శ్రీ గోపాలన్ గొప్ప ప్రజ్ఞ మరియు నైపుణ్యం కలిగిన వ్యక్తి, భారతదేశంలో ఆర్థిక రంగ అభివృద్ధికి ఈయన విశేషంగా కృషి చేశారు. ఈయన తన వృత్తి జీవితంలో భాగంగా అనేక ప్రముఖ బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన ప్రస్తుతం ప్రధాన మంత్రి నియంత్రణలో ఉన్న పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు (పిఇఎస్బి) సభ్యునిగా సేవలు అందిస్తున్నారు. పిఇఎస్బి వద్ద ఈ బాధ్యతను చేపట్టడానికి ముందు శ్రీ గోపాలన్ భారతదేశ ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క వాణిజ్య వ్యవహారాల విభాగంలో సెక్రటరీగా జులై 2012 లో పదవీ విరమణ చేసే వరకు విధులు నిర్వర్తించారు. తన విధులలో భాగంగా జి-20 సమావేశాలు, ఎడిబి, ప్రపంచ బ్యాంకు, మరియు ఐఎంఎఫ్ సమావేశాలు సహా వివిధ అంతర్జాతీయ ఫోరమ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.. ఈయన క్యాపిటల్ మార్కెట్ల నిర్వహణలో అనేక మార్పులు తీసుకువచ్చారు మరియు మౌలికవసతులలో కొత్త పాలసీ విధానాలను ప్రవేశపెట్టారు. వాణిజ్య వ్యవహారాల విభాగంలో సెక్రటరీగా విధులు చేపట్టే ముందు శ్రీ గోపాలన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క ఆర్థిక సేవల విభాగం యొక్క సెక్రటరీగా బాధ్యతను నిర్వర్తించారు, విధులలో భాగంగా ఈయన బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ మరియు పెన్షన్ సంస్కరణలను పర్యవేక్షించారు. ఈ విధులలో భాగంగా, ఈయన పాలసీ మార్గనిర్దేశకాలు, చట్టపరమైన మరియు ఇతర పరిపాలన మార్పుల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులు (పిఎస్బి లు), ఇన్సూరెన్స్ కంపెనీలు, మరియు డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ల (డిఎఫ్ఐలు) కు మద్దతును ఇచ్చారు, వాటి పనితీరును పర్యవేక్షించారు, మరియు ఎన్‌బిఎఫ్‌సిలు, ప్రైవేట్ బ్యాంకుల, మరియు విదేశీ బ్యాంకుల కోసం పాలసీలను రూపొందించారు. ఈయన పరిశ్రమ, బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల మధ్య సమన్వయం చేశారు మరియు వాణిజ్య చర్చల కోసం డబ్ల్యుటిఒ యొక్క వివిధ మంత్రిత్వ సమావేశాలలో చురుగ్గా పాల్గొన్నారు. శ్రీ గోపాలన్ బోస్టన్ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ మరియు హార్వర్డ్ విశ్వవిద్యాలయం కింద ఉన్న జాన్ ఎఫ్ కెన్నడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్నారు.