చెన్నై, జూన్ 9, 2023: టివిఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ ("టివిఎస్ క్రెడిట్" లేదా "కంపెనీ"), భారతదేశం యొక్క ప్రముఖ ఎన్‌బిఎఫ్‌సిలలో ఒకటి, ఈరోజే ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ నుండి ₹480 కోట్ల ఈక్విటీ క్యాపిటల్‌ను విజయవంతంగా సేకరించినట్లు ప్రకటించింది.
ట్రాన్సాక్షన్‌లో భాగంగా, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ ప్రాథమిక మరియు ద్వితీయ పెట్టుబడి కలయిక ద్వారా ₹ 737 కోట్లకు టివిఎస్ క్రెడిట్‌లో 9.7% ఈక్విటీ వాటాను పొందుతుంది.
కొత్త మార్కెట్లలో తన కస్టమర్ బేస్‌ను విస్తరించడంలో, ఛానల్ భాగస్వామి నెట్‌వర్క్‌ను పెంచడంలో మరియు దాని డిజిటైజేషన్ ప్రయాణాన్ని అభివృద్ధి చేయడంలో టివిఎస్ క్రెడిట్ ప్రయత్నాలను మరింత బలోపేతం చేయడానికి ప్రాథమిక మూలధనం ఉపయోగించబడుతుంది. ఈ మూలధనం జోడింపుతో, సౌకర్యవంతమైన ఫైనాన్సింగ్ ఎంపికలను అందించడం ద్వారా అభివృద్ధి చెందుతున్న భారతదేశం ఆకాంక్షలను నెరవేర్చే మిషన్‌ను వేగవంతం చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ఫండింగ్ గురించి మాట్లాడుతూ టివిఎస్ క్రెడిట్ ఛైర్మన్ అయిన సుదర్శన్ వేణు ఇలా అన్నారు, "టివిఎస్ క్రెడిట్ అసాధారణమైన పనితీరును ప్రదర్శించింది, బలమైన మరియు లాభదాయకమైన వృద్ధిని సాధించింది. అతి తక్కువ సమయంలోనే, కంపెనీకి చెందిన నిర్వహణలో ఉన్న ఆస్తులు (ఎయుఎం) కింద మా కంపెనీ యొక్క ఆస్తులు ఒక బలమైన బ్యాలెన్స్ షీట్ సహాయంతో ₹20,000 కోట్లను దాటిపోయాయి. మా ప్రయాణం యొక్క తదుపరి దశలో, కొత్త కస్టమర్లను చేరుకోవడానికి మరియు అధిక వృద్ధిని సాధించడానికి డిజిటైజేషన్‌పై మా దృష్టి ఉంటుంది. ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ పై నాకు చాలా గౌరవం ఉంది మరియు వారిని ఒక భాగస్వామిగా కలిగి ఉండటం నాకు సంతోషంగా ఉంది. భారతీయ వినియోగదారు ముఖచిత్రం మరియు ఆర్థిక సేవల పరిశ్రమ గురించి వారి లోతైన అవగాహనతో, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ వ్యూహాత్మక విలువను అందిస్తుంది మరియు మా వృద్ధి ప్రణాళికలను వేగవంతం చేస్తుంది.”
“సరసమైన మరియు వినూత్నమైన ఆర్థిక ప్రోడక్టులకు సులభమైన యాక్సెస్‌ను అందించడం ద్వారా ఆర్థిక చేర్పును నడపడానికి వారి ప్రయాణంలో టివిఎస్ క్రెడిట్‌తో భాగస్వామిగా ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము. టివిఎస్ క్రెడిట్ తన కస్టమర్ బేస్‌ను విస్తరించడానికి ఒక ఓమ్ని-ఛానల్ విధానం ద్వారా సాంకేతికత మరియు డిజిటల్ భాగస్వామ్యాలను వినియోగించుకోవడానికి మరియు సాంప్రదాయక ఫైనాన్సింగ్‌లో ప్రమేయంగల ఆందోళనను గణనీయంగా తగ్గించడానికి ప్రతిపాదిస్తుంది. కంపెనీ తన పేరెంటేజీని బట్టి, గొప్ప విజయాన్ని సాధిస్తుందని మరియు వాటాదారులందరికీ గణనీయమైన విలువను పెంపొందించగలదని మేము విశ్వసిస్తున్నాము, ”అని ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ సిఇఒ మరియు మేనేజింగ్ పార్టనర్ టికె కురియన్ అన్నారు.
సంఘటితమైన మరియు సరసమైన క్రెడిట్ ఎంపికలను అందించడం ద్వారా, టివిఎస్ క్రెడిట్ వివిధ సామాజిక మరియు ఆర్థిక నేపథ్యాలకు చెందిన వ్యక్తులకు సాధికారతను అందించి వారి ఆర్థిక శ్రేయస్సుకు దోహదపడుతుంది. కంపెనీ మంచి క్రెడిట్ నాణ్యతతో స్థిరమైన వృద్ధిని సాధించింది మరియు దేశవ్యాప్తంగా 40,000+ టచ్‌పాయింట్ల విస్తృత నెట్‌వర్క్ ద్వారా సేవలు అందుకునే 1 కోట్లకు పైగా బలమైన కస్టమర్ బేస్‌ను నిర్మించింది. ఎఫ్‌వై23 లో, కంపెనీ మునుపటి సంవత్సరంతో పోలిస్తే 48% వృద్ధితో ₹ 20,602 కోట్ల ఎయుఎం ను నివేదించింది. తదుపరి కొన్ని సంవత్సరాల్లో కంపెనీ తన ఎయుఎం ₹ 50,000 కోట్లకు పైగా పెరుగుతుందని ఆశిస్తుంది. దాని బలమైన ఫౌండేషన్, డిజిటల్ ఓరియంటేషన్ మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాలతో, కంపెనీ ఆర్థిక చేర్పు, ఆవిష్కరణను ప్రోత్సహించడం మరియు దాని వాటాదారులకు విలువను అందించడం పై దృష్టి పెడుతుంది.
నోమురా ఫైనాన్షియల్ అడ్వైజరీ మరియు జెఎం ఫైనాన్షియల్ ఆర్థిక సలహాదారులుగా వ్యవహరించారు మరియు ఖైతాన్ & కో ట్రాన్సాక్షన్‌కి చట్టపరమైన సలహాదారుగా పనిచేశారు.
టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ గురించి పూర్తి వివరాలు:
టివిఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది ఆర్‌బిఐ వద్ద రిజిస్టర్ చేయబడిన ఒక ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. భారతదేశ వ్యాప్తంగా 40,000 టచ్ పాయింట్లతో, భారతీయులు పెద్ద కలలు కనడానికి మరియు వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి సాధికారత కల్పించడం కంపెనీ లక్ష్యంగా కలిగి ఉంది. టివిఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్ యొక్క ప్రథమ ఫైనాన్షియర్‌గా మరియు ప్రముఖ ట్రాక్టర్ ఫైనాన్షియర్లలో ఒకరిగా ఉన్న టివిఎస్ క్రెడిట్ యూజ్డ్ కార్ లోన్లు, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు, యూజ్డ్ కమర్షియల్ వాహనం విభాగాలలో వేగంగా అభివృద్ధి చెందుతుంది
లోన్లు, మరియు అన్‍సెక్యూర్డ్ లోన్ల విభాగం. నవ తరం సాంకేతికలు మరియు డేటా విశ్లేషణల సహాయంతో, కంపెనీ దాని 19,000+ ఉద్యోగుల సహాయంతో 1 కోట్లకు పైగా సంతోషకరమైన కస్టమర్లకు సేవలు అందించింది.
ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ గురించి:
ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ (పిఐ) ప్రాథమికంగా అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఫిలాంత్రాపిక్ కార్యక్రమాలకు మద్దతు ఇస్తుంది, ఇది సమాజంలో తక్కువ మరియు వెనుకబడిన జీవితాలను మెరుగుపరచడానికి సహాయపడటానికి ప్రయత్నించే ఒక లాభాపేక్షలేని సంస్థ. పిఐ భారతదేశం మరియు విదేశాలలో పెట్టుబడి పెడుతుంది. పిఐ చార్టర్ ఏమిటంటే అభివృద్ధి చెందుతున్న మరియు సరికొత్త టెక్నాలజీలకు మద్దతు ఇవ్వడం మరియు దేశంలో వ్యవస్థాపకత స్ఫూర్తిని పెంపొందించడం. ఉత్పాదకతను మెరుగుపరచడంలో సాంకేతిక పరివర్తన పాత్రను ఇది బలంగా విశ్వసిస్తుంది, ఇది సామాజిక ఉద్ధరణను ప్రభావితం చేస్తుంది. పిఐ పెట్టుబడి పెట్టే ప్రధాన ప్రాంతాలు ఆర్థిక సేవలు, సాంకేతికత, వినియోగదారు మరియు ఆరోగ్య సంరక్షణ.
ఏవైనా మరిన్ని ప్రశ్నల కోసం, దయచేసి మా కార్పొరేట్ కమ్యూనికేషన్స్ బృందానికి corporatecomms@tvscredit.com వద్ద వ్రాయండి
రుచిక రానా
సీనియర్ మేనేజర్, బ్రాండింగ్ & కమ్యూనికేషన్
మొబైల్: +91 9910036860
ఇమెయిల్: ruchika.rana@tvscredit.com
వెబ్‌సైట్: https://www.tvscredit.com/
సైన్‍అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు