టీవీఎస్ క్రెడిట్ వద్ద చరణ్‌దీప్ సింగ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (సిఎంఒ)గా పనిచేసారు. వీరు పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుండి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌లో బి.టెక్, ముంబైలోని నర్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుండి మార్కెటింగ్‌లో ఎంబిఎ డిగ్రీని పూర్తి చేసారు. బిఎఫ్ఎస్ఐ మరియు ఆటోమోటివ్ పరిశ్రమలలో 18 సంవత్సరాల మార్కెటింగ్, సేల్స్, సిఆర్ఎం మరియు వ్యూహాత్మక నైపుణ్యం కలిగిన వీరు బ్రాండ్ కమ్యూనికేషన్, మార్కెట్ పరిశోధన, డిజిటల్ బిజినెస్, అనలిటిక్స్ మరియు కస్టమర్ రిలేషన్షిప్ నిర్వహణలో అనేక కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. అయన కంపెనీ వెబ్సైట్లు మరియు మొబైల్ యాప్‌లు క్రియేట్ చేయడంతో పాటు, అనేక అవార్డులు గెలుచుకున్న మార్కెటింగ్ ప్రచారాలతో సహా వివిధ పరివర్తనాత్మక ప్రయత్నాల కోసం నాయకత్వం వహించారు. అతను కస్టమర్ ఎంగేజ్మెంట్ మరియు అనుభవాన్ని మెరుగుపరిచే పలు కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేశారు.
టీవీఎస్ క్రెడిట్ యొక్క కొత్త బ్రాండ్ గుర్తింపును రూపొందించడంలో వీరు కీలక పాత్ర పోషించారు. ఇది మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా సంస్థకు కొత్త రూపాన్ని, గుర్తింపును కల్పించడంలో ఎంతగానో దోహదపడింది. వీరి మార్గదర్శకత్వంలో, ఈ సంస్థ వివిధ మార్కెటింగ్ కార్యక్రమాల కోసం అనేక అవార్డులను అందుకుంది, వీటిలో ప్రఖ్యాత ఆర్ఎంఎఐ ఫ్లేమ్ అవార్డులు ఆసియా 2018లో ఉత్తమ విజిబిలిటీ మరియు విజువల్ క్యాంపెయిన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా ఉంది. 2020 సంవత్సరానికి గాను ఆసియా టాప్ కంటెంట్ మొఘల్‌గా గుర్తింపు పొందారు. 2018లో అడోబ్ డిజి100 నుండి టాప్100 డిజిటల్ మార్కెటర్లలో ఒకరిగా పేరు సంపాదించారు, 2018లో లింక్డ్ఇన్ నుండి కంటెంట్ మార్కెటింగ్ విభాగంలో టాప్50 లీడర్స్ జాబితాలో ఒకరిగా నిలిచారు. అంతేకాకుండా, ఎంఎంఎఫ్ఎస్ఎల్లో ఉన్నప్పుడు, వీరు 2017 రూరల్ మార్కెటింగ్ అవార్డులలో యూత్ అచీవర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు.