హర్షద్ సీతారాం చావన్ తన తల్లిదండ్రులు, తమ్ముడు, సోదరితో కలిసి
పూణేలోని అంబేగావ్‌లో నివసిస్తున్నారు. అతని తండ్రి
ఒక కూలీ, స్థిరమైన ఆదాయ వనరు లేదు. హర్షద్
తన కుటుంబాన్ని పోషించడానికి పని చేయాలనుకున్నారు. అతను
తన ప్రాంతంలో నిర్వహించిన మోబిలైజేషన్ డ్రైవ్ ద్వారా మల్టీ-స్కిల్ ప్రోగ్రామ్ గురించి
తెలుసుకున్నారు. వెంటనే ఆయన ఆ కేంద్రాన్ని సందర్శించి, ప్రోగ్రామ్ గురించి
పూర్తి వివరాలను తెలుసుకున్నారు. తన తండ్రిని సంప్రదించిన
తరువాత హర్షద్ ఈ ప్రోగ్రామ్‌లో చేరారు. శిక్షణ పూర్తి చేసుకున్న
అనంతరం నెలకు
₹9,000 సంపాదిస్తూ హై స్పీడ్ మల్టీ సొల్యూషన్స్‌లో పని చేయడం ప్రారంభించారు. తన కుటుంబానికి
మద్దతు ఇవ్వడానికి అవకాశం ఇచ్చినందుకు టివిఎస్ క్రెడిట్ మరియు యువ పరివర్తన్కు
అతను కృతజ్ఞతలు తెలుపుతున్నారు.