర్లలో ఒకరిగా నిలిచిన టీవీఎస్ క్రెడిట్ యూజ్డ్ కార్ లోన్లు, కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లు, యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్లు మరియు అన్‍సెక్యూర్డ్ లోన్ల విభాగంలో వేగంగా దూసుకెళ్తోంది. అత్యంత అధునాతన సాంకేతికతలు మరియు డేటా విశ్లేషణల ద్వారా సంస్థ దాని 17,000+ ఉద్యోగుల సహాయంతో 8.4 మిలియన్ల కంటే ఎక్కువ కస్టమర్లకు సంతృప్తికరమైన సేవలు అందించింది.

మీడియా కాంటాక్టులు: టీవీఎస్ క్రెడిట్

రుచిక రానా
సీనియర్ మేనేజర్, బ్రాండింగ్ & కమ్యూనికేషన్
మొబైల్: +91 9910036860
ఇమెయిల్: ruchika.rana@tvscredit.com
వెబ్‌సైట్: https://www.tvscredit.com/


  • వీటిలో షేర్ చేయండి:‌

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి