టివిఎస్ క్రెడిట్ వద్ద మేము మెరిట్-ఆధారిత ఫార్మల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను అనుసరిస్తాము. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ సమయంలో మేము ఎప్పుడూ దరఖాస్తుదారుల నుండి ఎటువంటి ఫీజు లేదా డిపాజిట్‌ను డిమాండ్ చేయము. మోసపూరిత ఇమెయిల్‌లు/ఆఫర్లను పంపడానికి TVS క్రెడిట్ డొమైన్ ఐడిని స్పూఫింగ్ చేసే మోసగాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండండి. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Hamburger Menu Icon
products image

పత్రికా ప్రకటనలు

ప్రత్యేకమైన సమాచారాలు మరియు ముఖ్యాంశాలను కనుగొనండి

డిసెంబర్'23 నాటికి టీవీఎస్ క్రెడిట్ యొక్క నిర్వహణలో ఉన్న ఆస్తులు క్రితం సంవత్సరంతో పోలిస్తే 30% పెరిగి ₹25,315 కోట్లకు చేరింది మరియు డిసెంబర్'23 నాటికి ముగిసిన తొమ్మిది నెలల కాలంలో నికర లాభం 53% పెరిగి ₹424 కోట్లకు చేరింది

ప్రచురణ: టీవీఎస్ క్రెడిట్ తేదీ: 24 | జనవరి | 2024

బెంగళూరు, జనవరి 24, 2024: భారతదేశం యొక్క ప్రముఖ ఎన్‌బిఎఫ్‌సిలలో ఒకటైన టివిఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ డిసెంబర్ 31, 2023 నాటికి ముగిసిన త్రైమాసికం మరియు తొమ్మిది నెలల కాలం కోసం దాని ఆడిట్ చేయబడని ఆర్థిక ఫలితాలను ప్రచురించింది.

డిసెంబర్ 31, 2023 నాటికి ముగిసిన తొమ్మిది నెలలకు ₹424 కోట్ల పన్ను తర్వాత నికర లాభాన్ని ఎన్‌బిఎఫ్‌సి నివేదించింది. డిసెంబర్ 22 తో పోలిస్తే కంపెనీ ఎయుఎం డిసెంబర్ 23 నాటికి 30% వై-ఓ-వై వృద్ధిని రిజిస్టర్ చేసింది.

హైలైట్స్:

1. డిసెంబర్ 22 నాటికి ఉన్న ₹19,541 కోట్లతో పోలిస్తే డిసెంబర్ 23 నాటికి ఎయుఎం ₹25,315 కోట్లకు చేరుకుంది
2. డిసెంబర్ 23 ముగిసిన నాటికి తొమ్మిది నెలలకు మొత్తం ఆదాయం ₹4,276 కోట్లు, మునుపటి సంవత్సరంలో సంబంధిత వ్యవధితో పోలిస్తే 47% పెరుగుదల
3. డిసెంబర్ 23 ముగిసిన తొమ్మిది నెలల కోసం పన్ను తర్వాత నికర లాభం గత సంవత్సరంలో సంబంధిత వ్యవధి కోసం ₹278 కోట్లతో పోలిస్తే ₹424 కోట్లుగా ఉంది

క్యు3 ఎఫ్‌వై24లో, పండుగ సమయం, వినియోగంలో పెరుగుదల మరియు ఆకర్షణీయమైన వినియోగదారు ఆఫర్ల కారణంగా క్రెడిట్ డిమాండ్ బలంగా ఉంది. క్యు3 ఎఫ్‌వై24 సమయంలో, టివిఎస్ క్రెడిట్ గణనీయమైన వృద్ధిని చూసింది, ముఖ్యంగా వినియోగదారు లోన్లు మరియు రిటైల్ లోన్ల విభాగంలో. అదనంగా, డిసెంబర్ 23 నాటికి ముగిసిన త్రైమాసికంలో కంపెనీ దాదాపుగా 14 లక్షల కొత్త కస్టమర్లను కూడా జోడించింది, మొత్తం కస్టమర్ బేస్ 1.3 కోట్లను దాటిపోయింది.

కస్టమర్ అనుభవం మరియు కార్యనిర్వాహక సామర్థ్యాన్ని నిరంతరం మెరుగుపరచడానికి డిజిటల్ మార్పు పట్ల టివిఎస్ క్రెడిట్ తన నిబద్ధతను ధృడంగా కొనసాగిస్తుంది.

టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ గురించిన పూర్తి వివరాలు:

టివిఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది ఆర్‌బిఐ వద్ద రిజిస్టర్ చేయబడిన భారతదేశం యొక్క ప్రముఖ మరియు వైవిధ్యమైన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలో ఒకటి. భారతదేశ వ్యాప్తంగా 40,000 టచ్ పాయింట్లతో, భారతీయులను పెద్దగా కలలు కనడానికి మరియు వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి సాధికారత కల్పించడం కంపెనీ లక్ష్యంగా కలిగి ఉంది. టివిఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్‌కు అతి పెద్ద ఫైనాన్షియర్‌గా మరియు ప్రముఖ ట్రాక్టర్ ఫైనాన్షియర్లలో ఒకరిగా నిలిచిన టివిఎస్ క్రెడిట్ యూజ్డ్ కార్ లోన్లు, కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లు, యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్లు మరియు అన్‍సెక్యూర్డ్ లోన్ల విభాగంలో వేగంగా దూసుకెళ్తోంది. బలమైన అధునాతన సాంకేతికతల మరియు డేటా విశ్లేషణల సహాయంతో కంపెనీ 1.3 కోట్ల కంటే ఎక్కువ సంతోషకరమైన కస్టమర్లకు సేవలు అందించింది.

మీడియా కాంటాక్టులు: టీవీఎస్ క్రెడిట్

రుచిక రానా
సీనియర్ మేనేజర్, బ్రాండింగ్ & కమ్యూనికేషన్
మొబైల్: +91 9910036860
ఇమెయిల్: ruchika.rana@tvscredit.com
వెబ్‌సైట్: https://www.tvscredit.com/


  • వీటిలో షేర్ చేయండి:‌
  • Share it on Facebook
  • Share it on Twitter
  • Share it on Linkedin

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి