షెల్విన్ మాథ్యూస్ చార్టర్డ్ అకౌంటెంట్ (ఐసిఎఐ) మరియు కాస్ట్ & మేనేజ్మెంట్ అకౌంటెంట్ (ఐసిఎంఎఐ)గా ఆర్థిక సేవా రంగంలో 21 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. వీరు టీవీఎస్ క్రెడిట్ వద్ద సంస్థల స్థాయిలో బలమైన రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రేమ్‌వర్క్ అభివృద్ధి కోసం బాధ్యత వహిస్తారు. వీరు రుణ పరిశ్రమ కోసం సంస్థ స్థాయిలో రిస్క్ మేనేజ్మెంట్ (ఇఆర్ఎం) ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం, కెవైసి-ఎఎంఎల్ నిబంధనలను అమలు చేయడం, అలాగే, ఎన్‌బిఎఫ్‌సిల కోసం ఆర్బిఐ మార్గదర్శకాలతో పాటు రిస్క్ మేనేజ్మెంట్ పాలసీలను సమలేఖనం చేయడం లాంటి అంశాలలో మంచి అనుభవం కలిగి ఉన్నారు. షెల్విన్, ఐఐఎం బెంగళూరు నుంచి ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్లో సర్టిఫికేషన్ పొందారు. వీరు ఐఎస్ఒ 27001 (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్) మరియు ఐఎస్ఒ 22301 (బిజినెస్ కంటిన్యూటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్) సర్టిఫైడ్ ఇంటర్నల్ ఆడిటర్ కూడా. యుగ్రో క్యాపిటల్ లిమిటెడ్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్&టి ఫైనాన్స్ మరియు రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ (రిలయన్స్ క్యాపిటల్ యొక్క అనుబంధ సంస్థ) లాంటి పలు కార్పొరేట్ సంస్థల కోసం రిస్క్ మేనేజ్మెంట్ విభాగంలోని అనేక రంగాలలో పనిచేసారు.