వికాస్ అరోరా ఒక అనుభవజ్ఞులైన సమ్మతి, పరిపాలన మరియు చట్టపరమైన నిపుణులు. ముఖ్యంగా బిఎఫ్ఎస్ఐ రంగంలో వీరికి 18 సంవత్సరాల అనుభవం ఉంది. వీరికి కార్పొరేట్ చట్టం, ఎన్బిఎఫ్సి కంప్లయెన్స్, నిబంధనలు, పరిపాలన, డేటా గోప్యత, కార్మిక చట్టాలు, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, లిటిగేషన్ మరియు ఎఫ్ఇఎంఎ, అలాగే యాంటీ-ఫ్రాడ్ మేనేజ్మెంట్, పిఎంఎల్ఎ కంప్లయెన్స్ వంటి వాటిలో అత్యంత నైపుణ్యం ఉంది. వీరు కార్పొరేట్ సెక్రటరీ (ఐసిఎస్ఐ) మరియు న్యాయశాస్త్రంలో డిగ్రీని (ఎల్ఎల్బి) పూర్తి చేసారు. ఒక చీఫ్ కంప్లయెన్స్ అధికారిగా వికాస్, బలమైన కంప్లయెన్స్ ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు మరియు సంస్థ యొక్క కంప్లయెన్స్ సంస్కృతి కోసం మార్గనిర్దేశం చేసేందుకు బాధ్యత వహిస్తారు. టీవీఎస్ క్రెడిట్లో చేరడానికి ముందు, వీరు బిఎండబ్ల్యు ఫైనాన్షియల్ సర్వీసెస్లో కంప్లయెన్స్, లీగల్ మరియు కంపెనీ సెక్రటరీగా పనిచేసారు. అలాగే, గతంలో జిఇ మనీ, కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్ మరియు జెన్పాక్ట్లో విధులు నిర్వర్తించారు.