కస్తూరిరంగన్ పివి, వివిధ ఆర్థిక రంగాల్లో 25 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఒక చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. టివిఎస్ క్రెడిట్ చీఫ్ ట్రెజరీ ఆఫీసర్గా ఈయన లయబిలిటీ మేనేజ్మెంట్, పెట్టుబడులు, రేటింగ్లు మరియు బాహ్య వాటాదారుల ఇంటరాక్షన్లను పర్యవేక్షిస్తారు. పన్నులు, ఖర్చులు, ఆడిటింగ్, ఆర్థిక నివేదికలు మరియు వ్యూహాత్మక ఆర్థిక ప్రణాళిక మరియు నిర్వహణ లాంటి ప్రధానమైన అంశాల్లో వీరికి అపారమైన అనుభవం ఉంది. టివిఎస్ క్రెడిట్లో చేరడానికి ముందు ఈయన నిస్సాన్ అశోక్ లేల్యాండ్ జెవిల సిఎఫ్ఒ లలో ఒకరిగా ఉన్నారు. అంతర్జాతీయ ఎక్స్పోజర్తో పాటు రెండు ముఖ్యమైన సంస్థలు, టివిఎస్ మరియు అశోక్ లేల్యాండ్తో అనేక రంగాలలో వారికి పని అనుభవం ఉంది.