ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎంబిఎ పూర్తి చేసిన సౌజన్య అలూరికి టెక్నాలజీ విజన్ మరియు స్ట్రాటజీలో 25 ఏళ్ల అనుభవం ఉంది. అంతేకాకుండా, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, ఆపరేషన్స్, అజైల్ ట్రాన్స్ఫర్మేషన్, క్లౌడ్ మరియు సైబర్ సెక్యూరిటీ లాంటి వాటిలో మంచి అనుభవం ఉంది. వీరు మాస్టర్ ఆఫ్ సైన్స్‌లో కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా పూర్తి చేసారు.
టీవీఎస్ క్రెడిట్ కంపెనీలో సౌజన్య గారు టెక్ & డిజిటల్ వ్యూహాన్ని రూపొందించేందుకు బాధ్యత వహిస్తారు. టీవీఎస్ క్రెడిట్లో చేరడానికి ముందు, సౌజన్య నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ)లో డిజిటల్ టెక్నాలజీ హెడ్‌గా వ్యవహరించారు, అలాగే, మొబైల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్‌లు, డేటా ప్లాట్‌ఫామ్‌లు, ఎఐ మోడల్‌లు, క్లౌడ్ ట్రాన్స్ఫార్మేషన్ మరియు బ్లాక్ చెయిన్ సెటిల్మెంట్ సిస్టమ్‌ల అభివృద్ధిలో కీలక పాత్రను పోషించారు. ఈమె జిఇ డిజిటల్, సిఫీ మరియు యాక్సెంచర్‌తో కూడా పనిచేసారు. ఆమెకు పర్యావరణం మరియు సుస్థిరత, అలాగే పఠనం అంటే చాలా చాలా ఇష్టం.