hamburger icon
<?$policy_img['alt']?>

ప్రైవసీ పాలసీ

1.పరిచయం

చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ 5/03/2024.

ఈ డాక్యుమెంట్ అంతటా, "మేము", "మనం", "మా", "మా యొక్క", "టీవీఎస్‌సిఎస్" మరియు "టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్" అనే పదాలు టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్‌ను సూచిస్తాయి. మరియు "మీరు", "మీ" మరియు "మీ యొక్క" అనే పదాలు మిమ్మల్ని (మేము సూచిస్తున్న వ్యక్తిగత డేటా ఉన్న వ్యక్తి) సూచిస్తాయి.

మీ గోప్యత మాకు అత్యంత ముఖ్యమైనది. మా వద్ద మీ గోప్యతను కాపాడటానికి మరియు మీ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఈ గోప్యతా విధానం మేము సేకరించే మరియు ప్రాసెస్ చేసే వ్యక్తిగత డేటా యొక్క వివరాలను, మేము దానిని ఎలా నిర్వహిస్తాము మరియు మేము దానిని ఉపయోగించే ఉద్దేశాలను వివరిస్తుంది. మీ వ్యక్తిగత డేటాకు సంబంధించిన మా పద్ధతులను అర్థం చేసుకోవడానికి దయచేసి ఈ క్రింది వాటిని జాగ్రత్తగా చదవండి. వ్యక్తిగత డేటా అంటే ఒక వ్యక్తిని గుర్తించడానికి ఉపయోగించబడే లేదా దానికి సంబంధం ఉన్న డేటా.

2. మేము ఏ వ్యక్తిగత డేటాను సేకరిస్తాము, స్టోర్ చేస్తాము మరియు ప్రాసెస్ చేస్తాము?

మేము సేకరించే, స్టోర్ చేసే మరియు ప్రాసెస్ చేసే వ్యక్తిగత డేటా యొక్క కేటగిరీలు:

  • డెమోగ్రాఫిక్, గుర్తింపు మరియు సంప్రదింపు డేటా (ఉదాహరణకి పేరు, చివరి పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ చిరునామా, తండ్రి పేరు, తల్లి పేరు, చిరునామా రుజువు, సంప్రదింపు నంబర్, భాష, వృత్తి, రాష్ట్రం, పిన్ కోడ్‌తో భౌతిక చిరునామా, వయస్సు, జాతీయత, జీవిత భాగస్వామి పేరు, వైవాహిక స్థితి, లింగం, మతం, కులం)
  • ప్రామాణీకరణ డేటా (ఉదాహరణకి సంతకం రుజువు)
  • వ్యక్తిగత గుర్తింపు డాక్యుమెంట్లు (ఉదా., PAN కార్డ్, ఓటర్ ID, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్, GSTIN, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్ మొదలైనవి)
  • ఫైనాన్షియల్ అకౌంట్ వివరాలు (ఉదాహరణకి బ్యాంక్ అకౌంట్ నంబర్, బ్యాంక్ ఐఎఫ్‌ఎస్‌సి కోడ్, బ్యాంక్ స్టేట్‌మెంట్ మరియు లోన్ అగ్రిమెంట్ నంబర్, క్రెడిట్ బ్యూరోల నుండి అందుకున్న డేటా, ఆదాయం, ఆదాయం రుజువు (జీతం స్లిప్ లేదా ఫారం 16 లేదా ఆదాయం లెక్కింపు ఉన్నఐటిఆర్తో సహా)
  • విద్యా మరియు వృత్తిపరమైన డేటా (ఉదాహరణకి యజమాని డేటా, రెజ్యుమ్, ప్రాథమిక అర్హత, విద్యా అర్హత, అనుభవం)
  • టీవీఎస్‌సిఎస్ ఉద్యోగి ఆరోగ్య డేటా (ఉదాహరణకి వైద్య నివేదికలు, బ్లడ్ గ్రూప్, ఎత్తు, బరువు)
  • ఆన్‌లైన్ గుర్తింపుదారులు మరియు ఇతర సాంకేతిక డేటా (ఉదాహరణకి IP చిరునామా, బ్రౌజర్ రకం, డివైస్ ఐడెంటిఫయర్లు, యాక్సెస్ సమయం)
  • డివైస్ సమాచారం (ఉదాహరణకి మీ స్టోరేజ్, హార్డ్‌వేర్ మోడల్, ఆపరేటింగ్ సిస్టమ్ మరియు వెర్షన్, యూనిక్ డివైస్ ఐడెంటిఫైయర్, మొబైల్ నెట్‌వర్క్ సమాచారం మరియు మా సేవలతో డివైస్ యొక్క ఇంటరాక్షన్ గురించిన సమాచారం)
  • మా మొబైల్ అప్లికేషన్ పై అనుమతుల ద్వారా సేకరించబడిన వ్యక్తిగత డేటా (ఉదాహరణకి కెమెరా, కాంటాక్ట్స్, లొకేషన్ డేటా, స్టోరేజ్, ఫోటోలు, SMS)
  • ఆస్తి సంబంధిత డేటా (ఉదాహరణకి VIN, ఇంజిన్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, మోడల్ రకం, ఛాసిస్ నంబర్, మోడల్ కోడ్, మోడల్ పేరు, ఏదైనా చర లేదా స్థిర ఆస్తికి సంబంధించిన వివరాలు)
  • కమ్యూనికేషన్స్ వివరాలు (ఉదాహరణకి మొబైల్ నంబర్, ఇమెయిల్స్, కాంటాక్ట్ లిస్ట్స్)
  • జనరేట్ చేయబడిన డేటా (ఉదాహరణకి లాగ్స్, ట్రాన్సాక్షన్ రికార్డులు)
  • కొంత వ్యక్తిగత డేటాను కలిగి ఉండగల టెస్టిమోనియల్స్. (ఉదాహరణకి పూర్తి పేరు, నగరం)

3. మేము మీ వ్యక్తిగత డేటాను ఎలా మరియు ఎక్కడ నుండి సేకరిస్తాము?

మేము ఈ క్రింది మార్గాల్లో మీ వ్యక్తిగత డేటాను సేకరిస్తాము:

  • మీరు మా వెబ్‌సైట్ లేదా సోషల్ మీడియా పేజీలను సందర్శించినప్పుడు (ఫేస్‌బుక్, లింక్డ్ఇన్, ఇన్‌స్టాగ్రామ్ వంటివి) మరియు రిజిస్ట్రేషన్ ఫారం నింపినప్పుడు మరియు "మమ్మల్ని సంప్రదించండి" సదుపాయాన్ని ఉపయోగించినప్పుడు.
  • మీరు మా మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించినప్పుడు.
  • మీరు మా వెబ్‌సైట్‌ల ద్వారా మాతో ఇంటరాక్ట్ అయినప్పుడు లేదా కస్టమర్ సపోర్ట్‌తో సహా మా వెబ్‌సైట్‌లలో సేవలను ఉపయోగించినప్పుడు.
  • మీరు మా వాట్సాప్ అకౌంట్ ద్వారా మాతో ఇంటరాక్ట్ అయినప్పుడు.
  • మీరు మా సోర్సింగ్ భాగస్వాములతో ఇంటరాక్ట్ అయినప్పుడు మరియు మా ప్రోడక్టులపై ఆసక్తిని వ్యక్తం చేసినప్పుడు.
  • మార్కెటింగ్ రోడ్‌షోల సమయంలో మీరు మాకు డేటాను అందించినప్పుడు.
  • ఒక రిఫరల్ ద్వారా మీ డేటా మాకు అందించబడినప్పుడు.
  • మీరు మా కెరీర్స్ పేజీ ద్వారా టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్‌లో ఉద్యోగం కోసం అప్లై చేసినప్పుడు.
  • థర్డ్ పార్టీల ద్వారా డేటా అందించబడినప్పుడు. (ఉదాహరణకు క్రెడిట్ బ్యూరోల నుండి క్రెడిట్ చరిత్ర)
  • మేము లోన్ సోర్సింగ్ నిర్వహించినప్పుడు.
  • మీరు మా కస్టమర్ సర్వీస్ సంప్రదింపు నంబర్లపై మమ్మల్ని సంప్రదించినప్పుడు.
  • మీరు ఆర్‌బిఐ జారీ చేసిన కెవైసి డైరెక్షన్లలో భాగంగా మీ తాజా కెవైసి డాక్యుమెంట్లను మాకు పంపినప్పుడు.
  • పైన జాబితా చేయబడని ఏదైనా ఇతర డిజిటల్ లేదా ఆఫ్‌లైన్ ఛానెల్ ద్వారా మాతో మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు.
  • జిఎస్‌టిఐఎన్, అకౌంట్ అగ్రిగేటర్లు, రిఫరెన్సులు వంటి వివిధ ఎపిఐ ఇంటిగ్రేషన్ల ద్వారా కూడా మేము డేటాను సేకరిస్తాము.

4. మీ వ్యక్తిగత డేటాను మేము ఎలా ఉపయోగించగలము?

మేము ఈ క్రింది ప్రయోజనాల కోసం మీ వ్యక్తిగత డేటాను ఉపయోగిస్తాము:

  • మీరు ఒక సేల్స్ అవుట్లెట్ వద్ద ఒక ప్రోడక్ట్ కొనుగోలుపై లోన్ లేదా ఇఎంఐ కోసం ఎంచుకున్నప్పుడు మరియు జాబితా చేయబడిన మా డీలర్లకు మీ సమాచారాన్ని అందించినప్పుడు.
  • మీరు ఆన్‌లైన్‌లో లేదా భౌతిక అవుట్‌లెట్‌లో మా సేవలపై ఆసక్తిని వ్యక్తం చేస్తే, మేము మీ వ్యక్తిగత డేటాను సేకరిస్తాము మరియు జాబితా చేయబడిన మా డీలర్లతో పంచుకుంటాము, వారు లోన్ పై మరిన్ని వివరాలను అందించడానికి తిరిగి మిమ్మల్ని సంప్రదిస్తారు.
  • మీరు ప్రస్తుత కస్టమర్ అయితే లేదా మా వెబ్‌సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా లోన్ కోసం అప్లై చేయాలనుకుంటే, మేము ఈ క్రింది ఉద్దేశాల కోసం మీ వ్యక్తిగత డేటాను సేకరిస్తాము:
    • మీరు ఉపయోగించే మా అప్లికేషన్ పై మీ అకౌంట్ లేదా సమాచారాన్ని ప్రామాణీకరించడానికి.
    • మీ లోన్ అప్లికేషన్‌ను సమర్థవంతంగా ప్రాసెస్ చేయడానికి.
    • రిస్క్ అసెస్‌మెంట్ నిర్వహించడానికి, లోన్ అందించడానికి నిర్ణయం తీసుకునే ముందు మోసాన్ని గుర్తించడానికి మరియు నివారించడానికి.
    • సాంకేతిక నోటీసులు, భద్రతా హెచ్చరికలు, మద్దతు మరియు పరిపాలనా సందేశాలతో సహా మీరు అభ్యర్థించిన సమాచారాన్ని మరియు మద్దతును అందించడానికి.
    • ఏవైనా హెచ్చరికలు లేదా అప్‌డేట్ల నోటిఫికేషన్లతో సహా మీరు పొందిన ప్రస్తుత ప్రోడక్టులు మరియు సేవలకు సంబంధించి మీతో కమ్యూనికేట్ చేయడానికి.
    • మా సేవలను మూల్యాంకన చేయడానికి, అభివృద్ధి చేయడానికి మరియు మెరుగుపరచడానికి.
    • మార్కెట్ మరియు ప్రోడక్ట్ విశ్లేషణ మరియు మార్కెట్ పరిశోధన కోసం.
    • మీకు ఆసక్తి కలిగిన మా ఇతర ప్రోడక్టులు లేదా సేవల గురించి మీకు సమాచారం పంపడానికి.
    • అభిప్రాయాన్ని పొందడానికి మరియు విచారణలు మరియు ఫిర్యాదులను నిర్వహించడానికి.
    • చట్టపరమైన లేదా నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఉండడానికి.
    • రీపేమెంట్ రిమైండర్ల కోసం మిమ్మల్ని సంప్రదించడానికి.
    • మీ ఫిర్యాదులను పరిష్కరించేందుకు మిమ్మల్ని సంప్రదించడానికి.
    • మీ ప్రస్తుత లోన్ అకౌంట్లను నిర్వహించడానికి మరియు లోన్ సర్వీసింగ్ పై మిమ్మల్ని అప్‌డేట్ చేయడానికి.
  • మీరు ఒక జాబితా చేయబడిన డీలర్ అయితే, ఆన్‌బోర్డింగ్ మరియు చెల్లింపు ప్రయోజనాల కోసం మేము మీ వ్యక్తిగత డేటాను సేకరిస్తాము.
  • మీరు మా వెబ్‌సైట్ లేదా సోషల్ మీడియా పేజీలను సందర్శించిన వారు అయితే, మీ అనుభవాన్ని ఆప్టిమైజ్ చేయడానికి, కంటెంట్‌ను కస్టమైజ్ చేయడానికి మరియు డిజిటల్ ఫుట్‌ప్రింట్‌ను ట్రాక్ చేయడానికి మేము మీ వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేస్తాము.
  • మీరు ఒక భావి ఉద్యోగి అయితే, మేము ఉపాధి మూల్యాంకన ఉద్దేశం కోసం మీ వ్యక్తిగత డేటాను సేకరిస్తాము.
  • టెలిఫోన్ కాల్స్‌తో సహా మీకు మరియు మాకు మధ్య ఏవైనా కమ్యూనికేషన్లను కూడా మేము రికార్డ్ చేయవచ్చు. గుర్తింపు, పరిశోధన, నియంత్రణ, మోసం నివారణ, శిక్షణ మరియు నాణ్యత ప్రయోజనాల కోసం మరియు మా సేవలను విశ్లేషించడానికి, అంచనా వేయడానికి మరియు మెరుగుపరచడానికి మీరు అందించిన సూచనలను తనిఖీ చేయడానికి మేము ఈ రికార్డింగ్లను ఉపయోగిస్తాము.
  • భద్రత కోసం మరియు నేరం నివారించడానికి మరియు గుర్తించడానికి మేము చిత్రాలు లేదా వాయిస్ రికార్డింగ్స్ (లేదా రెండూ) పర్యవేక్షించడానికి మరియు సేకరించడానికి మా ప్రాంగణంలో మరియు చుట్టూ సిసిటివి ని ఉపయోగించవచ్చు.
  • మార్కెటింగ్ మరియు ప్రచార కార్యక్రమాల కోసం కూడా మేము మీ వ్యక్తిగత డేటాను ఉపయోగిస్తాము.
  • మేము లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా కూడా మీ వ్యక్తిగత డేటాను అందుకోవచ్చు. భాగస్వామ్యం కలిగి ఉన్న లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్లు మరియు భాగస్వామ్యం ఉద్దేశం గురించి మరింత సమాచారం కోసం దయచేసి లింక్‌పై క్లిక్ చేయండిTVS క్రెడిట్ సర్వీసెస్‌తో ఒప్పందం చేసుకున్న డిజిటల్ లెండింగ్ భాగస్వాములు.

5. మేము మీ వ్యక్తిగత డేటాను ఎవరితో పంచుకుంటాము?

మేము మీ వ్యక్తిగత డేటాను వీరికి వెల్లడించవచ్చు:

  • వ్యాపారం మరియు కార్యాచరణ ప్రయోజనాల కోసం మా పేరెంట్ కంపెనీ.
  • మా అనుబంధ సంస్థలు లేదా గ్రూప్ కంపెనీలు.
  • మా సోర్సింగ్ భాగస్వాములు.
  • ఆర్‌బిఐ మార్గదర్శకాల ప్రకారం లోన్ అర్హత, అండర్‌రైటింగ్ మరియు పంపిణీ తర్వాత సమర్పణ కోసం క్రెడిట్ బ్యూరోలు.
  • మా కోసం పనిచేసే లేదా మాకు సేవలు లేదా ప్రోడక్టులను అందించే థర్డ్ పార్టీ సేవా ప్రదాతలు.
  • మా పార్టనర్లు.
  • రేటింగ్ ఏజెన్సీలు.

మేము ఈ క్రింది పరిస్థితులలో మీ వ్యక్తిగత డేటాను కూడా పంచుకోవచ్చు:

  • కోర్టు ఆర్డర్లు లేదా చట్టపరమైన ప్రక్రియకు ప్రతిస్పందించడానికి లేదా మా చట్టపరమైన హక్కులను స్థాపించడానికి లేదా చట్టపరమైన క్లెయిముల నుండి రక్షణ కోసం.
  • టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్‌ను మరొక కంపనీ సొంతం చేసుకున్నా లేదా మరొక కంపెనీతో విలీనం చేసినా.
  • ఆర్‌బిఐ మార్గదర్శకాల ప్రకారం లోన్ ఎక్స్‌పోజర్ల బదిలీ కోసం.
  • అప్పు తీసుకునే షరతులలో భాగంగా రుణదాతలతో.

6. అంతర్జాతీయ డేటా బదిలీ

మా డేటా కేంద్రాలు భారతదేశంలో ఉన్నాయి. మేము బదిలీ చేసే ఏదైనా వ్యక్తిగత డేటా ఈ ప్రైవసీ పాలసీ ప్రకారం రక్షించబడుతుంది.

7. మేము మీ వ్యక్తిగత డేటాను ఎలా సురక్షితం చేస్తాము?

మా వద్ద ఉన్న మీ వ్యక్తిగత డేటాకు రక్షణ కలిపించడానికి మేము కట్టుబడి ఉన్నాము. అనధికారిక యాక్సెస్, మార్పు, ట్రాన్స్మిషన్ మరియు తొలగింపు నుండి మీ వ్యక్తిగత డేటాను రక్షించడానికి తగిన భౌతిక, సాంకేతిక మరియు నిర్వాహక భద్రతలు ఉండేలాగా నిర్ధారించడానికి మేము సహేతుకమైన చర్యలు తీసుకుంటాము. మీ వ్యక్తిగత డేటా యొక్క గోప్యత మరియు భద్రతను నిర్వహించే ప్రాముఖ్యత గురించి మేము మా ఉద్యోగులకు శిక్షణ ఇస్తాము. మీ వ్యక్తిగత డేటాను మేము షేర్ చేసే థర్డ్ పార్టీలు తగిన ఒప్పందాల ప్రకారం ఉన్నాయని మేము నిర్ధారిస్తాము మరియు మా పాలసీలకు అనుగుణంగా మీ వ్యక్తిగత డేటాను రక్షించడానికి మేము తగిన భద్రతా చర్యలు తీసుకుంటాము.

8. మేము మీ వ్యక్తిగత డేటాను ఎంతకాలం ఉంచుతాము?

ఈ గోప్యతా విధానంలో మరియు చట్టపరమైన లేదా నియంత్రణ కారణాల కోసం అవసరమైన ప్రయోజనాలను నెరవేర్చడానికి అవసరమైనంత కాలం మీ వ్యక్తిగత డేటాను మేము నిలిపి ఉంచుతాము.

9. మేము కుకీలు మరియు ఇతర ట్రాకింగ్ వ్యవస్థలను ఎలా ఉపయోగిస్తాము?

మీ గురించిన డేటాను సేకరించడానికి మేము మా వెబ్‌సైట్‌లో కుకీలు మరియు ఇతర ట్రాకింగ్ వ్యవస్థలను ఉపయోగిస్తాము. ట్రెండ్లు మరియు గణాంకాలను విశ్లేషించడానికి మేము కుకీలు మరియు ట్రాకర్ల నుండి సేకరించిన డేటాను ఉపయోగిస్తాము. ఇది మీ వెబ్‌సైట్ అనుభవాన్ని ఆప్టిమైజ్ చేయడానికి మరియు కస్టమైజ్ చేయడానికి మరియు మెరుగైన వెబ్‌సైట్ ఫంక్షనాలిటీలు మరియు మీకు వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి మాకు సహాయపడుతుంది.

కెమెరా, కాంటాక్ట్స్ / టెలిఫోన్, సుమారు (నెట్‌వర్క్ ఆధారిత) లొకేషన్, ఖచ్ఛితమైన (జిపిఎస్‌) లొకేషన్, అకౌంట్ల జాబితా, ఎక్స్‌టర్నల్ స్టోరేజ్ కంటెంట్స్, ఫోటో, ఎస్ఎంఎస్‌ మొదలైనటువంటి అనుమతులను ఉపయోగించి మొబైల్ అప్లికేషన్ ద్వారా మేము మీ గురించి వ్యక్తిగత డేటాను సేకరిస్తాము. మీ ఐఒఎస్‌ మరియు ఆండ్రాయిడ్ డివైస్లు మా యాప్ కోరుకున్న అనుమతులను మీకు తెలియజేస్తాయి మరియు అనుమతిని అందించడానికి లేదా తిరస్కరించడానికి మీకు ఒక ఎంపికను అందిస్తాయి. మొబైల్ అప్లికేషన్ ద్వారా ఫంక్షనాలిటీలను అందించడానికి మేము అనుమతుల ద్వారా పొందిన డేటాను ఉపయోగిస్తాము. మొబైల్ అప్లికేషన్ ద్వారా క్రెడిట్ అండర్‌రైటింగ్ మరియు ఫంక్షనాలిటీలను అందించడానికి మేము మా మొబైల్ అప్లికేషన్‌లో కొన్ని ట్రాకర్లను కూడా పొందుపరచాము.

మా మొబైల్ అప్లికేషన్‌ను యాక్సెస్ చేసేటప్పుడు మొబైల్ అనుమతుల ఉపయోగం కోసం మీరు సమ్మతి ఇచ్చిన చోట, మీ మొబైల్ డివైజ్ యొక్క సెట్టింగుల విభాగం నుండి మీ సమ్మతిని రద్దు చేసుకునే ఎంపిక మీకు ఉంటుంది. అనేక సందర్భాల్లో, అటువంటి ఉపసంహరణ తర్వాత, మీరు మొబైల్ అప్లికేషన్ యొక్క కొన్ని ఫీచర్లను యాక్సెస్ చేయలేకపోవచ్చు లేదా మా ప్రోడక్టులు మరియు సేవలను ఉపయోగించడం కొనసాగించలేకపోవచ్చు.

10. మేము మీ వ్యక్తిగత డేటాను ఏ ప్రాతిపదికన ప్రాసెస్ చేస్తాము?

ఈ క్రింద పేర్కొన్న ప్రాతిపదికలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటి ఆధారంగా మీ వ్యక్తిగత డేటాను మేము ప్రాసెస్ చేస్తాము:

  • నిర్దిష్ట కారణాల కోసం మీ వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడానికి మీరు మాకు సమ్మతిని తెలియజేశారు.
  • చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు, ప్రభుత్వ ఏజెన్సీలు, రెగ్యులేటర్లు మొదలైన ఇతర పార్టీల పట్ల ఉన్న చట్టపరమైన నియమం యొక్క సమ్మతి కోసం ప్రాసెసింగ్ తప్పనిసరి.
  • ఉపాధి ప్రయోజనాల కోసం అవసరమైన ప్రాసెసింగ్.
  • మా సహేతుకమైన ఉద్దేశాలను నెరవేర్చడానికి ప్రాసెసింగ్ అవసరం. (ఉదాహరణకు, క్రెడిట్ స్కోరింగ్, రుణ రికవరీ, మోసంతో సహా ఏదైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నివారణ మరియు గుర్తింపు, మా ప్రోడక్టులు మరియు సేవలను మూల్యాంకన చేయడానికి, అభివృద్ధి చేయడానికి మరియు మెరుగుపరచడానికి)
  • మీతో అమలు చేయబడిన ఒప్పందం కింద మా ఒప్పంద బాధ్యతను నెరవేర్చడానికి ప్రాసెసింగ్ అవసరం మరియు దాని కోసం అటువంటి ఒప్పందం కింద మీ సమ్మతి అందించబడుతుంది.

11. మీ వ్యక్తిగత డేటాకు సంబంధించిన మీ హక్కులు ఏమిటి?

మాతో ఉన్న మీ వ్యక్తిగత డేటాకు సంబంధించి మీకు కొన్ని హక్కులు ఉన్నాయి మరియు మేము వాటిని అందించడానికి కట్టుబడి ఉన్నాము. మీ హక్కుల జాబితాను మేము అందించాము, అయితే ప్రతి సందర్భంలో అవి ఎల్లప్పుడూ వర్తించకపోవచ్చని దయచేసి గమనించండి.

  • సమాచార హక్కు: ఇతర సంబంధిత సమాచారంతో పాటు మా వద్ద ఉన్న మీ వ్యక్తిగత డేటా మరియు మీ వ్యక్తిగత డేటా పంచుకోబడిన అన్ని థర్డ్ పార్టీల గుర్తింపు సమాచారం యొక్క నిర్ధారణ మరియు సారాంశాన్ని పొందే హక్కు మీకు ఉంది.
  • సరిచేసే హక్కు: మా వద్ద ఉన్న మీ వ్యక్తిగత డేటాలో సరికాదు అని భావించిన వాటిని సరిచేయమని అడిగే హక్కు మీకు ఉంది. అసంపూర్ణమైన లేదా పాతది అని భావించిన మీ వ్యక్తిగత డేటాను అప్‌డేట్ చేయమని అడిగే హక్కు మీకు ఉంది.
  • చెరిపివేయడానికి హక్కు: కొన్ని పరిస్థితులలో మాతో ఉన్న మీ వ్యక్తిగత డేటాను తొలగించమని మమ్మల్ని అడగడానికి మీకు హక్కు ఉంది.
  • ఫిర్యాదు పరిష్కారం యొక్క హక్కు: మీరు 7 రోజుల్లోపు మా నుండి ప్రతిస్పందన అందకపోతే డేటా ప్రొటెక్షన్ బోర్డుకు ఫిర్యాదు చేసే హక్కు మీకు ఉంది.
  • నామినేట్ చేయడానికి హక్కు: మరణం లేదా సామర్థ్య లోపం సందర్భంలో మీ తరపున పనిచేసే వ్యక్తిని నామినేట్ చేసే హక్కు మీకు ఉంది.
  • థర్డ్ పార్టీలకు బహిర్గతం చేయడాన్ని పరిమితం చేసే హక్కు: కొన్ని పరిస్థితులలో థర్డ్ పార్టీలకు మీ వ్యక్తిగత డేటా బహిర్గతం చేయడాన్ని పరిమితం చేయమని అడిగే హక్కు మీకు ఉంది.

ప్రాసెసింగ్ మీ సమ్మతి ఆధారంగా ఉంటే, ఏ సమయంలోనైనా మీ సమ్మతిని రద్దు చేసుకునే ఎంపిక మీకు ఉంది. మీ సమ్మతిని రద్దు చేయడానికి మీ అభ్యర్థన అందుకున్న తర్వాత, రద్దు యొక్క పరిణామాలు మీకు తెలియజేయబడతాయి. అనేక సందర్భాల్లో, అటువంటి ఉపసంహరణ తర్వాత, మేము మీకు మా ప్రోడక్టులు మరియు సేవలను అందించడం కొనసాగించలేకపోవచ్చు.

మన మధ్య ప్రస్తుతం ఉన్న ఒప్పంద సంబంధం కింద, సమ్మతి ఉపసంహరణ అనేది అందుకోసం అందించబడిన అసలు సమ్మతికి సంబంధించి మీ అన్ని ఒప్పంద బాధ్యతలను నెరవేర్చిన మీదట మాత్రమే అమలు అవుతుంది.

మమ్మల్ని సంప్రదించండి' విభాగంలో పేర్కొన్న వివరాలను ఉపయోగించి మమ్మల్ని సంప్రదించడం ద్వారా మీరు మీ సమ్మతిని రద్దు చేయవచ్చు.

మీరు మీ హక్కులలో దేనినైనా వినియోగించుకోవడానికి, మా గోప్యతా పద్ధతుల గురించి ఏవైనా సమస్యలను పేర్కొనడానికి, లేదా ఇతర గోప్యతా సంబంధిత సమాచారాన్ని పొందడానికి ఒక అభ్యర్థన చేయాలనుకుంటే, మీరు 'మమ్మల్ని సంప్రదించండి' విభాగంలో పేర్కొన్న వివరాలను ఉపయోగించి మమ్మల్ని సంప్రదించవచ్చు. అయితే, మీరు టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ యొక్క ప్రస్తుత లేదా గత కస్టమర్ అయితే, ఒప్పంద బాధ్యత మూసివేసిన తర్వాత అటువంటి కనీస వ్యవధి వరకు మా వ్యవస్థల నుండి మీ వ్యక్తిగత డేటాను తొలగించే స్థితిలో మేము ఉండము, ఎందుకంటే వర్తించే చట్టాలు మరియు నిబంధనల క్రింద వాటిని నిలిపి ఉంచడానికి మా పై చట్టపరమైన కట్టుబాటు ఉంది. అలాగే, అటువంటి వ్యక్తిగత డేటా ఏదైనా ప్రస్తుత వ్యాజ్య ప్రయోజనం కోసం నిలిపి ఉంచవలసి ఉంటే, అటువంటి వ్యాజ్యం ముగిసే వరకు నిలిపి ఉంచబడుతుంది.

12. ఇతర వెబ్‌సైట్లకు లింకులు

మా వెబ్‌సైట్‌లో ఇతర సంస్థల వెబ్‌సైట్‌లకు సంబంధించిన లింకులు ఉండవచ్చు. ఆ సంస్థ వ్యక్తిగత డేటాను ఎలా ప్రాసెస్ చేస్తుందో ఈ గోప్యతా విధానం కవర్ చేయదు. మీరు సందర్శించే ఇతర వెబ్‌సైట్‌ల గోప్యతా విధానాన్ని చదవడానికి మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.

13. మేము ఈ పాలసీని ఎలా అప్ టు డేట్ గా ఉంచుతాము?

తాజా సమాచారంతో ఖచ్చితముగా ఉండే విధంగా నిర్ధారించడానికి మేము క్రమం తప్పకుండా ప్రైవసీ పాలసీని సమీక్షిస్తాము మరియు అప్‌డేట్ చేస్తాము. ఈ ప్రైవసీ పాలసీకి భవిష్యత్తులో మేము చేసే ఏవైనా మార్పులు ఈ పేజీలో పోస్ట్ చేయబడతాయి. ఈ ప్రైవసీ పాలసీలో మార్పులను మేము పోస్ట్ చేసినప్పుడు, మేము "చివరగా అప్‌డేట్ చేయబడిన" తేదీని సవరిస్తాము.

14. టీవీఎస్‌సిఎస్ లీగల్ డిస్‌క్లెయిమర్ అంటే ఏమిటి?

ఈ సైట్‌లో ఉన్న సమాచారం "ఉన్నది ఉన్నట్లు" మరియు "అందుబాటులో ఉన్న విధంగా" ప్రాతిపదికన అందించబడుతుంది. ఈ సైట్ యొక్క మీ వినియోగం అనేది మీ ఏకైక రిస్క్ పై ఉంటుంది అని మీరు అంగీకరిస్తున్నారు. చట్టం ద్వారా అనుమతించబడిన పూర్తి పరిధి మేరకు టీవీఎస్‌సిఎస్, దాని అధికారులు, డైరెక్టర్లు, ఉద్యోగులు మరియు ఏజెంట్లు సైట్‌కు సంబంధించి మరియు మీ దాని యొక్క మీ వినియోగం కి సంబంధించి స్పష్టమైనవి లేదా సూచించబడిన అన్ని వారెంటీలను నిరాకరిస్తున్నారు. కమ్యూనికేషన్లు, పర్సనలైజ్ చేయబడిన సెట్టింగ్స్, లేదా ఇతర డేటా తొలగింపు, తప్పు డెలివరీ లేదా నిల్వ చేయడంలో వైఫల్యం యొక్క సంభావ్యత గురించి టీవీఎస్‌సిఎస్ ఎటువంటి హామీ ఇవ్వదు. సైట్ ద్వారా లేదా హైపర్‌లింక్ చేయబడిన వెబ్‌సైట్ లేదా ఏదైనా బ్యానర్ లేదా ఇతర అడ్వర్టైజింగ్ ద్వారా ఒక థర్డ్ పార్టీ ద్వారా ప్రచారం చేయబడిన లేదా అందించబడిన ఏదైనా ప్రోడక్ట్ లేదా సర్వీస్ కోసం టీవీఎస్‌సిఎస్ హామీ ఇవ్వదు, ఎండార్స్ చేయదు, పూచీ ఇవ్వదు, లేదా బాధ్యతను తీసుకోదు, మరియు మీకు మరియు థర్డ్ పార్టీ ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్‌ల మధ్య ఏదైనా ట్రాన్సాక్షన్‌ను పర్యవేక్షించడానికి టీవీఎస్‌సిఎస్ భాగం అవ్వదు లేదా ఏ విధంగానూ బాధ్యత తీసుకోదు. ఏదైనా మాధ్యమం లేదా ఏదైనా పరిస్థితిలో ఏదైనా ఆర్థిక సేవలను పొందడానికి మీరు వివేకంతో వ్యవహరించాలి మరియు అవసరమైన చోట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ సైట్‌లో ఉన్న విషయానికి సంబంధించి లేదా ఈ సైట్‌కు లింక్ చేయబడిన ఏదైనా సైట్లలోని విషయానికి సంబంధించి ఖచ్చితత్త్వం, కాలీనత, లేదా సంపూర్ణత గురించి టీవీఎస్‌సిఎస్ ఎటువంటి హామీ లేదా ప్రాతినిధ్యం అందించదు మరియు విషయానికి సంబంధించి ఏవైనా లోపాలు, తొలగింపులు, తప్పులు. లేదా వ్యత్యాసాలు లేదా ఏదైనా నష్టం లేదా గాయానికి ఎటువంటి పూచీ లేదా బాధ్యత వహించదు.

15. బాధ్యత పరిమితి అంటే ఏమిటి?

ఎటువంటి పరిస్థితిలోనూ టీవీఎస్‌సిఎస్, దాని అధికారులు, డైరెక్టర్లు, ఉద్యోగులు, లేదా ఏజెంట్లు ఇక్కడ పేర్కొన్న వాటి కారణంగా ఏదైనా పరోక్ష, అనుకోని, ప్రత్యేక, శిక్షణాత్మక, లేదా పర్యవసాన నష్టాలకు మీ పట్ల బాధ్యత వహించరు: (i) విషయంలో లోపాలు, తప్పులు, లేదా వ్యత్యాసాలు, (ii) ఈ సైట్ యొక్క మీ యాక్సెస్ మరియు వినియోగం ఫలితంగా కలిగిన ఏ రకమైన వ్యక్తిగత గాయం లేదా ఆస్తి నష్టం, (iii) మా సురక్షితమైన సర్వర్లు మరియు/లేదా అందులో నిల్వ చేయబడిన అన్ని వ్యక్తిగత సమాచారం మరియు/లేదా ఆర్థిక సమాచారం యొక్క అనధికార యాక్సెస్ లేదా వినియోగం, (iv) సైట్‌కు లేదా సైట్ నుండి ట్రాన్స్‌మిషన్ యొక్క అంతరాయం లేదా నిలుపుదల, (iv) ఏదైనా థర్డ్ పార్టీ యొక్క సైట్ ద్వారా ట్రాన్స్‌మిట్ చేయబడే అవకాశం ఉన్న ఏదైనా బగ్స్, వైరస్లు, ట్రోజన్ హార్సెస్ వంటివి, (v) ఏదైనా విషయంలో ఏదైనా తప్పులు లేదా తొలగింపులు, (vi)యూజర్ సబ్మిషన్లు లేదా ఏదైనా థర్డ్ పార్టీ నుండి అపఖ్యాతి కలిగించేది, అవమానకరమైంది, లేదా చట్టవ్యతిరేకమైన ప్రవర్తన, (vii) సైట్‌లో ఏదైనా భాగం యొక్క మీ వినియోగం, లేదా వినియోగించడంలో మీ అసమర్థత లేదా సైట్‌లో పోస్ట్ చేయబడిన, ఇమెయిల్ చేయబడిన, ట్రాన్స్‌మిట్ చేయబడిన, లేదా ఇతర విధాలుగా అందుబాటులో ఉంచబడిన ఏదైనా విషయం, అది వారంటీ, ఒప్పందం, అపరాధం, లేదా ఏదైనా చట్టపరమైన సిద్ధాంతం, మరియు అటువంటి నష్టాల యొక్క సంభావ్యత గురించి కంపెనీ సలహా అందించినా లేదా అందించకపోయినా, పైన పేర్కొనబడిన బాధ్యత యొక్క పరిమితి వర్తించే అధికార పరిధిలో చట్టప్రకారం అనుమతించబడిన పూర్తి పరిధి మేరకు వర్తిస్తుంది.

16. వివాద పరిష్కారం యొక్క విధానం ఏమిటి?

ఇక్కడ పేర్కొనబడిన లేదా ఇక్కడ ఉన్నవి ఏవైనా లేదా ఇక్కడ పేర్కొనబడిన వాటికి ఏ విధంగానైనా సంబంధం ఉన్న లేదా ఇక్కడ ఉన్న వాటి ద్వారా ఏర్పడిన వాటి వలన టీవీఎస్‌సిఎస్ మరియు మీ మధ్య ఈ ఒప్పందం వలన ఏర్పడే ఏవైనా అన్ని వివాదాలు, భేదాలు, క్లెయిమ్లు మరియు ప్రశ్నలు ఆర్బిట్రేషన్ మరియు కన్సిలియేషన్ చట్టం 1996 కింద టీవీఎస్‌సిఎస్ ద్వారా నియమించబడిన ఏకైక ఆర్బిట్రేటర్‌కి రిఫర్ చేయబడతాయి.. టీవీఎస్‌సిఎస్ వద్ద రిజిస్ట్రేషన్ సమయంలో యూజర్ ద్వారా అందించబడిన ఇమెయిల్ ఐడి కి ఒక ఇమెయిల్ ద్వారా ఆర్బిట్రేటర్ ద్వారా ప్రతివాదులకు ఇవ్వబడే నోటీసు అనేది యూజర్ కోసం తగిన నోటీసుగా పరిగణించబడుతుంది. ఆర్బిట్రేషన్ విధానాల ఖర్చులు మరియు వ్యయాలు యూజర్ భరిస్తారు. ఆర్బిట్రేషన్ స్థలం చెన్నైలో ఉంటుంది. ఏకైక ఆర్బిట్రేటర్ ద్వారా ఇవ్వబడిన తీర్పు అంతిమం మరియు పార్టీలు కట్టుబడి ఉండాలి.

17. మీరు మమ్మల్ని ఎలా సంప్రదించవచ్చు?

గోప్యతకు సంబంధించిన మరిన్ని ప్రశ్నలు మరియు ఫిర్యాదుల కోసం, మీరు ఈ క్రింది చిరునామాకు వ్రాయడం ద్వారా మమ్మల్ని సంప్రదించండి:
gdpo@tvscredit.com

ఏదైనా ఫిర్యాదు పరిష్కారం లేదా ఎస్కలేషన్ల కోసం, మీరు ఈ క్రింది చిరునామాలో మమ్మల్ని సంప్రదించవచ్చు:
ఫిర్యాదు పరిష్కార అధికారి (శ్రీ చరణదీప్ సింగ్ చావ్లా)
gro@tvscredit.com
టీవీఎస్ క్రెడిట్ సర్వీసస్ లిమిటెడ్.
నంబర్ 29, జయలక్ష్మి ఎస్టేట్,
3వ అంతస్తు, హ్యాడోస్ రోడ్,
నుంగంబాక్కం,
చెన్నై – 600034

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి