శ్రీ వేణు శ్రీనివాసన్ అనుభవజ్ఞుడైన ఇంజనీర్ మరియు యుఎస్ఎ లోని పర్డ్యూ విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ పట్టా పొందారు. 1979 లో టీవీఎస్ మోటార్ హోల్డింగ్ కంపెనీ అయిన సుందరం-క్లేటన్ సిఇఒ గా ఈయన బాధ్యతను చేపట్టారు మరియు టూ వీలర్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినవారిగా విస్తృత ఖ్యాతిని గడించారు. ఈయన భారతదేశంలో భాగస్వామ్య వ్యాపారాలు మరియు కొత్త తరం టూ వీలర్లను ప్రవేశపెట్టారు, వీటి ద్వారా భారతీయ కంపెనీలు ప్రపంచస్థాయికి చేరుకున్నాయి, శ్రేష్ఠత పట్ల నిబద్దతతో మరియు ఆవిష్కరణ సంస్కృతిని అలవర్చుకుని అత్యుత్తమ ప్రోడక్టులను తయారు చేస్తున్నాయి. ఈయన అనేక ప్రశంసలు మరియు అవార్డులను అందుకున్నారు, వీటిలో 2014 లో కొరియన్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ నుండి అందుకున్న ఆర్డర్ ఆఫ్ డిప్లొమాటిక్ సర్వీస్ మెరిట్, 2004 లో ఆల్-ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ నుండి అందుకున్న జెఆర్‌డి టాటా కార్పొరేట్ లీడర్షిప్ అవార్డు, భారతదేశ ప్రెసిడెంట్ నుండి 2010 లో అందుకున్న పద్మ శ్రీ మరియు 2020 లో అందుకున్న పద్మ భూషణ్ అవార్డులు ఉన్నాయి. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ (టిక్యుఎం) కి అందించిన సహకారం కోసం 2019 లో డెమింగ్ 'డిస్టింగ్విష్డ్ సర్వీస్ అవార్డ్ ఫర్ డిస్సెమినేషన్ అండ్ ప్రమోషన్ ఓవర్సీస్' అందుకున్న తొలి భారతీయ పారిశ్రామికవేత్తగా నిలిచారు. ప్రస్తుతం, శ్రీ శ్రీనివాసన్ టీవీఎస్ మోటార్ కంపెనీ యొక్క చైర్మన్ ఎమెరిటస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.