hamburger icon
products image

పత్రికా ప్రకటనలు

ప్రత్యేకమైన సమాచారాలు మరియు ముఖ్యాంశాలను కనుగొనండి

టీవీఎస్ క్రెడిట్ యొక్క ఇ.పి.ఐ.సి క్యాంపస్ ఛాలెంజ్ 96,000 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు మరియు అగ్రశ్రేణి కాలేజీల భాగస్వామ్యంతో కొత్త రికార్డులను నెలకొల్పింది

ప్రచురణ: టీవీఎస్ క్రెడిట్ తేదీ: 31 | అక్టోబర్ | 2023

చెన్నై, 31 అక్టోబర్, 2023: టీవీఎస్ క్రెడిట్ ప్రధాన యజమాని బ్రాండింగ్ చొరవ ఇ.పి.ఐ.సి క్యాంపస్ ఛాలెంజ్ అగ్రశ్రేణి ప్రతిభావంతులను ఆకర్షించడం మరియు పటిష్టమైన ప్రతిభావంతుల బృందాన్ని ఏర్పాటు చేయడంలో ప్రసిద్ధి చెందింది. ఇటీవల ముగిసిన అయిదో సీజన్ అసాధారణమైన మైలురాయిని సాధించింది, 96,000 పైగా రిజిస్ట్రేషన్లను దాటింది, ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 100% పైగా వృద్ధిని సూచిస్తుంది. ఐఐఎం అహ్మదాబాద్, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ జంషెడ్ పూర్, జెబిఐఎంఎస్ ముంబై, ఐఐఎఫ్‌టి ఢిల్లీ, ఎస్‌వికెఎం వారి ఎన్ఎంఐఎం యూనివర్సిటీ ముంబై, ఐఐటి ఖరగ్‌పూర్ లాంటి ప్రముఖ సంస్థల హాజరుతో ఈ కార్యక్రమం మరింత విజయవంతం అయింది.

ఇ.పి.ఐ.సి క్యాంపస్ ఛాలెంజ్ సీజన్ 5 కొత్త రికార్డులను నెలకొల్పడమే కాకుండా, దాని కార్యక్రమంలో అనేక ఉత్తేజకరమైన అంశాలను పరిచయం చేసింది. ఈ సీజన్లో టీవీఎస్ క్రెడిట్ 4,200 పైగా కళాశాలలతో సహకరించింది, అలాగే, సోషల్ మీడియా ద్వారా 5,00,000 మందికి పైగా చేరుకోగలిగారు. అంతేకాకుండా ఐటి, స్ట్రాటజీ, ఫైనాన్స్ మరియు అనలిటిక్స్ ఛాలెంజెస్ ద్వారా తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఈ పోటీలో పాల్గొనే వారికి ఒక ప్రత్యేకమైన వేదికను అందించింది. ఎంసిక్యు టెస్టులు, ఆన్‌లైన్ హ్యాకథాన్లు, కేస్ స్టడీ సబ్మిషన్లు, టీవీఎస్ క్రెడిట్ లీడర్ల మాస్టర్‌ క్లాస్ సెషన్లతో కూడిన బహుళ రౌండ్లలో ఈ పోటీ జరిగింది మరియు గ్రాండ్ ఫైనల్‌లో ఎంపికైన జట్లు ప్రముఖ జ్యూరీ ప్యానెల్‌కు వినూత్నమైన పరిష్కారాలను సమర్పించాయి. ఈ సంవత్సరం ఇ.పి.ఐ.సి ఉపాధి అవకాశాలతో పాటు ₹10 లక్షల వరకు బహుమతులను అందించింది.

టీవీఎస్ క్రెడిట్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ చరణ్ దీప్ సింగ్ మాట్లాడుతూ, "ఇ.పి.ఐ.సి క్యాంపస్ ఛాలెంజ్ నిజంగా అగ్రశ్రేణి ప్రతిభావంతులను ఆకర్షించే శక్తివంతమైన వేదికగా అవతరించింది. ఇ.పి.ఐ.సి అనేది అభివృద్ధి మనస్తత్వం మరియు ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇచ్చే మా సంస్థ సమగ్ర నీతితో సమలేఖనం చేయబడింది. ఈ సంవత్సరం మేము ఈ చొరవ కోసం బ్రాండింగ్ మరియు కమ్యూనికేషన్‌లో మార్పును తీసుకువచ్చాము, హాజరు శాతంలో పెరుగుదలను చూడటం మాకు చాలా ఆనందంగా ఉంది." అని తెలిపారు.”

ఒక ప్రకటనలో గత సీజన్ నుండి ఒక ఫైనలిస్ట్ మాట్లాడుతూ, "ఇ.పి.ఐ.సి అనలిటిక్స్ ఛాలెంజ్ నాకు సిద్ధాంతపరమైన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే అవకాశాన్ని కల్పించింది. ఇది విశ్లేషణాత్మక భావనలు, పద్ధతులను వాస్తవ ప్రపంచ సమస్యలలో ఎలా అమలు చేయవచ్చనే దానిపై నా అభిప్రాయాలను మెరుగుపరిచింది. టీవీఎస్ క్రెడిట్ ఇ.పి.ఐ.సి ఛాలెంజ్‌లో పాల్గొనడం వల్ల నా నైపుణ్యాలు మెరుగుపడటమే కాకుండా, టీవీఎస్ క్రెడిట్‌లో ఉద్యోగం పొందడానికి కూడా నాకు సహాయపడింది" అని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.”

సీజన్ 5లో అసాధారణ విజయాన్ని సాధించి, రాబోయే సీజన్‌లలో ప్రతిభను వృద్ధి చేయడానికి ఇ. పి. ఐ. సి క్యాంపస్ ఛాలెంజ్ బృందం కట్టుబడి ఉంది.

టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ గురించిన పూర్తి వివరాలు:

టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో ఒకటి, ఇది ఆర్‌బిఐలో నమోదు చేయబడింది. భారతదేశ వ్యాప్తంగా 40,000 టచ్ పాయింట్లతో, భారతీయులు పెద్ద కలలు కనేలా మరియు వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్‌కు ప్రథమ ఆర్థికవేత్తగా మరియు ప్రముఖ ట్రాక్టర్ ఫైనాన్షియర్లలో ఒకరిగా టీవీఎస్ క్రెడిట్ యూజ్డ్ కార్ లోన్లు, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు, యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్లు మరియు అన్‍సెక్యూర్డ్ లోన్ల విభాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రికార్డును కలిగి ఉంది. సమర్థవంతమైన కొత్త-తరం టెక్నాలజీలు మరియు డేటా అనలిటిక్స్ ద్వారా నడిచే ఈ సంస్థ, 1.2 కోటికి పైగా సంతోషకరమైన కస్టమర్లకు సేవలు అందించింది.

మీడియా కాంటాక్టులు: టీవీఎస్ క్రెడిట్

రుచిక రానా
సీనియర్ మేనేజర్, బ్రాండింగ్ & కమ్యూనికేషన్
మొబైల్: +91 9910036860
ఇమెయిల్: ruchika.rana@tvscredit.com
వెబ్‌సైట్: https://www.tvscredit.com/


  • వీటిలో షేర్ చేయండి:‌

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి