రూప సంపత్ కుమార్, అకౌంటింగ్ కార్యకలాపాలు, ట్రెజరీ నిర్వహణ, సంస్థ నిర్మాణం, పాలన మరియు స్టేక్‌హోల్డర్ ఎంగేజ్మెంట్ నిర్వహణలో గొప్ప నైపుణ్యం కలిగిన ఒక అనుభవజ్ఞురాలైన ఆర్థిక నిపుణురాలు.
రూప భారతదేశంలో 20 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక చార్టర్డ్ అకౌంటెంట్ మరియు యు.ఎస్.ఎ లో సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్. ఇంతకుముందు, వీరు హిందూజా హౌసింగ్ ఫైనాన్స్‌లో సిఎఫ్ఒ గా ఉన్నారు మరియు హిందూజా లేల్యాండ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో ఆర్థికశాఖ అధిపతిగా పనిచేసారు. అక్కడ రూప, ఫైనాన్స్ అండ్ ట్రెజరీని నిర్వహించారు. ఆమె ప్రైస్ వాటర్ హౌస్ (పిడబ్ల్యుసి) మరియు ఐసిఐసిఐ బ్యాంక్‌తో కూడా పనిచేశారు.