టూ-వీలర్ మరియు యూజ్డ్ కార్ల రిటైల్ వ్యాపార విభాగానికి నాయకత్వం వహిస్తున్న మురళీధర్ శ్రీపతి, 15 ప్రధాన భారతీయ రాష్ట్రాల్లో 30 సంవత్సరాలకు పైగా బహుళ-కార్యాచరణ నైపుణ్యం కలిగిన ఒక అనుభవజ్ఞులైన నిపుణుడు మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన గతంలో సుందరం ఫైనాన్స్ చోళా విఎఫ్, అలాగే బిఎఎఫ్ఎల్ కోసం పని చేశారు. అమ్మకాలు, సేకరణలు, క్రెడిట్, బిజినెస్ కమర్షియల్ వాహనాలు, కొత్త కార్లు, యూజ్డ్ కార్లు, టూ-వీలర్లు, కార్పొరేట్ లీజింగ్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆఫీస్ ఆటోమేషన్ పరికరాలు మరియు వైద్య పరికరాలకు ఫైనాన్సింగ్ లాంటివి అతను నిర్వర్తించిన వాటిలో కొన్ని మాత్రమే.
అతని ప్రాథమిక సామర్థ్యాలలో క్రైసిస్ మేనేజ్మెంట్, స్టార్ట్-అప్ మరియు బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పనులు ఉన్నాయి. మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ అయిన అతను గ్రేట్ లేక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, చెన్నై నుండి బిజినెస్ అనలిటిక్స్ సర్టిఫికేషన్ కూడా కలిగి ఉన్నారు.