hamburger icon
products image

పత్రికా ప్రకటనలు

ప్రత్యేకమైన సమాచారాలు మరియు ముఖ్యాంశాలను కనుగొనండి

టీవీఎస్ క్రెడిట్ హెచ్1 ఎఫ్‌వై24కి 14% ఆస్తి విలువలో వృద్ధితో పన్ను తర్వాత ₹252 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది

ప్రచురణ: టీవీఎస్ క్రెడిట్ తేదీ: 28 | అక్టోబర్ | 2023

చెన్నై, 28 అక్టోబర్, 2023: భారతదేశంలోని ప్రముఖ ఎన్‌బిఎఫ్‌సిలలో ఒకటైన టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్, 30 సెప్టెంబర్, 2023 నాటికి ముగిసిన త్రైమాసిక మరియు అర్ధ-సంవత్సరానికి దాని ఆడిట్ చేయబడని ఆర్థిక ఫలితాలను ప్రచురించింది, ఇది కంపెనీ యొక్క బలమైన వృద్ధి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని తెలియజేస్తుంది.

హెచ్1 ఎఫ్‌వై24 కోసం ఎన్‌బిఎఫ్‌సి ₹252 కోట్ల పన్ను తర్వాత నికర లాభాన్ని నమోదు చేసింది. కంపెనీ ఎయుఎం అనేది మార్చి'23 నాటి ₹20,602 కోట్లతో పోలిస్తే, సెప్టెంబర్'23 నాటికి 14% పెరిగి ₹23,516 కోట్లకు చేరింది. క్యు2 ఎఫ్‌వై24 ముగింపులో కంపెనీ ₹134 కోట్ల పన్ను తర్వాత త్రైమాసిక నికర లాభాన్ని నివేదించింది.

క్యు2 ఎఫ్‌వై24 ఫలితాల సారాంశం:

• ఈ త్రైమాసికంలో మొత్తం ఆదాయం ₹1,399 కోట్లు, ఇది ఆర్థిక సంవత్సరం క్యు2 ఎఫ్‌వై23తో పోలిస్తే 46% పెరిగింది
• ఈ త్రైమాసికంలో పన్ను తర్వాత నికర లాభం ₹134 కోట్లు, ఇది క్యు2 ఎఫ్‌వై23లో ₹96 కోట్లతో పోలిస్తే 40% వృద్ధి చెందింది

24 మొదటి అర్ధ భాగంలో ప్రభుత్వ వినియోగం, మౌలిక సదుపాయాల కల్పనపై పెరిగిన వ్యయం కారణంగా రుణాల డిమాండ్ బలంగా ఉంది. హెచ్1 ఎఫ్‌వై24 సమయంలో, టీవీఎస్ క్రెడిట్ బిజినెస్ గణనీయమైన వృద్ధిని సాధించింది, ఇది కన్స్యూమర్ లోన్ల బలమైన పనితీరుతో హెచ్1 ఎఫ్‌వై23తో పోలిస్తే 59% బుక్ వృద్ధిని సాధించింది. ఈ కంపెనీ హెచ్1 ఎఫ్‌వై24 సమయంలో కంపెనీ 20 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది, దీని ఫలితంగా మొత్తం కస్టమర్ బేస్ 1.2 కోట్లను మించిపోయింది. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చొరవలో భాగంగా టీవీఎస్ క్రెడిట్ అన్ని అప్లికేషన్‌లను క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లోకి మార్చింది, ఇది కార్యాచరణ సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరుస్తుంది.

పండుగ సీజన్ సమీపిస్తున్నందున టీవీఎస్ క్రెడిట్ ప్రత్యేక ప్రోడక్ స్కీమ్‌లను, వినియోగదారుల ఆకాంక్షలను నెరవేర్చడంలో సహాయపడే ఉత్తేజకరమైన వినియోగదారుల ప్రమోషన్లను ఆవిష్కరించనుంది.

టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ గురించి పూర్తి వివరాలు:
టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో ఒకటి, ఇది ఆర్‌బిఐలో నమోదు చేయబడింది. భారతదేశ వ్యాప్తంగా 40,000 టచ్ పాయింట్లతో, భారతీయులు పెద్ద కలలు కనేలా మరియు వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్‌కు ప్రథమ ఆర్థికవేత్తగా మరియు ప్రముఖ ట్రాక్టర్ ఫైనాన్షియర్లలో ఒకరిగా టీవీఎస్ క్రెడిట్ యూజ్డ్ కార్ లోన్లు, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు, యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్లు మరియు అన్‍సెక్యూర్డ్ లోన్ల విభాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రికార్డును కలిగి ఉంది. సమర్థవంతమైన కొత్త-తరం టెక్నాలజీలు మరియు డేటా అనలిటిక్స్ ద్వారా నడిచే ఈ సంస్థ, 1.2 కోటికి పైగా సంతోషకరమైన కస్టమర్లకు సేవలు అందించింది.

మీడియా కాంటాక్టులు: టీవీఎస్ క్రెడిట్

రుచిక రానా
సీనియర్ మేనేజర్, బ్రాండింగ్ & కమ్యూనికేషన్
మొబైల్: +91 9910036860
ఇమెయిల్: ruchika.rana@tvscredit.com
వెబ్‌సైట్: https://www.tvscredit.com/


  • వీటిలో షేర్ చేయండి:‌

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి