శ్రీ బి. శ్రీరామ్ విశేషమైన అనుభవం కలిగిన వృత్తినిపుణుడు. ఈయన ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ & ఫైనాన్స్ (గతంలో ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్) యొక్క సర్టిఫికెటెడ్ అసోసియేట్, మరియు న్యూఢిల్లీ లోని ఇండియన్ అకాడమీ ఆఫ్ ఇంటర్నేషనల్ లా & డిప్లోమసి నుండి ఇంటర్నేషనల్ లా & డిప్లోమసి లో డిప్లొమా పొందారు మరియు న్యూఢిల్లీ లోని ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ నుండి మేనేజ్మెంట్లో AIMA డిప్లొమా పొందారు. ఈయన ఒక హానర్స్ గ్రాడ్యుయేట్ మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయం కింద ఉన్న సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుండి మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉన్నారు.
తన కెరీర్లో భాగంగా శ్రీ శ్రీరామ్ జులై 2014 నుండి జూన్ 2018 వరకు ఐడిబిఐ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మేనేజింగ్ డైరెక్టర్ సహా వివిధ ఎగ్జిక్యూటివ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన డిసెంబర్ 1981 లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు మరియు క్రెడిట్ మరియు రిస్క్, రిటైల్, ఆపరేషన్స్, ఐటి, ట్రెజరీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ మరియు ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ వంటి విభాగాల్లో బ్యాంకు మరియు గ్రూపులో కీలక విధులు చేపట్టారు.
శ్రీ శ్రీరామ్ ప్రస్తుతం ICICI బ్యాంకు బోర్డులో స్వంతత్ర డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మరియు బ్యాంకు యొక్క వివిధ కమిటీలలో సభ్యుడు/ ఛైర్మన్గా ఉన్నారు. ఈయన అనేక ఇతర కంపెనీల బోర్డులలో స్వతంత్ర డైరెక్టర్గా సేవలు అందిస్తున్నారు. అదనంగా, ఈయన కొన్ని అడ్వైజరీ విధులు కూడా చేపట్టారు.