పియూష్ చౌదరికి దాదాపు 18 సంవత్సరాల ఆడిటింగ్ అనుభవం ఉంది మరియు వీరు చార్టర్డ్ అకౌంటెంట్ (ఐసిఎఐ), సిఐఎస్ఎ (పాస్డ్) (బిగ్ 4 మరియు బిఎఫ్ఎస్ఐ పరిశ్రమ) గా కూడా పనిచేసారు. టీవీఎస్ క్రెడిట్లో వీరు ఆర్బిఐ ప్రమాణాలకు లోబడి చీఫ్ ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్‌గా బలమైన రిస్క్ ఆధారిత ఇంటర్నల్ ఆడిట్ (ఆర్బిఐఎ) ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు కోసం నాయకత్వం వహిస్తున్నారు. పియూష్ గారికి బ్యాంకులు, బ్యాంకు యేతర ఆర్థిక సంస్థల (ఎన్బిఎఫ్సి) కోసం రిస్క్-బేస్డ్ ఇంటర్నల్ ఆడిట్ (ఆర్బిఐఎ) ముసాయిదాను రూపొందించడం, అంతర్గత ఆడిట్ విధానాలను ఆటోమేట్ చేయడం, ఐటి ఆడిట్లను నిర్వహించడం, అంతర్గత ఆర్థిక నియంత్రణ (ఐఎఫ్సి) ఫ్రేమ్‌వర్క్‌లను అభివృద్ధి చేయడం మరియు వాటిని ఆడిట్ కమిటీలకు సమర్పించడం లాంటి విధి విధానాల్లో గొప్ప అనుభవం ఉంది. వీరికి పిడబ్ల్యుసి మరియు డెలాయిట్ సంస్థలలో సిస్టమ్ మరియు ప్రాసెస్ అస్యూరెన్స్ విభాగాల్లో అనేక ప్రాజెక్టుల కోసం (అప్లికేషన్ కంట్రోల్స్ టెస్టింగ్, ఐటిజిసి ఆడిట్స్, ఎస్ఒఎక్స్, ఎస్ఎస్ఎఇ 16 ఎంగేజ్మెంట్స్) కోసం పనిచేసిన అనుభవం ఉంది.