టివిఎస్ క్రెడిట్ వద్ద మేము మెరిట్-ఆధారిత ఫార్మల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను అనుసరిస్తాము. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ సమయంలో మేము ఎప్పుడూ దరఖాస్తుదారుల నుండి ఎటువంటి ఫీజు లేదా డిపాజిట్‌ను డిమాండ్ చేయము. మోసపూరిత ఇమెయిల్‌లు/ఆఫర్లను పంపడానికి TVS క్రెడిట్ డొమైన్ ఐడిని స్పూఫింగ్ చేసే మోసగాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండండి. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

hamburger icon
products image

పత్రికా ప్రకటనలు

ప్రత్యేకమైన సమాచారాలు మరియు ముఖ్యాంశాలను కనుగొనండి

టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ గత సంవత్సరం క్యు1 తో పోలిస్తే ఎయుఎంలో 42% బలమైన వృద్ధిని నమోదు చేసింది మరియు 10 లక్షల కొత్త కస్టమర్లను జోడించింది

ప్రచురణ: టీవీఎస్ క్రెడిట్ తేదీ: 24 | జూలై | 2023

చెన్నై, 24 జూలై, 2023: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎన్‌బిఎఫ్‌సిలలో టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ కూడా ఒకటి, 30 జూన్, 2023తో ముగిసే క్యూ1 ఎఫ్‌వై24 కోసం దాని ఆడిట్ చేయని ఆర్థిక ఫలితాలను ప్రచురించింది.

30 జూన్, 2023 నాటికి కంపెనీ యాజమాన్యంలోని ఆస్తుల విలువ (ఎయుఎం) ₹21,924 కోట్లకు చేరింది, జూన్'22తో పోలిస్తే దాని విలువ ₹6,528 కోట్లు ఎక్కువ. ఇది Q1ఎఫ్‌వై23తో పోలిస్తే, ఇది 42% గణనీయమైన వృద్ధిని చూసింది. కంపెనీ మొత్తం ఆదాయం సంవత్సరానికి 56% పెరిగింది మరియు Q1 ఎఫ్‌వై24 కోసం ₹1,353 కోట్లకు చేరింది. పన్ను తర్వాత నికర లాభం కూడా సంవత్సరానికి 41% వృద్ధిని నమోదు చేసింది మరియు Q1 ఎఫ్‌వై24లో ₹117 కోట్లకు చేరింది.

క్యు1 ఎఫ్‌వై24లో కంపెనీ, దాని ప్రోడక్ట్ పోర్ట్‌పోలియోలో వాహనాలపై మరియు వినియోగదారుల నుంచి రుణాలను స్వీకరించడం లాంటి కార్యకలాపాల్లో గణనీయమైన వృద్ధిని చవిచూసింది. ఈ వ్యవధిలో టీవీఎస్ క్రెడిట్ దాదాపు 10 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది, ఈ రోజు వరకు దాని మొత్తం కస్టమర్ బేస్ 1.1 కోట్లకు పైగా పెరిగింది. అదనంగా, కంపెనీ దేశంలోని ఉత్తర మరియు ఈశాన్య ప్రాంతాల్లో దీనిని ప్రవేశపెట్టడం ద్వారా వినియోగదారు రుణాల వ్యాపారాన్ని విస్తరించింది. ఈ త్రైమాసికంలో ఇది డిజిటల్ పర్సనల్ లోన్లను కూడా ప్రవేశపెట్టింది, ఇది దాని డిజిటల్ ఆఫర్లను మరింత బలోపేతం చేసింది.

టెక్నాలజీ మరియు డేటా విశ్లేషణల సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా సాటిలేని కస్టమర్ అనుభవాన్ని అందించేందుకు టీవీఎస్ క్రెడిట్ కట్టుబడి ఉంటుంది.

టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ గురించి పూర్తి వివరాలు:
టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో ఒకటి1, ఇది ఆర్‌బిఐలో నమోదు చేయబడింది. భారతదేశ వ్యాప్తంగా 40,000 టచ్ పాయింట్లతో భారతీయులు పెద్దగా కలలు కనేలా చేయడం మరియు వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి సాధికారత కల్పించడమే ఈ కంపెనీ ప్రధాన లక్ష్యం. టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్‌కు ప్రథమ ఆర్థికవేత్తగా మరియు ప్రముఖ ట్రాక్టర్ ఫైనాన్షియర్లలో ఒకరిగా నిలిచిన, టీవీఎస్ క్రెడిట్, యూజ్డ్ కార్ లోన్లు, కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లు, యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్లు మరియు అన్‍సెక్యూర్డ్ లోన్ల విభాగంలో వేగంగా దూసుకెళ్తోంది. బలమైన కొత్త-తరం టెక్నాలజీలు మరియు డేటా విశ్లేషణల ద్వారా నడిచే ఈ సంస్థ 1.1 కోటి మందికి పైగా సంతోషకరమైన కస్టమర్లకు సేవలు అందించింది.

మీడియా కాంటాక్టులు: టీవీఎస్ క్రెడిట్

రుచిక రానా
సీనియర్ మేనేజర్, బ్రాండింగ్ & కమ్యూనికేషన్
మొబైల్: +91 9910036860
ఇమెయిల్: ruchika.rana@tvscredit.com
వెబ్‌సైట్: https://www.tvscredit.com/


  • వీటిలో షేర్ చేయండి:‌

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి