ఉత్తర్ ప్రదేశ్, 17 జూలై, 2023: ప్రముఖ ఆర్థిక సేవా ప్రదాతలలో ఒకటైన టీవీఎస్ క్రెడిట్, 6 జూలై నుండి 9 జూలై వరకు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం, సీతాపూర్‌లోని ఆర్ఎంపి మైదానంలో నిర్వహించిన "ప్రగతి పర్వ్" రుణ మేళాను విజయవంతంగా ముగించింది.
సీతాపూర్‌లోని ప్రజలకు వారి ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సహాయపడటమే కాకుండా, వారి అవసరాలకు ప్రత్యేక పరిష్కారాలను అందించడమే ఈ రుణ మేళా లక్ష్యం. త్వరిత లోన్ అప్రూవల్స్, సులభమైన దరఖాస్తు ప్రక్రియతో ఈ కంపెనీ, మొబైల్ మరియు కన్జ్యూమర్ డ్యూరబుల్, టూ వీలర్, ట్రాక్టర్ కొనుగోళ్ల కోసం గరిష్ఠ రుణ మొత్తాలను మంజూరు చేసింది.
ఈ కార్యక్రమానికి సమీపంలోని పట్టణాలు, గ్రామాల నుండి 1000 మందికి పైగా హాజరైన వారు ఇంటరాక్టివ్ సెషన్లు, సమాచార చర్చలు మరియు వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ ఈవెంట్ గురించి టీవీఎస్ క్రెడిట్ సిఎంఒ, శ్రీ చరణ్‌దీప్ సింగ్ మాట్లాడుతూ, "ప్రగతి పర్వ్‌కు లభించిన అద్భుతమైన స్పందన పట్ల మేము సంతోషిస్తున్నాము.. ఈ కార్యక్రమం బలమైన సంబంధాలను పెంపొందించడానికి ఒక వేదికగా ఉపయోగపడింది, విభిన్న కస్టమర్ అవసరాలను సమర్థవంతంగా తీర్చగల అనుకూలీకరించిన ఆర్థిక పరిష్కారాలను అందించడంలో మా నిబద్ధతను నొక్కి చెప్పింది" అని పేర్కొన్నారు.”
ఈ ఈవెంట్‌లో బుధ్రమ్ ఆటో, కిసాన్ అగ్రో మార్ట్, సూర్యవంశ్ & సన్స్, శ్రీ శ్యామ్ ట్రాక్టర్స్, పంజాబ్ ట్రాక్టర్స్, కిసాన్ ట్రాక్టర్స్, అవధ్ ఎలక్ట్రానిక్స్, ఆర్.కె. ట్రేడింగ్, అల్ అహద్ మొబైల్ పాయింట్ లతో సహా కంపెనీ డీలర్ భాగస్వాములందరూ చురుగ్గా పాల్గొన్నారు.
ప్రగతి పర్వ్‌లో మాట్లాడుతూ ఒక భాగస్వామి "టీవీఎస్ క్రెడిట్, రుణాలతో పాటు వారి ఆకర్షణీయమైన స్కీమ్‌లు, సులువైన ఫైనాన్సింగ్ ఎంపికలు వినియోగదారులకు వారి ఆకాంక్షలను సాధించడంలో సహాయపడ్డాయి. దీని ఫలితంగా నా వ్యాపారం గణనీయంగా పెరిగింది" అని వారి అభిప్రాయాన్ని పంచుకున్నారు
పెరుగుతున్న భారత ప్రజల డిమాండ్లను తీర్చడానికి ఈ సంస్థ విస్తృత శ్రేణి ఆర్థిక ప్రోడక్టులను అందిస్తుంది. ఇందులో టూ వీలర్ లోన్లు, ట్రాక్టర్ లోన్లు, ఆన్‌లైన్ పర్సనల్ లోన్లు, యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్లు, మొబైల్ లోన్లు, వినియోగదారుల లోన్లు, ఇన్‌స్టాకార్డు, త్రీ-వీలర్ లోన్లు మరియు యూజ్డ్ కార్ లోన్లు ఉన్నాయి.
అనుబంధాలు:
లోన్ మేళా "ప్రగతి పర్వ్" నుండి ఫోటోలు
రుచిక రానా
సీనియర్ మేనేజర్, బ్రాండింగ్ & కమ్యూనికేషన్
మొబైల్: +91 9910036860
ఇమెయిల్: ruchika.rana@tvscredit.com
వెబ్‌సైట్: https://www.tvscredit.com
సైన్‍అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు